సాహిత్యం కాలమ్స్ కథావరణం

దేవుడా ? మనిషా? ఓ మనిషీ.. నువ్వు ఎటు వైపు?

మనుషుల  కష్టాలను, సమస్యలను, దుఃఖాలను తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఈ అసమ సమాజంలో  వివిధ సామాజిక ఆర్థిక స్థితిగతుల మధ్య పూడ్చలేని అగాధాలను, అంతరాలను సృష్టించింది ఎవరు? ఈ హద్దులు అంతరాలు అగాధాలను అధిగమించడానికి ఎవరు  ఏం చేయాలి? శ్రామిక వర్గాల శ్రమను నిరంతరం  నామమాత్రపు వేతనాలతో  నిలువు దోపిడి చేస్తున్న  బూర్జువా పెట్టుబడిదారి ఉన్నత తరగతుల వర్గాలు ఆ శ్రామిక వర్గాల కోసం, కనీసం కృతజ్ఞత చూపించకపోవడాన్ని, ప్రాణాపాయ పరిస్థితులలో సైతం ఎంత మాత్రము డబ్బు సహాయం చేయడానికి ముందుకు రాని వైనాన్ని , మనుషుల కోసం ఏమీ చేయలేని మనుషులు దేవుడి కోసం మాత్రం దేవుడి
సాహిత్యం కవిత్వం

విత్తనం పుట్టక మానదు

నెత్తు రోడ్డుతున్న నేలపై విత్తనం పుట్టక మానదు. పదునెక్కిన నేలపైన వసంతమై చిగురిస్తుంది  ఒకట రెండ ఎన్నో నింగి నేల నిండ నిండు త్యాగం. పుట్టుక కోసం పురటి నొప్పుల దారి పురుడు పోసుకుంటున్నది కాలం కౌగిలిలో గింజకుంటున్న హృదయాలు చరిత్ర దారిలో చెదరి పోవు ఆకాశం హద్దు లేకుండ తూర్పు కిరణాలు   ప్రసరిస్తయ్ ఎర్రపూలవనంలో పిడికిళ్ళు బిగుసుకుంటయ్ త్యాగాల దారిలో...
సాహిత్యం కవిత్వం

తండ్రి తొవ్వ‌లో

మున్నా మున్నా మున్నా- నా చిన్నారి పొన్నారి కన్నా నాన్న ప్రేమకు నువ్వు వారధివి నా కలల ప్రపంచం సారధివి పృథ్వి అడిగే ప్రశ్న ఆకాశం నడుమ అడివే తీర్చింద సందేహం ॥ము­న్నా॥ నీ తండ్రి భుజంపైన బందూకురా నిన్నెత్తుకునే జాగ యాడుందిరా నీలాగే సుట్టూత జనసేనరా కొడుకైన జనంలో భాగమేరా పొద్దంత మీ నాన్న సూర్యుడైతే రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా ॥ము­న్నా॥ నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా నువు మెచ్చినా వనమంత జ్ఞానమేరా నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా నిన్ను చుట్టు వ­ట్టిందో పద్మవ్యూహం నువ్వభిమన్యుడైనావా ప్రజల కోసం   ॥ము­న్నా॥ పృథ్వంటు ఒక పేరు
కవిత్వం సాహిత్యం

అమరుని స్వప్నం

ఎంతటి నిషి ఈ వసంతాన్ని ఆవరించిననూ ఎంతటి కుంభవృష్టి ఈ వాసంతాన్ని ముంచిననూ ఎంతటి అనావృష్టి ఈ వసంతాన్ని వంచించిననూ వారు చుక్కలవలే వెలిగి జ్ఞానాన్ని వెలువర్చారు సూర్యునివలే గర్జించి శక్తిని చేకూర్చారు చినుకువలే స్పందించి వసంతానికి ఉపిరిపోసారు వారు ఉల్కాపాతం వలే ఊపిరినొదిలి ఈ పాలపుంతలో వారి జ్ఞాపకాలను ఆశయాలను వదిలిపోయారు అయితే మేమే శృష్టికర్తలమను గర్వంతో విర్రవీగే వాళ్ళకు వారి అమరత్వం తలచుకున్నా వెన్నులో వనుకే అందుకే స్థూపాన్ని ఆపాలనుకుంటారు సభలని అడ్డుకుంటారు పుస్తకాన్ని నిషేదిస్తారు
సాహిత్యం సమీక్షలు లోచూపు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

పెరిగింది కొండంత – తగ్గింది గోరంత

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలను మోసం చేసే చర్యలను కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా యధేచ్ఛగా పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా పెంచి, ప్రజల సొమ్మును యదేచ్ఛగా దోపిడీ చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి, ఉత్పాదక కంపెనీలకు, మార్కెటింగ్ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా మార్కెట్ శక్తుల వల్లే జరుగుతోందని మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్దం. వివిధ రాష్ట్రాల్లో అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మోడీ సర్కార్ నవంబర్ 3న పెట్రోల్, డీజిల్ పై నామమాత్రపు తగ్గింపును ప్రకటించి, వ్యాట్ పేరుతో మిగిలిన దంతా రాష్ట్రాల పైకి నెట్టేసింది.
వ్యాసాలు సమకాలీనం

ఆకలి కడుపులతో అమృతోత్సవం!

బ్రిటీష్‌ వలసవాదుల నుంచి భారత పాలక వర్గాలకు అధికార బదిలీ జరిగి వచ్చే ఏడాది ఆగష్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో అమృతోత్సవం నిర్వహించాలని మోడీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చింది దేశ భూభాగానికే కాదు ప్రజలకు సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం అని గమనిస్తే జనాభాలో సగం మంది  పేదరికంతో ఆకలితో అలమటిస్తుంటే, ప్రజలు ఉత్సవాలలో ఎలా పాల్గొంటారు? ఏడున్నర దశాబ్దాలలో ప్రజల మౌలిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, వైద్యం, విద్య ఇప్పటికీ ప్రజలందరికి అందుబాటులోకి రాలేదు. బయట పల్లకీ మోత ఇంట్లో ఈగల మోత
క్లాసిక్స్ ప‌రిచ‌యం

నాగరికతా…..అనాగరికతా…

కుటుంబం - సొంత ఆస్తి-రాజ్యాంగ‌యంత్రం-5       ఇంత వరకూ చూసిన ప్రజా సమూహాలలో ఉదాహరణలతో గణ వ్యవస్థ ఏ విధంగా శిధిలమైపోయిందో చూసాం. ఇక ఆఖరున గణ వ్యవస్థను శిధిల పరచిన ఆర్ధిక పరిస్థితులను చూద్దాం. దీనికై మార్క్సు రాసిన ‘పెట్టుబడి' పుస్తకం అవసరం. మోర్గాన్ పుస్తకం లాగే.    గణ వ్యవస్థ అటవిక కాలపు నడిమిదశలో పుట్టింది. వున్నత దశలో అభివ్రుద్ధి చెందింది. ఈ దశకు అమెరికను ఇండియన్లను ఉదాహరణకి తీసుకుందాం. వీరిలో గణ వ్యవస్థ పూర్తిగా అభివ్రుద్ధి పొందింది. తెగ ఎన్నో గణాలతో ఏర్పడుతుంది. సాధారణంగా రెండే గణాలు వుంటాయి. జనాభా పెరుగుతున్న
సాహిత్యం ఇంటర్వ్యూ సంభాషణ

దృక్ప‌థం అందించే ఎరుక వ‌ల్ల‌నే క‌థ గుర్తుండిపోతుంది

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  గ‌త  సంచిక‌లో ఇద్ద‌రు  సాహిత్య‌కారుల అభిప్రాయాలు  ప్ర‌చురించాం. ఈ సంచిక‌లో మ‌రో ఇద్ద‌రి స్పంద‌న‌లు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి
వ్యాసాలు సమీక్షలు

కులం-బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ… కొన్ని ప్రశ్నలు, పరిమితులు

‘’కులం బహుజన ప్రజాస్వామిక విప్లవ దశ’’ అనే ఈ పుస్తకంలో సామాజిక మార్పును చారిత్రకంగా, భౌతికవాద దృష్టితో పరిశీలిస్తూ, అందులో భాగంగా కుల సమస్యను సీరియస్ గా  తీసుకొని విశ్లేషించి రాసిన వ్యాసాలున్నాయి. అందువల్ల ఇది అందరూ చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం.        అయితే ఒక పుస్తకం ముఖ్యమైన మంచి పుస్తకం అని అంటున్నానంటే అందులోని విషయాలన్నింటి పట్ల పూర్తి ఏకీభావం ఉన్నట్టు కాదు. ముఖ్యంగా ఇందులో రచయిత పట్టా వెంకటేశ్వర్లు గారు చేసిన కొన్ని నిర్ధారణల పట్ల నాతో సహా కొందరు మార్క్సిస్టు లకు విభేదం ఉండవచ్చు. అవి విప్లవ కమ్యూనిస్టులకు సంబంధించినవి అయినందువల్ల మాత్రమే కాక