వ్యాసాలు

విప్లవ సాంస్కృతికోద్యమం – గద్దర్

జననాట్యమండలి నిర్దిష్ట విప్లవోద్యమ నిర్మాణ సాంస్కృతిక సంస్థ.  నక్సల్బరీ పంథాను రచించిన చారు మజుందర్ నాయకత్వాన్ని స్వీకరించిన సిపిఐ (ఎంఎల్) పార్టీ ఆట-మాట-పాట అది. ఆ విప్లవ పంథాను తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అనుభవంతో శ్రీకాకుళం సెట్‌బ్యాక్ తర్వాత ఆచరణలో పెట్టాలనుకున్నపుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వం అవిభక్త కమ్యూనిస్టు పార్టీ సాంస్కృతిక సంస్థగా డాక్టర్ రాజారావు నాయకత్వంలో ఏర్పడిన ప్రజానాట్యమండలి అనుభవాల వెలుగులో జననాట్యమండలిని రూపొందించింది. అయితే దీనికి ఇతర ప్రజాసంఘాల వంటి కార్యనిర్వాహక, కార్యవర్గ నిర్మాణం లేదు. 1986లో హైదరాబాదులో రాంనగర్‌లో అప్పటి పీపుల్స్ వారి కార్యదర్శి శ్యాం (నల్లా ఆదిరెడ్డి) అరెస్టయినపుడు పెట్టిన రాంనగర్
కవిత్వం

వలస కావిడి

నెత్తిన నీళ్ళకుండ భుజాన సూర్యుడు ఆకలిముల్లు గోడలపై ఎగాదిగా ఎగబాకిన పాదాలు లాగేసిన కంచంలో ఆరబోసే తెల్లారికై చుక్కల పరదాతో రాత్రంతా కొట్లాడిన పాదాలు ఇంటి కుదుర్లు జల్లిస్తూ కార్పొరేట్ కాలేజీ వంటపోయ్యిలో కట్టెలవుతున్నాయి పుట్టినూరు నోరు తేలేసినందుకు... దేహాన్ని కప్పే సిమెంట్ రేకుల పగుళ్లలో విరిగిన బతుకులు చినిగిన గౌను లాగూ లేని చొక్కా ఆడుకోడానికి నలుగురు దోస్తులూ లేని గిరాటేసిన బాల్యం ఇక్కడ వంటపాత్రల కింద మసి పలక అందరికీ నిలువెత్తు ఊపిరైన వూరు ఆరో మెతుకును అడగకుండానే ఇచ్చిన నేల సంపెంగ మీసాల పుక్కిలింత వలస కావిట్లో నిట్టనిలువునా కాలిపోతోంది.
కవిత్వం

చేరని తీరం

అతనలా ఆ గుంపులో నిండు పున్నమిలా తన చుట్టూ పరిభ్రమించాను నేనెప్పటిలా దశాబ్దాల దూరాల మధ్యనే గూడుకట్టిన ఓమాట ఓ పలకరింపు ఓ కరచాలనం ఎప్పటిలానే కల కరిగిపోతోంది ఇలా నీరింకని కళ్ళను ఓదార్చుతూ గొంతు పెగలని దుఃఖం సుడిగుండమై మిగిలిపోతుందిలా నాలోలోపల.
కవిత్వం

రూపాంతరం

నీకోసం నేకవితలు రాయలేను. రూపాంతరం చెందిన దుఃఖగాధ ల్ని మాత్రం విప్పగలను వసంతం తరలిపోయింది ఎండాకాలపు ఒడిలో స్వార్థపు క్రీడల్లో నదులు ప్రేతాత్మల్లా కళ్ళు తేలేశాయి అవతల ప్రైవేటు ఆస్తుల సైన్ బోర్డులు పెటపెటలాడుతున్నాయి. ఇంతకు చేపలన్నీ ఎక్కడికెళ్లాయి వన సంరక్షణ సమావేశంలో ప్లేట్లలో ముక్కలుగా నిండిపోయాయి వాటి తెల్లని కనుగుడ్లను జాగ్రత్తగా పీకేశారు ఓ ఘనమైన మెమొరాండంను మాత్రం వాటి ముందు చదువుతారు చచ్చిన చేపలకు అది వినపడుతుందా.. *** చంకలో వెంట్రుకల్ని సాపు జేసినట్టు భూమి మీద చెట్లను సాపు చేస్తారు నున్నగా గొరిగిన భూమి నిత్యాగ్ని గుండమైతే మనం సమాధి నుండి లేచిన ప్రేతాత్మల్లా
సంపాదకీయం

పాతవి కొత్తగా మారడం

పాతవి పోతాయి. కొత్తవి వస్తాయి. ఇండియాలో ఇది చాలా విచిత్రంగా జరుగుతుంది. వికృతంగా ఉంటుంది. మన సామాజిక మార్పు అంతా ఇట్లాగే జరిగింది. అందులో ఈ ధోరణి ప్రధానమైనది. అది తెలుసుకోలేక చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఇన్ని దశాబ్దాలలో ఏ మార్పూ రాలేదా?..అంటే వచ్చింది. చాలానే మారింది.  కానీ పాతదానితో తెగతెంపులు జరగని మార్పులు ఇవి. ప్రతి మార్పూ  వెనుకటిదాన్ని వెంటేసుకొని కొత్తగా  వస్తుంటాయి. ఇది సామాజిక సాంస్కృతిక రంగాల్లో కనిపించినంతగా చట్ట, పాలనా రూపాల్లో కనిపించకపోవచ్చు. కానీ స్థూలంగా పాతది కొత్తగా మారే ఈ చట్రంలోనే అన్నీ భాగం. జూలై 20 నుంచి ఆగస్టు 11
కవిత్వం

గెంటి వేయబడ్డ వారి కోసం పాట!

నిజం వాళ్ళు అబద్ధం చెప్పారు..ఈ వీధులేమీ బంగారంతో చేయబడలేదని అరిచి అరిచీ నా గొంతు బొంగురుపోయింది.. చివరకు నాకు కఠోరమైన జీవితమే దక్కింది. వాళ్లన్నట్లు ఈ వీధులు బంగారంతో చేయబడ్డాయా ..లేదు పచ్చిఅబద్ధం ఇది ! ప్రమాదాలతో..నిండి ఉన్న వీధులు ఇవి. నాకు తెలుసు ! కానీ ..ఈ లోపల ఓ అద్భుతం జరిగిపోయింది. ఈ రాత్రి నేను కూడా వాళ్ళలా ఉండడానికి.. నాలోపల ఒక విచిత్రమైన మనోలైంగిక మానసిక స్థితి సంసిద్ధమై పోయింది ! వాళ్ళు నన్ను నా నడుము దాకా మీలో...మిమ్మల్ని నాలో చూసారు. వాళ్ళు నన్ను ... మిమ్మల్ని నేను కళ్ళతో తాగేయడం చూసారు.
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఈ మోహన్రావున్నాడు చూడండీ..!

అవును... మీరందరూ వినాలి. నేనెలా చనిపోయానో నేను మీకందరికీ చెప్పి తీరాలి. నా కథ మీకు వింతగా కనిపించవచ్చు పోనీ ఒఠ్ఠి చోద్యంగానూ అనిపించవచ్చు. నాలాంటి స్త్రీల కథలు ఎవరు రాస్తారో తెలీదు కానీ ఒకవేళ రాస్తే మాటుకు రాసిన వాళ్ళని కూడా మీరు తెగడతారు. ఒఠ్ఠి బలుపు... బూతూ రాస్తుందీవిడ అని ఆమెను పాపం మనస్తాపానికి గురి కూడా చేయవచ్చును మీరంతటి వాళ్లే సుమా! ఇంతకీ నేనెలా పోయానో మీకు చెప్పాలి. ఈవిడేదో మళ్ళా ఒక పురుషుడ్నో... అంటే భర్తని విలన్‌గా నిలబెడ్తుందని మీరనవచ్చు కానీ నా కథలో ఇది నిజమే. అవును మరి నిండు నూరేళ్లు
కవిత్వం

కుకవులు

చంద్రయాన్ మీద కవితలు ప్రశంసలై రాలుతున్నాయి దేశంలో స్త్రీలను మనువాదులు నగ్నంగా నడిపిస్తే కలాలు చూస్తూ మనకెందుకులే అనుకుంటున్నాయి మన జాతి కీర్తి ఆకాశంలోకి రాకెట్లలా దూసుకుపోతుందని అక్షరాలతో నమ్మబలికి, రోడ్ల మీద ఆదివాసీలపై మూత్రం పోస్తున్న కవుల కలాలు చోద్యం చూస్తూ మధ్యయుగాలలోకి కాలయానం చేస్తూ ఈ గళాలు మౌనంగా ప్రభుత్వాలను శ్లాఘిస్తున్నాయి మానుషం అతి భయంకర అమానుషమై ద్వేషం దేశభక్తి తోలు కప్పుకొని విచ్చలవిడిగా దేశాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నా, వంధిమాగదులైన కవుల కలాలు ప్రజాద్రోహులై నిరంకుశ పాలకులతో సన్మానాలు సత్కారాలు పొందుతూ ముసి ముసిగా మురిసి పోతున్నాయి మానవత్వం కోసం పరితపించే మేధావులను న్యాయం
కవిత్వం

దేవుడు  మాటాడాడా?

టీచరమ్మ చేతిలో బెత్తం ఎంత గట్టిగా కొట్టినా అప్పుడు ఏడుపొచ్చేది కాదు నాకు రాని వారం పేరేదో గుర్తుంచుకోవాలని కొట్టారనో హోం వర్కు చేయడం డుమ్మా కొట్టాననో ఇంట్లో నూనెలేక తలకు పెట్టుకోలేదనో నా తోటి మిత్రున్ని ఆట పట్టించాననో చింత బెత్తంతో తగిలిన బాధను పంటి బిగువన పట్టి చేయి దులుపుకునే వాణ్ణి! కానీ ఇప్పుడు నా ముఖంపై ముద్ర వేసిన మతం నన్ను వెక్కిరిస్తూ తరగతి గదిలో నన్నొంటరిని‌ చేసి రోజూ హత్తుకుని ఖుషీగా ఆటలాడుకుంటూ ఒకరికొకరం అన్నదమ్ములా భుజాలపై చేతులేసుకుని గంతులేసే మా మధ్య గోడను కట్టే ఈ తృప్తి త్యాగి టీచరమ్మలు మొలుచుకొచ్చి
నివాళి

చెదరని వర్గానుబంధం

కామ్రేడ్ అనితక్క అమరత్వ వార్త వినగానే ఒక్కసారిగా తన మాటలు, గురుతులు, ఆత్మీయత గురుతొచ్చింది. ఎప్పుడూ తన ముఖం పై చెరగని చిరునవ్వు, ప్రతి పనిలో సమష్టి భావన, ప్రతి కామ్రేడ్ తో పెనవేసుకొనిపోయే తత్వం కా.అనితక్క సొంతం. ప్రజలత్, సోదర కామ్రేడ్స్ తో ప్రేమ పంచుకోవడం తనకు ప్రజలు నేర్పిన విద్య. నేను దళంలోకి వచ్చిన మరుసటి రోజునే తెలంగాణ చరిత్ర పై క్లాసు మొదలైంది. క్లాసులో ‘‘నీవు కూడా కూర్చుంటున్నావు కదూ!’’ అంటూ కా.హరిభూషణ్ నన్ను అడిగాడు. ఆ క్లాసుకు ఆయనే టీచర్.  సభ్యుల నుండి డీవీసీ వరకూ అందులో పాల్గొన్నారు. ఆ క్లాసులో కా.