కవిత్వం

తలుగు తెంపుకున్నా!

మనసు లేని ధర్మం ప్రేమ లేని ధర్మం దయ లేని ధర్మం ఆలోచన లేని ధర్మం తడి తెలియని ధర్మం ద్వేషం ప్రాణమై హింసే చరిత్త్రెన ధర్మం నీ బ్రహ్మ నీ విష్ణు నీ మహేశ్వరుడు మాభుజాల మీద మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక నిచ్చెనమెట్ల స్వర్గాన్ని మీ కిచ్చారు ప్రియమైన హిందూ తాలిబన్లారా! నీ సనాతనం ఉన్నతమైతే మోసీమోసీ అలిసిపోయాం కాడి మార్చుకుందాం రండి ! మా పియ్యి ఉచ్చ మీ రెత్తిపోయండి పశువుల కళేబరాలు మోసుకెళ్ళి చర్మం ఒలిచి చచ్చిన గొడ్డు కూర తినండి మా చెప్పులు మీరు కుట్టండి మా లాగా కూటికి లేక కుమ్ముకు
వ్యాసాలు

ప్రజా యుద్ధకల్పనా రూపం అజ్ఞాత కథ

 (2010 జనవరిలో  మొదటిసారి, 2016  ఫిబ్రవరిలో మరోసారి విరసం పునర్ముద్రించిన *ముప్పై ఏళ్ళ దండకారణ్య సాహితి సాంస్కృతోద్యమ చరిత్ర (1980 -2010) పుస్తకంలో అజ్ఞాత కథ గురించి దండకారణ్య రచయితలు రాశారు. దండకారణ్య సాహిత్య కళా ప్రచార వేదిక ఝన్కార్ గురించీ రాశారు. వియ్యుక్క కథా సంపుటాలు విడుదల అవుతున్న సందర్భంలో అజ్ఞాత విప్ల కథా వికాసాన్ని అర్థం చేసుకోడానికి పనికి వస్తుందని ఈ భాగాలను పునర్ముద్రిస్తున్నాం -వసంత మేఘం టీం) దండకారణ్య సమాజంలో ప్రజల జీవితాలతో, ప్రకృతితో ముడిపడిన కథలు కోకొల్లలు. మనిషికీ-ప్రకృతికీ ఉండే సంబంధాలను, ఉత్పత్తి సంబంధాలను తెలిపే కథలు ప్రజలు ఎన్నైనా చెపుతారు. అలాగే
సమీక్షలు

కొత్త ఒరవడి

(ఇది 2015 జనవరిలో విరసం ప్రచురించిన *సామాన్యుల సాహసం * అనే కథా సంకలనానికి రాసిన ముందు మాట.  మైనా , నిత్య, సుజాత రాసిన కథల సంకలనం ఇది. వీళ్ళు భారత  విప్లవోద్యమంలో సీనియర్ నాయకులు.  అజ్ఞాత కథలో కొత్త ఒరవడి తీసుకొచ్చిన తొలి వరుస రచయిత్రులు.  సామాన్య ప్రజలే  చరిత్రను నిర్మించగల సాహసికులుగా, సృజనశీలురుగా, మహాద్భుత శక్తిగా  వర్గపోరాటం లో  తయారవుతారని విప్లవోద్యమమం నిరూపించింది. ఆ మానవ పరిణామాన్ని ఈ కథలు చిత్రిక పట్టాయి. నలభై ఏళ్ళ అజ్ఞాత రచయిత్రుల కథలు *వియ్యుక్క* గా వెలువడుతున్న ఈ సాహిత్య సాంస్కృతిక వర్గపోరాట చారిత్రిక సందర్భాన్ని అర్థం
ఆర్ధికం

కృత్రిమ మేధస్సు 

‘మన కలలను సాకారం చేసుకోవడానికి, మనం ఊహించలేని వాటిని సృష్టించడానికి ఉపయోగించే ఒక సాధనం- టెక్నాలజీ’ అంటాడు లైనక్స్‌ కెర్నల్‌ (ఏకశిలా, మాడ్యులర్‌, మల్టీ టాస్కింగ్‌ వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కెర్నల్‌) సృష్టికర్త లైనస్‌ టోర్వాల్డ్‌. కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌... సంక్షిప్తంగా చెప్పాలంటే ఎఐ.. దీని వినియోగం ప్రపంచానికి మేలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. అంతేకాదు... భవిష్యత్తులో ఎన్ని కొత్త మలుపులు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం. మనిషి మేధస్సును కృత్రిమ మేధ అధిగమిస్తుందని నిపుణుల అంచనా. ఇప్పటికే కృత్రిమ మేధ ఎన్నో రకాల ఉద్యోగాలకు ఎసరు పెట్టింది. ఉద్యోగులను నిలువునా ముంచేస్తున్నది. డిగ్రీలు చేత
పత్రికా ప్రకటనలు

వేదాంత రహస్య ప్రయత్నాలు

COVID-19 భారతదేశం అంతటా వ్యాపించడంతో, చమురు, గనుల పరిశ్రమలను నియంత్రించే కీలక పర్యావరణ భద్రతా నిబంధనలను పలుచన చేయడానికి గని త్రవ్వకాల- చమురు సంస్థ వేదాంత కంపెనీ చడీ చప్పుడు లేకుండా ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసింది. అదానీ అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రిపోర్టుకు మద్దతుగా ఓ తాజా నివేదికను తెచ్చిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసిసిఆర్‌పి) కరోనా సమయంలో వేదాంత గ్రూప్‌ జరిపిన రహస్య లాబీయింగ్‌, దానికి పర్యావరణ చట్టాల్లో కేంద్రం చేసిన సవరణలపై మరో రిపోర్టును ఇచ్చింది. ఓసిసిఆర్‌పి నివేదిక ముఖ్యాంశాలు: - కోవిడ్ సమయంలో కీలక పర్యావరణ నిబంధనలను
పత్రికా ప్రకటనలు

గ్రోవ్ వాసుకు మద్దతుగా  విద్యార్థి సంఘాలు 

తేదీ: సెప్టెంబర్ 7, 2023 కార్పొరేట్ సంస్థలు, ఫాసిస్టులు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేరళ అంతటా అనేక నిరసనలకు నాయకత్వం వహించిన, గ్రో వాసు అనే పేరుతో ప్రసిద్ది చెందిన వాసును జైలులో నిర్బంధించి అతని పౌర హక్కులకు భంగం కలిగించడాన్ని విద్యార్థులమైన మేము సమైక్యంగా ఖండిస్తున్నాము. ఏడేళ్ల నాటి కేసులో, 2016 నవంబరు 24న సీఎం పినరై విజయన్ నేతృత్వంలోని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేరళ పోలీసుల థండర్ బోల్ట్ కమాండోల చేత హత్యకు గురైన, అనారోగ్యంతో ఉన్న అజిత, కుప్పు దేవరాజ్ అనే ఇద్దరు మావోయిస్టుల బూటకపు ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా కోజికోడ్ మెడికల్
వ్యాసాలు

94 ఏళ్ల ‘గ్రోవ్’ వాసు అరెస్టు-విడుదల

ఏడేళ్ల నాటి కేసులో ఇటీవల అరెస్టయిన 94 ఏళ్ల కేరళ మానవ హక్కుల కార్యకర్త  'గ్రోవ్' వాసు కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ బెయిల్ తీసుకో నిరాకరించాడు. అనేక మంది న్యాయవాదులు, సహచరులు, పోలీసులు, కార్యకర్తలు జైలుకు వెళ్ళకుండా ఉండటానికి అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించారు, కాని వాసు ‘నిరసన అనేది నేరం కాదు’ అనే తన రాజకీయ వైఖరిపై ధృఢంగా నిలబడ్డాడు.   ఎన్‌కౌంటర్ జరిగిన రోజున వాసు మీడియాతో మాట్లాడుతూ, "ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని మేము నమ్ముతున్నాము. ఎన్‌కౌంటర్ అరిగిన తరువాత పాత్రికేయులను ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం అనుమానాలు రేకెత్తించింది. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి వేరే
వ్యాసాలు

అంతర్లీన సత్యాలను దాచడానికి వాస్తవాలను ఉపయోగించడం

చాలా  సముచితమనిపించే పదాలు మరియు పదబంధాలను శక్తిమంతులు తెలివిగా ఉపయోగించడంలో, ప్రజలను మోసం చేయాలనే స్పష్టమైన ఉద్దేశ్యాన్ని చూడవచ్చు. ది హత్రాస్ దారుణం, జాతీయ మనస్సాక్షిపై  లేదా దానిలో యింకా ఏదైనా  మిగిలివుంటే  దానిపై బలమైన ముద్ర  వేసింది. సాంఘిక అణచివేతపు అత్యంత క్రూరమైన పార్శ్వాన్ని ప్రజలకు చూపింది.అంతేకాకుండా,  ప్రభుత్వ యంత్రాంగాన్ని నిసిగ్గుగా మరియు నిస్సంకోచంగా అణచివేతదారులకు మద్దఇవ్వడానికి ఉపయోగించడాన్ని ప్రజలు చూశారు. యుక్తవయసులో ఉన్న దళిత బాలికపై అమానుషంగా దాడిచేసి –(  ఆమెను భారతి అని పిలుద్దాం) - చివరికి  చంపడమేగాక, ప్రథమ సమాచార నివేదికనివ్వడంలో కూడా తటపటాయించారు .అంతేగాక, నిర్దయతో  వైద్యపరీక్షను ఆలస్యంజేసారు, మరణవాంగ్మూలాన్ని పరిగణలోకి
కవిత్వం

నా తల తీస్తానంటావు

మూతికి గుడ్డ నడుముకు తాటాకు కట్టుకుని అరిపాదాలతో నీ వీధిలో నడిపించిన సనాతన ధర్మం వద్దంటే నా తల తీస్తానంటావు మా ఆడవారినే జోగినిగా మార్చి నీ కోరికలు తీర్చుకునే ధర్మం మాకు వద్దంటే నా తల తీస్తానంటావు ఊరి బావిలో‌నూ చెరువు లోనూ నా దాహం తీర్చుకోనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు నీవు పలికే మంత్రాలేవో పొరపాటున విన్నందుకు మా చెవిలో‌ సీసం పోయించిన నీ ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు తరగతి గదిలో నీ పక్కన కూచోనివ్వని ధర్మాన్ని వద్దంటే నా తల తీస్తానంటావు వేల ఏళ్ళుగా నీ పీతి తట్టను
కవిత్వం

తస్లీమా నస్రీన్ జైలు కవిత్వం

అంతర్జాతీయ సాహిత్య ప్రపంచంలో తస్లీమా నస్రీన్ పేరు తెలియని వారుండరు.ఆమె బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ నగరంలో 1962 లో జన్మించారు. 1984 లో మెడిసిన్ పట్టా పుచ్చుకొని, బంగ్లా రాజధాని ఢాకాలోని ఆసుపత్రులలో ప్రసూతి నిపుణురాలుగా, మత్తు వైద్యురాలుగా పని చేసారు. తన మెడిసిన్ చదువుల కాలంలోనే ఆమె బలమైన స్త్రీ వాద రచయిత గా రూపొందారు.పిదప కవిత్వమూ, నవలలు , వ్యాసాలు ప్రచురించారు. ఆమె ప్రచురించిన 'లజ్జ'  (Shame,1993 ) నవల హిందూ ముస్లింల మధ్య ఉద్విగ్నతలను ప్రమాదకరంగా  రెచ్చగొట్టే విధంగా వుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం 1994 లో నిషేధించింది. ఆమె లౌకిక, స్వేచ్చాయుత దృష్టికోణం ముస్లిం