సమీక్షలు

మానసిక గాయాల చరిత్ర

స్వయం సిద్ధ ఎవరి జీవన రాగాలాపన? ఏబిందువు నుండి ఏ బిందువు వరకు ప్రయాణం చేశాయి ఈ కథలు. కధావరణలో స్వయం సిద్ధ స్థానం ఏమిటి? ఒంటరి మహిళల జీవన గాథల వెనుక దాగిన సామాజిక నేపథ్యమేమిటి?   మహిళల జీవన పోరాటంలో అలసిన తరువాత మిగిలిన స్వేచ్ఛ మాటే మిటి . స్వయంసిద్ధ  కథలు  భారత సమాజన్ని స్త్రీల కోణం నుండి అంచనా వేసిన కథలు.  భూస్వామ్య సమాజం  దాని కొనసాగింపులో భాగంగా స్త్రీ పై అధికారాన్ని పురుషుడు మరింతగా కొనసాగిస్తున్నపుడు  తమ జీవితానికి తామే నిర్ణయించు కుంటాం అనే కోణం నుండి వచ్చిన కధలు. సామాజిక చలనంలో
వ్యాసాలు

హేతువును కూల్చివేయడం

*తమ నేరాలను తప్పించుకోవడం, అస్పష్టత, విక్షేపం, పక్కదారి పట్టించడం(Deflection), తిరస్కరణ లాంటి  వివిధ వ్యూహాలను దత్తత తీసుకోవడాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం* మనుషులకు   హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంవల్ల  యితరులతో  విభిన్నంగా వుంటారు. అయితే, మానవులంతా  హేతుబద్ధoగా వుండటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కానీ, మానవులందరూ ప్రయోజనకరమైన పరిణామాలతో తర్కిస్తారని  అనడం అతిశయోక్తి . హేతువుకు  అనేక విధులు ఉంటాయి. (Reasons have many functions.)  ఒక సాధారణ అవగాహనకు రావడానికి,   ఏకాభిప్రాయ నిర్ణయానికి చేరుకోడానికి  హేతువు సహాయపడుతుంది.  ఈ క్రమానికి  ఏది  సంబంధించిందో , ఏది కానిదో గుర్తించడంలో   హేతువు సహాయపడుతుంది.  మన లోతైన
వ్యాసాలు

ప్రజల ఊసులేని కొత్త చట్టాలు

20 జులై 2023 నుండి వర్తమాన లోకసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ సమావేశాలలో అటవీ సంరక్షణ చట్టం, 1980కి గత సంవత్సరం 2022 జూన్‌ 28 నాడు ఆర్దినెన్స్‌ రూపంలో రూపొందించిన అటవీ నియమాలకు చట్ట రూపం ఇవ్వడానికి ఆ బిల్లును మొదట లోకసభలో ప్రవేశపెట్టారు. ఆ  తరువాత  ఆగస్టు 2నాడు రాజ్యసభలో ఆమోదం పొందడంతో చట్టం ఉనికిలోకి వచ్చింది. చట్టం పూర్వాపరాలు: మన దేశంలో బ్రిటిష్‌ వారి హయాంలో రూపొందిన అటవీ సంరక్షణ చట్టం 1927ను ఆధారం చేసుకొని అధికార మార్పిడి తరువాత అటవీ సంరక్షణ చట్టం, 1980 ఉనికిలోకి వచ్చింది. ఆ చట్టం అడవులను రెండు
నివాళి

మానవాళి *ఆనంద*మే ఆయన శ్వాస

కా. ఆనంద్‌ (దూల దాద, కటకం సుదర్శన్‌) మే 31న అమరుడయినట్టుగా జూన్‌ 4న సాయంత్రం ఆకాశవాణి వార్తలు మోసుకొచ్చాయి. ఆ వార్త ఒక పిడుగుపాటు లాగే అయింది. అది అబద్దమైతే బాగుండనే ఆరాటంతో పదే పదే రేడియో విన్నాను. విప్లవోద్యమ  అధికార ప్రతినిధి కా. అభయ్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా ఆకాశవాణి ఆ వార్త చెప్పిందనేది కొద్ది క్షణాలలోనే స్పష్టంగా తేలిపోయింది. అతనితో నాకు వున్న ఆత్మీయానుబంధం, స్నేహ బంధం, వర్గానుబంధం, తన జ్ఞాపకాలు ఒక్కసారిగా మనసంతా ముసురుకుపోయాయి. విప్లవ పయనంలో ఎప్పటికైనా తప్పక కలుస్తాడు అనే దృఢ విశ్వాసంతో వున్న నాకు ఆయన
సమీక్షలు

మోదుగుపూల కవిత్వపు జడివాన

సంఘర్షణ తీవ్రమైనట్లుగానే ఉద్యమ ఆకాంక్షలు సమాజంలో బలపడతాయి. దీని ప్రతిఫలం సాహిత్యంలోనూ కనిపిస్తుంది ‘‘జీవన పోరాటంలో స్వయం రక్షణ అనే మానవుని సహజ చోదన రెండు బలమైన సృజనాత్మక శక్తుల్ని అతనిలో పెంపొందించింది. అవబోధనాశక్తి, భావనాశక్తి. అవబోధనాశక్తి అంటే ప్రకృతి దృగ్గోచర విషయాల్ని సాంఘిక జీవిత వాస్తవాల్ని పరిశీలించి, పోల్చి అధ్యయనం చేసే శక్తి. భావనాశక్తి అంటే విషయాలకీ ప్రకృతి మూలశక్తులకీ మానవ లక్షణాలనీ అనుభూతులనీ, ఆమాటకొస్తే అభిప్రాయాలనీ ఆపాదించే శక్తి అన్నమాట’’ అని గోర్కీ  అంటారు. అవబోధనాశక్తి, భావనాశక్తులు రెండూ పల్లపు స్వాతి రాసిన మోదుగుపూల వాన కవిత్వం అంతటా నిండుగా పరచుకొంది. ఇరవై చిన్న కవితలున్న
ఆర్ధికం

ఆకలి కేకలకు అంతమెప్పుడు?

ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఎఒ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌(ఐఎఫ్‌ఎడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్య్లూఎఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా మే 2న ప్రపంచ ఆహార సంక్షోభాలపై నివేదికను విడుదల చేశాయి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలి లేని లోకం)’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో పోషకాహార లోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418 మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282 మిలియన్లు ఉన్నారని
కవిత్వం

ఆకుపచ్చని అమ్మ 

ఓ గొంతు మూగబోతే ఆ గజ్జె నీది కానేకాదు ఓ స్వరంలో అలలు ఎగిసిపడటం ఆగిపోతే కొన్ని అలల్లో కొన్ని కాంతులు మాయమవుతే ఆ సముద్రం నీది కానేకాదు కటకటాల వెనుక కాంతిరెక్కవు నువ్వు నీ సముద్రం, నువ్వైన సముద్రం ఎప్పటికీ ఆవిరి కాదు, ఎన్నటికీ మూగబోదు ప్రజాద్రోహం చేయకూడదని పాఠాలు చెప్పినవాడివి నీ కంఠం ఆదివాసుల పేగుల్లో కవిత్వం పలుకుతున్నది నీ కంఠం అన్నం మెతుకులకు కవాతు నేర్పుతున్నది మనిషి అమరుడైతే ఓ కంటిని తడి చేసుకున్న వాడివి మరో కంట్లో కత్తులకు బట్ట చుట్టని వాడివి అమరుల కనురెప్పల కవాతులో ఓ రెప్పవైన వాడిని నవ్వులో