(విజయవాడలో జరిగిన విరసం 29 వ మహా సభలకు పంపిన సందేశం)

మిత్రులారా, కామ్రేడ్స్‌!

మొత్తం దేశమంతా ఇప్పుడొక క్లిష్ట పరిస్థితిలో ఉంది. వాళ్ళు ‘మన’ అనేదాన్ని తుడిచేసి తమ పెత్తనాన్ని చెలాయిస్తున్నారు. నియంతలు మన-జల్‌ జంగల్‌-జమీన్‌ మొత్తం తమదేనని భావిస్తున్నారు. మనల్ని అనామకుల్ని చేసి అమానుషంగా నిర్బంధించి మన గొంతుల్ని నొక్కేస్తున్నారు.

పాలకులకు కావలసినంత బలముంది, మీడియా సపోర్ట్‌ ఉంది. వాళ్ళు ఏ పని చేయకుండా కేవలం ప్రచారం ద్వారా విజయం సాధిస్తున్నారు.

మనం వీళ్ళను ఎదుర్కోవాలంటే అన్ని రంగాల్లోనూ కృషిచేయవలసి ఉన్నది. రాయాలి, వివరించాలి. మన గురించి, మన భూముల గురించి, మన అడుగుల గురించి మన కథల్ని వినిపించాలి.

ఇందుకోసం మనం ప్రజల భాషల్లో మాట్లాడాలి. ప్రజలతో నిరంతరం సంభాషణ కొనసాగించాలి, అది కూడా వాళ్ళ భాషలోనే.

మన పాటలు, మన కవిత్వం, మన రచనలు ప్రజల కోసం రాసి, పీడితులలో చైతన్యం తీసుకురావాలి.

మన కళలు, మన సాహిత్యం కలలకు దూరం కాకూడదు. మనం కలగనాలి. ఒక ఉన్నతమైన, స్వేచ్ఛాయుతమైన పీడన లేని ప్రపంచం కోసం కలగనాలి. అద్దాల మేడల్ని బద్దలు గొట్టే ఒక కొత్త భాషను వెతుకుదాం.

మీ అందరికీ సలాం! నా ఆరోగ్య కారణాల వల్ల నేను రాలేకపోవడంతో విమ్మల్ని మిస్సవుతున్నాను.

 సిలుగురి, పశ్చిమ బెంగాల్‌

Leave a Reply