వ్యాసాలు

విలువ‌ల ప్ర‌తినిధి

ఆర్‌కే తన జీవిత పర్యంతం నమ్మిన రాజకీయాల్లో కొనసాగాడు. చాలా  కష్టాలు అనుభ‌వించాడు. ఆదర్శప్రాయంగా నిలిచాడు.   వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న గురించి తెలియ‌ని వాళ్లు కూడా ఇలాంటివ‌న్నీ త‌ల‌చుకుంటున్నారు.  ఒకప్పుడు ఆయనతో పని చేసినవాళ్లు చాలా గౌరవంగా,  ఉద్వేగంగా  ఆర్‌కే వ్య‌క్తిత్వాన్ని  గుర్తు చేసుకుంటున్నారు.     త‌మ కాలంలో ఇలాంటి వాళ్లు జీవించి ఉండ‌టం   ఎవ‌రికైనా అపురూపమే.  ఆయ‌న రాజ‌కీయాల‌తో త‌మ‌కు  ఏకీభావం లేక‌పోయినా ఆయ‌న నిబ‌ద్ధ‌త గొప్ప‌ది అని నివాళి ప్ర‌క‌టిస్తున్న‌వాళ్లున్నారు.  వ్య‌క్తుల‌తో   రాజ‌కీయ విభేదాలు  ఎన్నో ఉంటాయి. కానీ రాజ‌కీయాల‌కు, భావ‌జాలాల‌కు అతీతంగా  మ‌నుషులు ప‌ర‌స్ప‌రం క‌నెక్ట్ అయ్యేవి అంత‌కంటే ఎక్కువ ఉంటాయి.     స‌మాజంతో విప్ల‌వోద్య‌మానికి  ఈ
సంపాదకీయం

పుస్తకం ఎవరికి ప్రమాదకారి?

ఇవాళ దేశంలో జ్ఞానం అన్నిటికన్నా ప్రమాదకరమైనది. దానిని మోసే పుస్తకం, ఆ పుస్తకాన్ని రాసే, చదివే వ్యక్తులు ప్రమాదాకారులు. ఎలాగో మూడు ఉదాహరణలు మాత్రం చెప్తాను. మావోయిస్టు నాయకుడు ఆర్. కె. జ్ఞాపకాలతో ప్రచురించిన సాయుధ శాంతి స్వప్నం పుస్తకాలను ప్రెస్ నుండి విడుదల కాక ముందే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుస్తకాలను నిషేధించిన హీనమైన చరిత్ర కూడా మనకుంది కానీ అందులో ఏముందో కూడా చూడకుండా ఎత్తుకుపోవడం బహుశా ఇప్పుడే చూస్తున్నాం. వెయ్యి కాపీల పుస్తకాల కోసం వంద మంది ప్రెస్ మీద దాడి చేసి భీభత్సం సృష్టించి, వాళ్ళ ప్రాపర్టీ ఎత్తుకుపోయి వాళ్ళ మీదే కేసులు
సాహిత్యం కథలు అల‌నాటి క‌థ‌

గుమ్మ‌న్ ఎగ్లాప్పూర్ గ్రామ‌స్థుడు

ఉద‌యం లేచింది మొదలు లింగన్న మనసంతా కకావికలమైపోతోంది. వర్షాకాలం, అడవి పచ్చగా వుంది, రాత్రి కురిసిన వర్షానికి నేలంతా బురదబురదగా వుంది. కురిసి కురిసి లింగన్న గుడిసె చెమ్మగా వుంది. ఏడేళ్ళ కూతురు ఆకలితో ఏడుస్తోంది. పదేళ్ళ కొడుకు ఆకలిగా మూలుగుతున్నాడు. లింగన్న భార్య లచ్చిమి బాలింత జ్వరం యింకా తగ్గినట్టులేదు. లింగన్న తల్లి ఎల్లవ్వ కాలుకున్న మానని గాయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. పొయ్యిమీద అంబలి కుండ ఎక్కించడానికెవరూ లేనట్టుగా వుంది. అందరూ నిస్సత్తువగా వున్నారు. లింగన్న లేవడంతోనే కన్పించిన దృశ్యాలివి. ఇక ఎక్కువసేపు ఆ గుడిసెలో వుండలేకపోయాడు. అలవాటుగా బయటకు నడిచాడు. మబ్బులచాటునుండి సూర్యుడిరకా బయట
సాహిత్యం కవిత్వం

నిప్పు కణిక

కణ కణ మండే నిప్పు కణిక ఆ బాలిక తన సమస్యలన్నింటికీ  నిప్పెలాబెట్టాలో తెలుసు ఆమెకు తల్లికెలా సాయపడాలో తన కలలసౌధం ఎలా నిర్మించుకోవాలో తెలుసు ఆ చిన్నారికి ప్రమోదం కన్నా ప్రమాదమే తనకోసం ఎదురు చూస్తూ ఉన్నా నిప్పు, ఉప్పు తానై నలుగురి కోసం వండడం తెలుసు తన భవిష్యత్తు కోసం కాలాన్ని తన చేతుల్లో బంధించటం తెలుసు ఏడు దశాబ్దాల ఎదురు చూపుల్లో కాల్చి బూడిద చేయాల్సినవేమిటో తెలుసు ఓటుకు నోట్లతో పిట్టకథలు చెప్పే మహా మాంత్రికుల పని పట్టటం ఎలాగో తెలుసు ప్రామిసింగ్ పాలన పునాది ఆ బాలిక భవిష్యత్ కాలాన్ని తన గుప్పిట
సాహిత్యం కవిత్వం

నావికుడు

నెత్తురు కక్కుతున్న కాలాన్ని తన నగ్న పాదాలతోనే అధిగమించాడతను పూసే పొద్దుకు అభిముఖంగా అనివార్యపు యుద్ధంలా పర్చుకొని చరిత్రను విస్తృతం చేశాడు అతను కేవలం అస్తమించాడు ఈ ముసురు యుద్ధపు విచ్ఛిత్తిలో అనునయంగా మనతో సంభాషిస్తూనే ఉంటాడు కాళ్ల కిందికి విస్తరిస్తున్న మృత్యువును శతృ కల్పిత వేల వేల సందిగ్ధాలను నిరంతరంగా తిరగ రాసుకుంటూ ఆయువును ద్విగుణీకృతం చేసుకున్నాడు 0   0 0 ఒక్కడిగా పేరుకుపోయిన మానవుడ్ని శుభ్రం చేస్తూ నగరానికొచ్చినా సమూహాల నిస్సత్తువకు మందుగుండు దట్టించినా కల్పన కానిది.. కత్తుల అంచున రొమ్ము విరిచిన యుద్ధ ప్రియుడి సారాంశం కథకాదది గుండె విప్పిన దుక్కిలా రేపటిని
సాహిత్యం కవిత్వం

శాంతి స్వప్నం

పుస్తకాలు రాజ్యాన్ని భయపెట్టిస్తున్నాయి అందుకే అది పుస్తకం పుట్టకముందే పురిటీలోనే బంధిస్తున్నది పే....ద్ద పాలక ప్రభుత్వం చిన్న పుస్తకానికి, పుస్తకంలోని అక్షరాలకు భయపడటం చరిత్రలో మాములే కానీ.. పుస్తకాలు పురిటినొప్పులు  పడుతున్నప్పుడే పుట్టబోయేది "సాయుధ శాంతి స్వప్నమని"  భయపడి బంధించడమే ఇప్పుడు నడుస్తున్న అసలు రాజ్యనీతి అంతేకదా నెత్తురు మరిగిన రాజ్యానికి శాంతి స్వప్నమంటే  పాలకులకు పెనుగులాటే కదా మరి స్మృతులు యుద్ధాన్ని సృష్టిస్తాయట దుఃఖాల కలబోతకు కూడా కలవరపడుతున్న రాజ్యం ఎంత దృఢమైనదో తెలుస్తున్నది కదా అంతా మేకపోతు గంభీరమే అని
సాహిత్యం కవిత్వం

జర్నీ

అతడు మన రక్త బంధువు కాకపోతేనేం నలభై ఏళ్లుగా రక్తం ఎవరికి  ధారపోశాడో తెలుసుకో అతను మన కులంవాడు కాకపోతేనేం నలభై ఏళ్లుగా ఏ కులాల వైపు నిలబడ్డాడో చూడు అతను  మనకు అక్షరాలు నేర్పకపోతేనం నలభై ఏళ్లుగా నేర్చుకున్న ప్రతి అక్షరం ఏ వాడల్లోని సూర్యోదయానికి పొదిగాడో  చూడు అతను  మన మతం వాడు కాకపోతేనేం నలభై ఏళ్లుగా  మత రహిత నూతన మానవ ఆవిష్కరణకు చేసిన ప్రయోగాలు ఎన్నో కనుక్కో అతను మన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతేనేం నలభై ఏళ్లుగా మనందరం కలిసి నిర్మించాల్సిన జగత్తు కోసం   ఏ ఏ దారుల్లో పాదయాత్ర చేశాడో చూడు అతను
సాహిత్యం అంతర్జాతీయ చిత్ర సమీక్ష

హృదయాల్ని కలవరపరిచే ‘ఒసామా’

ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జపాన్ దేశాల సంయుక్త ఆధ్వర్వంలో ఫార్సీ భాషలో, ఇంగ్లీష్ ఉపశీర్షికలతో వచ్చిన హృదయాల్నికలవరపరిచే మర్చిపోలేని చిత్రం“ఒసామా”. ఈ  చిత్రదర్శకుడు “సిద్దిక్ బార్మాక్”. దీని నీడివి 84 నిమిషాలు. ఇతివృత్తం: బాలికల, మహిళల అణచివేత అమానుషంగా అమలవుతున్నఆఫ్ఘనిస్తాన్ దేశం నుండి ఒక బాలిక, ఆకలి బాధ భరించలేక బాలుడి అవతారమెత్తి పడరాని అగచాట్లు పడుతుంది. ఒక కుటుంబంలోని మూడు తరాల మహిళలను ప్రతినిధులుగా తీసుకుని తాలిబన్ పాలనలోని ఆఫ్ఘానీ మహిళల దుర్భరమైన జీవితాలకు సంబంధించిన కొన్ని పార్శ్వాలను దృశ్యీకరించడమే ఈ చలన చిత్ర సారాంశం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల
సంపాదకీయం

సాహిత్య విమ‌ర్శ‌కు సొంత కార్య‌క్షేత్రం లేదా?

ఈ న‌డ‌మ ఏదో ఒక రూపంలో సాహిత్య విమ‌ర్శ గురించిన చ‌ర్చ‌లు  జ‌రుగుతున్నాయి . ఇప్పుడు  ఆ చ‌ర్చా సంద‌ర్భాల గురించి   మాట్లాడ‌బోవ‌డం లేదు.  అవి కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను  ప‌రోక్షంగా ముందుకు తీసుకొచ్చాయి.  అవి మాట్లాడుకుంటే చాలు.   సాహిత్య విమ‌ర్శ ప‌ని ఏమిటి? దానికి  సొంత కార్యక్షేత్రం ఏదైనా ఉన్న‌దా?    విమ‌ర్శ అనేది సాహిత్యం మీద‌,  సాహిత్య‌కారుల మీద ఆధార‌ప‌డిన ప‌రాన్న‌జీవి మాత్ర‌మేనా?     ర‌చ‌యిత‌ల‌ను పొగిడి వాళ్ల మెప్పు పొంద‌డంతో విమ‌ర్శ కార్య‌క్షేత్రం ముగిసిపోతుందా?  అనేవి ఆలోచించాలి.  నిజానికి సాహిత్యం గురించి   మాట్లాడుకొనేట‌ప్ప‌డు *సాహిత్య విమ‌ర్శ‌* ఆట‌లో అరిటిపండులా మారిపోతోంది. నేరుగా దాని గురించి
కవిత్వం సాహిత్యం

చెరగని నేను

అవును నేనెవరిని అందరి లాగే నేను ఐనా నేనంటే గిట్టదు  నా ముస్తాబు నా ఇష్టం రకరకాల రంగుల్లో నాకు నచ్చిన రంగు తొడుక్కుంటా నాలోని భావాలు నలుగురిలో పంచాలనుకుని రూపు దిద్దుకుని జనంలోకి వస్తా నా ఆశయాలు వేరు నా ఆదర్శాలు వేరు అందరూ పాటించాలనే నియమం లేదు కొరడా పట్టుకుని ఝుళిపించనూ లేదు నా మానాన నేను కమ్మలతో కూర్పు నన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనుకుంటే తప్పా?! నా లోని ఒక్కో తెర ఒక్కో కఠోర వాస్తవ దర్పణం చరిత్ర నేటి తరానికవసరం నన్ను స్వీకరిస్తారో త్యజిస్తారో జనం ఇష్టం నన్ను బైటికి రాకుండా చేసే