సాహిత్యం కవిత్వం

మరణం అతనిదేనా….

  ప్రేమను వ్యక్త పరిచే   మానవులు వున్న నేలపైనుండి   ఒకానొక మనిషి   దారి చేసుకుంటూ తరలిపోయాడు.   పంజరాన్ని ధ్వంసం చేసి   పావురం కళ్ళల్లోకి చూచిన వేగుచుక్క-   దేహ రహస్యం తెలిసిన ఆఖరి మనిషి   భూమి ఆలింగనంలో   కంటి పాపను దాచుకున్నాడు    జాబిలి వైపు చిరునవ్వు విసిరి    అంధకారపు ఆకాశంలోకి     నక్షత్ర వల విసిరి     నేలపై వెలుగును శాశ్వతం చేసిన వాడు     మరణం అతనిదేనా     ఒక కలను మోసిన వారందరిది     ఆకలి
సాహిత్యం కథలు

స్వామి

అది వేదిక కాదు. ఒక ఆడిటోరియం కాదు. అక్కడున్న వాళ్ళందరు సమాజం నుండి బహిష్కరణకు గురైన వారే.  వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు  కూడా పేదరికంలో జీవిస్తూనే వున్నారు. వృద్ధుల సమూహంతో కూడిన ఒక పెద్ద గుంపు అక్కడ చేరింది. సాధారణ ప్రజలు అస్యహించుకునే బంకాటి కుష్ట్ కాలనీ అదే. ధన్బాద్ నుండి 8 కిమీ దూరంలో ఆ కాలనీ ఉంటుంది. ఫాదర్ స్టాన్ స్వస్థలమైన రాంచీ నుండి 145 కి.మీ దూరంలో వుంది. జెసూట్ పూజారి  ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ ఒక మేకు నుండి చెట్టు కాండం పైన వేలాడదీయబడింది. దాని చుట్టూ ఉన్న బంతి పువ్వుల దండ  నిర్వాహకుల నిధుల
సాహిత్యం కవిత్వం

క‌ళ్లారా చూశాము

కామ్రేడా.... ఆర్‌కే అమరులు అస్తమయంలోనుంచే ఉదయిస్తారనే మాటను మొన్ననే మేము కళ్లారా చూశాము. ఆర్‌కే  అమడ‌య్యాడ‌న‌గానే ఎన్ని హృదయాలు అయ్యో.. ఆ మాట అబద్ధం అయితే బాగుండని తల్లడిల్లయో సరిగ్గా అప్పుడే చూశాము కామ్రేడా.. నీవు మరణిస్తూనే రెట్టింపు వెలుగుతో  ఉదయిస్తూన్నావని అస్తమయం క్షణకాలమని అది వేన వేల వెలుగుతో అరుణోదయం తప్పదని కామ్రేడా.. మేము మొన్ననే చూశాము ఉక్కు సంకల్పంతో నువ్వు హామీపడ్డ మాటని నేలకొరిగి నెరవేర్చినప్పుడు "జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం" అని నీవు హామీపడ్డ మాటను ఆలింగనం చేసుకున్నప్పుడు కామ్రేడా.... మేము మొన్ననే చూశాము  కోట్లాదిమంది
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌కుడు పోతులూరి వీర‌బ్ర‌హ్మం

పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు. ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా
కాలమ్స్ క్యా చల్రా .?

బొగ్గు కొర‌త లేదు.. వ్యాపారం అంతే

1 మళ్లీ చీకటిరోజుల్లోకి గ్రామాలను, పట్టణాలను ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభం తోసేయనుందా? జ: అలాంటి అవకాశమే లేదు. ఎందువల్లనంటే, ఈ రోజు విద్యుత్‌ ప్రభుత్వ బాధ్యతగా కాక, ఒక సరుకుగా మారిపోయింది. ఎప్పుడైనా సరుకులు అమ్ముడుపోతేనే లాభం వస్తుంది కనుక, విద్యుత్‌ కూడా అమ్ముడుపోవాలి. ఇది నేడు నిత్యావసరమయింది కనుక, ప్రజలు కూడా ధర ఎక్కువైనా తప్పకుండా కొనితీరవలసిందే. 2. థర్మల్‌ విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గు కొరత, దిగుమతి సమస్యలే ఈ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయా? జ: బొగ్గు కొరతే లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి తెలిపారు. తాజాగా ఆర్ధిక అంత్రి ఎటువంటి కొరత లేదని, విద్యుత్‌ ఉత్పత్తిలో
సాహిత్యం కవిత్వం

దినమొక గండం పగలొక రాత్రి

రక్తంరుచి మరిగిన వలస రాబందులు వర్గ సమాజానికి వకాల్త పుచ్చుకొని రాజ్యం రక్షణే ధ్యేయంగా మా విప్లవ కేంద్రాలకు వలస సాచ్చాయి "సమాధానో"ప్రహార దాడులలో రణరక్కసి ధ్యేయంగా రక్త దాహపు వేట రాజ్యానికి పసందైన ఆట. నేడు తెలంగాణ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ రాజ్య నిర్బంధ శిబిరం 40 ఏళ్ల ఆవల నుంచే ఇక్కడ ఆ ఖాకీలకు మా రక్తం శీతల పానీయం మా శరీరపు మాంసపు ముద్దలు పంచభక్ష పరమాన్నాలు కానీ మా రక్తం   నిరంతర ప్రవాహం మా శరీరం అఖండితం స్మశాన ప్రశాంతత కోసమని హింస ప్రతి హింసల మధ్య యుద్ధ ఛాయలలో ఇప్పుడు ఊరు
సాహిత్యం కాలమ్స్ కథ..కథయ్యిందా!

అపార్థాల‌ను చెదరగొట్టిన కథ

ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో  అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు. పైకి  కథ  తాగునీటి సమస్య చుట్టూ  నడుస్తుంది. సారాంశంలో  కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఒకానొక  కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి  లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం  పడే  తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ  కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో  చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన  వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు  నీటిని సరఫరా చేయడం
కవిత్వం సాహిత్యం

దేశం కల కంటోంది

దుఃఖ సంచారి చంద్రుడు  కలల్లా పగులుతున్న వెన్నెల  ఈ సింహాసనానికి సిగ్గు నరం లేదు ఒక చలన సౌందర్య మానవ జీవ కళ జీవితంలో తడుస్తున్నప్పుడు- కళ్ళల్లో  శిశిరం! ఒక చిరునామా  జాతీయ జెండా నెత్తుటి దాహమై పోయింది ఒక నిప్పుల కల మీద  ప్రవహిస్తున్న మృత్యువు  బువ్వ కుండలో  బుల్లెట్ చొరబడింది  రెక్కలు తెగిన చూపుల్లో  కుప్పకూలిన నవ్వులు  ఒక అకాల యుద్ధం పగలబడి నవ్వుతున్నా కాలం కన్నీళ్లు సానపడుతూ ఒక అంతర్గత ప్రమాద కంపం తొంగి చూస్తూ ఉంటుంది దేశభక్తి నిధి  సామ్రాజ్యవాదం చీకట్లో కులుకుతున్నా పొన్న పూలు రాలిపడిన  ధ్వని సుడుల్లో దేశ దరిద్రం