ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో విరసం
చరిత్ర వికాసక్రమంలోని ప్రజల అనంతమైన ధిక్కారాలను, సాహసోపేతమైన పోరాట ఆచరణల సారాన్ని విప్లవ రచయితల సంఘం తనలో అంతరంగీకరించుకున్నది. చారిత్రక చోదకశీలమైన మానవ కర్తృత్వమనే సారభూతశక్తిని అపూర్వరీతిలో ప్రేరేపించింది. దీని వల్ల ఆధునిక కాల్పనికత విప్లవ కాల్పనికతగా రూపాంతరం చెందింది. ఈ కోణంలో చూస్తే మిత్రుడు పాణి రాసిన 'సృజనాత్మక ధిక్కారం' అనే పుస్తకానికి నిస్సందేహంగా అత్యంత చారిత్రక ప్రాసంగికత ఉన్నదని చెప్పవచ్చు. విరసం యాభై ఏళ్ల సందర్భంలో తను ఈ పుస్తకం రాశాడు. మామూలుగా కల్పన అనగానే అది వాస్తవంతో ప్రమేయం లేని ఊహాజనితమని చాలా మంది అనుకుంటారు. కాని కల్పనెప్పుడూ మనిషి భౌతిక అస్తిత్వ మూలాలతో










