సాహిత్యం కవిత్వం

దేశ‌మే గెలిచింది

ఇప్పుడు దేశమే లేచి నిలబడి గెలిచింది.. కాదు... కాదు నాగలి కర్రు గెలిచింది  మట్టి వ్యాపార కణమై మనుషుల అస్తిత్వమే నేరమైపోయిన చోట  మ‌ట్టి గెలిచింది ఆకలి నేరమై హక్కులు అడగడం నేరమై పోరాడడమే నేరమై దర్యాప్తు సంస్థల  దాడులు చేస్తున్న  చోట‌ ఎన్నెన్ని  కుట్రల వలయాలనో దాటి  ఈ నేల గెలిచింది ఇప్పుడు గెలిచింది దేశం కాదు.. కాదు దేశాన్ని కర్రు నాగలి  గెలిపించింది గెలిచింది ఈ దేశపు  మట్టి మనిషి. 
కాలమ్స్ క్యా చల్రా .?

మూడు రాజధానుల ముచ్చట ముగిసిన అధ్యాయం కాదు

 నేటి (21/11) జగన్ ప్రభుత్వ ప్రకటన అందర్నీ ఆశ్చర్యం లో ముంచిందనడంలో సందేహం లేదు. మొన్నటి మోడీ ప్రకటన, మూడు వ్యవసాయచట్టాల రద్దు, నేటి మూడురాజధానుల చట్టం రద్దులలో కొన్ని సారూప్యతలున్నా, కొన్ని తేడాలూ వున్నాయి. సారూప్యత, ఇరువురూ తాము మంచిబుద్ధితో చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనాల గురించి కొంతమందిలో కలిగిన అపోహలు తొలగించడంలో విఫలమయ్యామని, అందువల్ల తాము వాటిని రద్దుచేయక తప్పలేదని విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు. తాము అనుసరించిన విధానాలలోని  తప్పులను అంగీకరించక, తామేదో ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నాలు జేస్తే, కొందరు... అందరూ కాదు, అడ్డుపడ్డారని వాపోయారు. ఈ సారూప్యతలటుంచుతే, మోడీ వెనుకంజకు కారణం రాబోయే
సాహిత్యం కవిత్వం

కాసిన్ని అక్షరాలివ్వండి

ఒక కఠోర వాస్తవం రాయాలి చెయ్యందించరూ గొప్ప కవిత రాయలి అక్షరాలు అరువివ్వరూ ఎక్కడో పొంగిన రోహింగ్యాల రోదనలు కాదు అక్కడెక్కడో తాలిబన్ల ఉన్మాదం కాదు భారతీయ తాలిబన్లు చేసే అత్యాచారానంతర పాశవిక హత్యలు,  రక్షక భటుల రక్షణలో అర్ధరాత్రి శవదహనాలు, రైతుల మీదుగా నడిపే రథాల విన్యాసాలు, అదేమని అడిగే గొంతుల్లోకి ఉపాలు, కోరెగాం కోరలు,  అబ్బసొమ్మేదో అమ్ముకున్నట్లు ప్రజల ఆస్తుల, హక్కుల అమ్మకాలు,  అన్నిటినీ నిలేసి అడగాలని వుంది  ఆవేదనకు పదాలు చాలకున్నాయి.. అక్షరాల సేద్యం చేసేవరకూ ఎవరన్నా కొన్ని తాలక్షరాలో, పొల్లక్షరాలో ఇచ్చి ఆదుకోరూ
కాలమ్స్ ఆర్ధికం

ఎందుకీ ఆర్డినెన్సులు ?

మోడీ ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిస్సిగ్గుగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకే  చట్టాలు చేస్తోంది. సమకాలీన రాజకీయాలు ప్రజలను, పార్లమెంటును విస్మరిస్తున్నాయి. నవంబర్‌ 26 నుంచి శీతకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ, ఆ సమావేశాల ప్రారంభానికి పది రోజుల ముందే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ చట్టం 2003, ఢిల్లీ  స్పెషల్‌ పోలీసు ఎష్టాబ్లిష్‌మెంట్‌ చట్టం 1941ల సవరణలతో నవంబర్‌ 15న ఇడి, సిబిఐ డైరెక్టర్ల గరిష్ట పదవి కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్సులు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన
కాలమ్స్ అలనాటి రచన

ఒక బానిస ఆత్మకథ

ఇంగ్లీష్ : ఫ్రెడరిక్ డగ్లస్ తెలుగు అనువాదం: ముక్త వరపు పార్థ‌సార‌ధి  మానవ జాతి చరిత్రలో బానిస వ్యవస్థ అనేది ఒక దశ. అలాంటి దశ ఒకటి గత కాలంలో జరిగిందనీ, బానిసలు యెంత నికృష్ట, దయనీయమైన జీవితాల్ని అనుభవించారో కొంచెంగానైనా గ్రంధస్తం కాకపొతే, వాళ్ళ కన్నీళ్లు ఆనాటి శిథిలాల  కిందే ఇంకిపోయి ఉండేవి. “యెంత ప్రతిభా వంతులైన రచయితలైనా అసలు వాస్తవాలను అణుమాత్రంగా చెప్పలేకపోయారు”  అనేవాడట బానిస యోధుడు స్పార్టకస్. అంటే, వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరమైనవో మనం ఊహించుకోవచ్చు. తెలుగులో ‘స్పార్టకస్, ఏడుతరాలూ, అంకుల్ టామ్స్ కేబిన్’ లాంటి పుస్తకాలు వున్నాయి. కానీ, ఒక బానిస
సాహిత్యం సమీక్షలు

పురాతన యుద్ధ‌భూమి

(ఇటీవ‌ల విడుద‌లైన పి. చిన్న‌య్య క‌థా సంపుటి ఊడ‌ల‌మ‌ర్రి ముందుమాట‌) మిత్రులు పి.చిన్నయ్య తన ఊడలమర్రి కథల సంపుటికి ముందుమాట రాయమని, పదిహేనేండ్ల కాలంలో తాను రాసిన పదహారు కథలు పంపారు. ఈ కథల్లో దాదాపు అన్నీ విరసం కథల వర్క్‌ షాపుల్లో చదివినవే. కథల గురించి రకరకాల చర్చలు జరిగినవే. ఒక్కొక్క కథ చదువుతుంటే.. ఆ సన్నివేశాలన్నీ రూపుకడుతున్నాయి. సాధారణంగా రచయితలు కనపరిచే ఉద్విగ్నతలు, ఆవేశకావేశాలు ప్రదర్శించకుండా సీదాసాదాగా.. ఏమాత్రం డాంబికం లేకుండా చిన్నయ్య మాట్లాడే పద్ధతి - స్థిరమైన ఆ కంఠస్వరం నాకిప్పటికీ గుర్తే. ఇవి అంతిమ తీర్పులో... పరమ సత్యాలో... అనే భావనతో కాకుండా
సాహిత్యం కవిత్వం

బంగారు బుడతలు

కలలు కనే కళ్ళు ఆచ్చాదన లేని వళ్ళు లోకం తెలియని పరవళ్ళు అల్లరి పిల్లలు కాదు వాళ్ళు నవనాగరికులు వాళ్ళు సమిష్టి ఆశల సౌధం వాళ్ళు కాలం రైలు పట్టాలెక్కి జీవితాన్ని బాలెన్స్ చేస్తు విశ్వయాత్ర చేస్తారు వాళ్ళు నింగి, నేలంతా వ్యాపించి మూసిన కిటికీలు తెరిచి మేఘాలతో వూసులు చెబుతారు వాళ్ళు పాలపుంత లాంటి సుదూర కాంతి కిరణాలు వాళ్ళు తేనె జల్లుల పరవశం వాళ్ళు ప్రకృతి ఒడిలో పారవశ్యపు కాంతులు వాళ్ళు పాలకుల నైజానికి సాక్షులు వాళ్ళు ఎవరి సానుభూతి అర్థించని వాళ్ళు ఆత్మగౌరవానికే అందం వాళ్ళు బంగారు బుడతలు స్వేచ్ఛా విహంగాలు ఊహలకు రెక్కలు
వ్యాసాలు

సార్థ‌క జీవి ఆలూరి ల‌లిత‌

విప్ల‌వోద్య‌మం మ‌నుషుల‌ను  అద్భుతంగా తీర్చిదిద్దుతుంద‌నడానికి  ల‌లిత‌గారే ఉదాహ‌ర‌ణ‌.  సంప్ర‌దాయ జీవితం నుంచి  అజ్ఞాత  ఉద్య‌మ  జీవితానుభ‌వం గ‌డించేదాకా ఆమె ఎదిగారు.   ఒక మామూలు గృహిణిగా   జీవితాన్ని ఆరంభించి త‌న కుటుంబం ఉద్య‌మ కేంద్రంగా మారే క్ర‌మానికి దోహ‌దం చేశారు. ఆ కుటుంబం ఉద్య‌మ‌కారుల,  అమ‌ర వీరుల‌ కుటుంబంగా ఎదిగే మార్గంలో ల‌లిత‌గారి అడుగుజాడ‌లు ఉన్నాయి. ఇదంతా ఆమె ఒక్క‌రే సాధించి ఉండ‌రు. అస‌లు ఆమె గురించి విడిగా ఎవ్వ‌రూ మాట్లాడ‌లేరు. భుజంగ‌రావుగారితో క‌లిపే చూస్తారు. ఇది పితృస్వామ్య కోణం కాదు. విప్ల‌వోద్య‌మంలో, సాహిత్య ర‌చ‌న‌లో ఆ ఇద్ద‌రి క‌ల‌యిక అలాంటిది. నిజానికి ల‌లిత‌గారి ప్ర‌స్తావ‌న‌, ప్ర‌మేయం లేకుండా భుజంగ‌రావుగారికి ఉనికి
సాహిత్యం వ్యాసాలు

రారా విమర్శలో ఆధునికత ఎంత?

రాచమల్లు రామచంద్రారెడ్డి  గురించిన అంచనా లేకుండా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ పురోగతిని నిర్ధారించలేం.  సాహిత్య విమర్శలోని కొన్ని అంశాల్లో ఆయన  ప్ర‌త్యేక ముద్ర‌ వేశారు.  విమర్శలోకి ఒక వరవడిని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మంచి వచనం రాసిన కొద్ది మందిలో ఆయన ఒకరు. చాల సూటిగా, నేరుగా, పదునుగా ఆయన వాక్య విన్యాసం ఉండేది.   తన రచనలతో ఆయన విమర్శ రంగాన్ని ముందుకు తీసికెళ్లారు.  అయితే ఆయన ఎంత ముందుకు తీసికెళ్లారు?  ఆందులో ఆయన ప్రత్యేకత ఏమిటి?  పరిశీలించాలి. విమర్శలో  నిక్కచ్చిగా ఉంటాడని  ఆయనకు  పేరు.  కాబట్టి ఆయన విమర్శను కూడా అలాగే చూడాలి.     మనం
కాలమ్స్ కథావరణం

ఇంకేమీ లేదు, జీవితమే.. నామిని కథ “అకా, కేక కా!”

భర్త చనిపోయిన దశలో పూర్తిగా నిరాశామయ  వాతావరణంలో నుంచి బయటపడి , నూతనోత్సాహంతో జీవితాన్ని పునః ప్రారంభించిన ఒక సాధారణ మనిషిలోని చైతన్యమే ఈ కథ. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక  2015 సెప్టెంబర్ సంచికలో ఈ కథ ప్రచురితమైంది. ఊర్లో అతడి పేరు చిలకాయన. తిరుపతిలో పేరు మునీంద్ర. ఊర్లో వాళ్లతో అతడికి ఎలాంటి అనుబంధం ఉన్నట్లు కనిపించదు. ఇస్త్రీనలగని తెల్ల బట్టలతో నిద్ర లేచి లేవంగానే తయారై తిరుపతి టౌన్ క్లబ్  కి వెళ్ళి పోతాడు. ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు ఒంటి మీద గుడ్డలు నలగకుండా చేతిలో ఒక ప్లాస్టిక్ కవర్ తో తిరిగి ఊర్లోకి వస్తాడు. మడత