పాట

ఢిల్లీ చలో….

పదరా..పదరా పదపదపదమని..కదం దొక్కరా " ఢిల్లీ కోటకు వొణుకు పుట్టగా ప్రపంచమంతా నివ్వెరపోగా " "పదరా" రైతుబిడ్డ లా నిలువరించెడూ బారికేడ్లనూ బద్దలు గొట్టగ " పొలాలల్లో శ్రమించే చేతులు నియంత మీదకు పిడికిలెత్తినవి " "పదరా" సంకెళ్ళేసిన రోడ్ల మీదకు సర్రున దూసుకు..పదండి,పదండి " మన కడుపులకూ సంకెళ్ళేసిన దోపిడి దొంగలు పని బట్టంగ " " పదరా " గర్జించరా..గర్జించరా. నియంత మీదకు నిప్పులు జెరగర " పొలాల నమ్మే బందిపోట్లకూ పొట్టలు గొట్టే విద్య దెలువదా" " పదరా" పరుగెత్తరా.. పరుగెత్తరా కోటల మీదా గురి వెట్టరా " మన బత్కుల చెరను బట్టినా
వ్యాసాలు

మన కళలు సాహిత్యం కలలకు దూరం కాకూడదు

(విజయవాడలో జరిగిన విరసం 29 వ మహా సభలకు పంపిన సందేశం) మిత్రులారా, కామ్రేడ్స్‌! మొత్తం దేశమంతా ఇప్పుడొక క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళు ‘మన’ అనేదాన్ని తుడిచేసి తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. నియంతలు మన-జల్‌ జంగల్‌-జమీన్‌ మొత్తం తమదేనని భావిస్తున్నారు. మనల్ని అనామకుల్ని చేసి అమానుషంగా నిర్బంధించి మన గొంతుల్ని నొక్కేస్తున్నారు. పాలకులకు కావలసినంత బలముంది, మీడియా సపోర్ట్‌ ఉంది. వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం ప్రచారం ద్వారా విజయం సాధిస్తున్నారు. మనం వీళ్ళను ఎదుర్కోవాలంటే అన్ని రంగాల్లోనూ కృషిచేయవలసి ఉన్నది. రాయాలి, వివరించాలి. మన గురించి, మన భూముల గురించి, మన అడుగుల గురించి
కవిత్వం

రఫాత్ అలరీర్ కోసం

మనమంతా మరణించాల్సిందే నేనంగీకరిస్తాను కానీ ఎవ్వరూ ఒక భవనం నుంచి మరొక భవనానికి, శిథిలం కావడానికో, మాంసధూళి కావడానికో పరుగెత్తరాదు ఏ తల్లీ తన పిల్లలకు వీడ్కోలు గాలిలో రాసే పరిస్థితి రాకూడదు మృత్యువు కాసేపు నుదిటి పై నిలిచి పోవాలి ఆకులపై దట్టమైన మంచువలె అప్పుడు మనం దుఃఖించాలి కరుగుతున్న మంచుబిందువులు నేలపై రాలుతున్నట్లుగా అర్థాంతరంగా, ఆకస్మికంగా, అమానవీయంగా మృత్యువు ఇంతటి కూృరమైన శత్రువు కాకూడదు నేను నీ కోసం ఒక పతంగి తయారు చేస్తాను ఆ రోజు మనల్ని మనం విముక్తం చేసుకుంటాం ఆ రోజు మనం స్వాతంత్య్రయాన్ని పొందుతాం అయితే నేను పతంగిని కఫన్
కవిత్వం

గాజా పసిపిల్లలు! Children of Gaza

నన్ను క్షమించండి... మీ కోసం జోలపాట ఎలా పాడాలో తెలీటం లేదు. మనం ఒక పని చేద్దాం.. దిశల లెక్కలు తేల్చే భౌతిక శాస్రం నాశనం అవ్వాలని ప్రార్థిదాం ! నిదుర పోతున్న పిల్లల మీద శత్రువు వదిలే ద్రోణులు.. బాంబులు గురి తప్పిపోవాలని ప్రార్థిదాం ! నన్ను క్షమించండి .. చనిపోయిన నా గాజా పసి పిల్లలారా.. మిమ్మల్నెలా నిద్ర లేపాలో అర్థం కావటం లేదు. మీతో పాటు నేనూ చచ్చి పోయాను ! నన్ను క్షమించండి.. ఈ ప్రపంచం తనని తాను విముక్తి చేసుకోవడానికి మన రక్తాన్ని మరింతగా కోరుకుంటోంది ! నా ప్రియమైన గాజా
కవిత్వం

రూపాంతరం

నీకోసం నేకవితలు రాయలేను. రూపాంతరం చెందిన దుఃఖగాధ ల్ని మాత్రం విప్పగలను వసంతం తరలిపోయింది ఎండాకాలపు ఒడిలో స్వార్థపు క్రీడల్లో నదులు ప్రేతాత్మల్లా కళ్ళు తేలేశాయి అవతల ప్రైవేటు ఆస్తుల సైన్ బోర్డులు పెటపెటలాడుతున్నాయి. ఇంతకు చేపలన్నీ ఎక్కడికెళ్లాయి వన సంరక్షణ సమావేశంలో ప్లేట్లలో ముక్కలుగా నిండిపోయాయి వాటి తెల్లని కనుగుడ్లను జాగ్రత్తగా పీకేశారు ఓ ఘనమైన మెమొరాండంను మాత్రం వాటి ముందు చదువుతారు చచ్చిన చేపలకు అది వినపడుతుందా.. *** చంకలో వెంట్రుకల్ని సాపు జేసినట్టు భూమి మీద చెట్లను సాపు చేస్తారు నున్నగా గొరిగిన భూమి నిత్యాగ్ని గుండమైతే మనం సమాధి నుండి లేచిన ప్రేతాత్మల్లా
కవిత్వం

విజయ చిహ్నాలు

★Victory Signs★By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో.. మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ? పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●● అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు ! మన బట్టలు తొలగించబడతాయి.. మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం జరుగుతుంది. క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు