నివాళి

సాహిత్య విమర్శలో కెవిఆర్ చారిత్రక దృక్పథం

ఇది కెవిఆర్ శతజయంతి సంవత్సరం. ఆయ‌న మార్చి 23, 1927న జన్మించారు. 1948లో తన 21వ ఏట అభ్యుదయ రచయితల సంఘంలో చేరారు. 1998 జనవరి 15న తన 71వ ఏట విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా కన్నుమూశారు. సరిగ్గా యాభై ఏళ్లు సాహిత్య సాంస్కృతిక మేధో ఉద్యమాల్లో తలమునకలుగా ఉన్నారు. ఆ ఉద్యమాల ప్రధాన నాయకుడిగా, వ్యాఖ్యాతగా, పెద్ద దిక్కుగా కొనసాగారు. వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో యాభై ఏళ్లు పార్టీతో కలిసి నడిచారు.  సిపిఐ దగ్గరి నుంచి సిపిఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ దాకా ఆయన ప్రయాణం సాగింది. కేవలం పార్టీ  అభిమానిగా, శ్రేయోభిలాషిగా కాదు.
నివాళి

ప్ర‌జా యుద్ధంలో, ప్ర‌త్యామ్నాయ నిర్మాణంలో పాక హ‌నుమంతు

ప్రజాయుద్ధ నాయకుడు, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి, మావోయిస్టు ముఖ్య నేత కామ్రేడ్ పాక హనుమంతు అలియాస్ వుయికె గణేష్ డిసెంబర్ 25న ఒడిశా లో అమరత్వం, 28వ తేదీన అన్ని ఆటంకాలను, కుట్రలను దాటుకొని పోరాటాల నల్లగొండ జిల్లా, చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో తను పుట్టిన గడ్డమీద ఆ మహా నాయకుడి పార్థివ దేహానికిఅత్యంత గౌరవపూర్వకంగా జరిగిన అంతిమయాత్రలో అంతే చైతన్య పూర్వకంగా వేలాదిమంది పాల్గొని ఎర్రెర్రని నివాళులు అర్పించిన సందర్భంగా గణేష్ అన్నకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు, (2000 సంవత్సరం నుండి 2013 వరకు సంబంధించినవి). ఇప్పుడు ఆపరేషన్ కగార్ ను  భూతద్దంలో చూపెడుతూ, దాని
నివాళి

ప్ర‌జాక‌వి అందెశ్రీ‌కి జోహార్లు

 తెలంగాణ ప్ర‌జాక‌వి అందెశ్రీ (అందె ఎల్ల‌య్య‌) హైద‌రాబాద్‌లో సోమ‌వారం (2025 నవంబర్ 10 న) హ‌ఠార్మ‌ర‌ణం పొందారు. తెలంగాణ‌ గుండె క‌నీసం మూడు ద‌శాబ్దాలపాటు ఆయ‌న గొంతుక‌లో కొట్లాడింది.  1960వ ద‌శకం తొలి రోజుల్లో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా జ‌న‌గామ స‌మీపంలోని రేబ‌ర్తి అనే గ్రామంలో నిరుపేద కుటుంబంలో అందె ఎల్ల‌య్య జ‌న్మించారు. బాల్యంలోనే కుటుంబమంతా చెల్లాచెదురైంది. దీంతో అనాథగా బతికారు. బడికివెళ్లి చదువుకొనే అవకాశం లేదు. అదే ఊరిలో మల్లారెడ్డి, సూరమ్మ దంపతులు ఆయ‌న‌ను చేరదీశారు. వాళ్ల దగ్గరే ఉంటూ పశువులు కాస్తూ, పనుల్లో సాయపడేవారు.  మల్లారెడ్డి దగ్గరే భారతం, భాగవతాలు కంఠతా పట్టారు. బాల్యం నుంచే
నివాళి

సీమ కథా ఆధునికతలో దీపధారి

ప్రముఖ కథా, నవలా రచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి మే 22న మృతి చెందారు. ఆయన కథ, నవల, సాహిత్య విమర్శ, సంపాదకత్వం వంటి అనేక ప్రక్రియల్లో విరివిగా పని చేశారు. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా వృత్తి సంబంధమైన పనుల్లో కూడా ఆయన ప్రత్యేకత ఉన్నది.  ఆయన సుదీర్ఘ సాహిత్య జీవితంలో అనేక ఉద్యమాలు, వాదాలు వచ్చినా ఆయన నేరుగా వాటితో ప్రభావితం కాలేదు.  తన తొలినాళ్ల గ్రామీణ జీవితానుభవం ఆయన కాల్పనిక రచనలకు చోదకంగా పని చేసింది. అక్కడి నుంచే ఆయన ప్రపంచంలో జరుగుతున్న చాల పరిణామాలను చూశారని ఆయన కథలనుబట్టి చెప్పవచ్చు. అట్లా రాయలసీమ ప్రాదేశిక జీవితానుభవం,
నివాళి

మానవతా చైతన్యం, రాయలసీమ మూర్తిమత్వం

కొందరిలో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది. అద్భుతం ఉంటుంది. వాటి ముందు ఎవరంతకువారు వినయంగా, ప్రియంగా, గౌరవంగా ఉండిపోవాల్సిందే. అలాంటివారిలో కర్నూలు రిటైర్డ్‌ ఇంజనీర్‌ సుబ్బరాయుడు సార్‌ ఒకరు. ఆయనను ఎవరైనా ‘సుబ్బరాయుడు  సార్‌’ అనే అంటారు. ఆయనలోని నైతిక విలువలకు, మానవతా చైతన్యానికి, రాయలసీమ  అభివ్యక్తికి దక్కిన గౌరవం అది. ఆయన సమక్షంలో ఎవరైనా సరే సౌకర్యంగా మెలగడానికి కారణం ఆయన నమ్రత, నెమ్మదితనం. తనకు ఇరిగేషన్‌ మాత్రమే తెలుసని, ఈ ప్రపంచం చాలా విశాలమైనదని, అందులో ఎన్నో సమస్యలు, అధ్యయనాంశాలు ఉంటాయనే ఎరుక పుష్కలంగా ఉన్న మేధావి ఆయన.  తాను తుంగభద్ర, కృష్ణా నదీజలాల సాంకేతిక
నివాళి

విప్లవ ప్రేమికుడు కామ్రేడ్‌ ఎల్‌. సుబ్బయ్య

బిఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి, విప్లవాభిమాని ఎల్‌. సుబ్బయ్య(88)గారు గత కొద్ది కాలంగా వయోభారంతో, అనారోగ్యంతో బాధపడుతూ  ఏప్రిల్‌ 6వ తేదీ హైదరాబాదు ఆస్పత్రిలో అమరుడయ్యాడు. ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తగా మొదలై జీవిత పర్యంతం లౌకిక ప్రజాస్వామి విప్లవశక్తుల పక్షాన దృఢంగా నిలబడ్డారు. బైటి ప్రాంతాల్లో కర్నూలు సుబ్బయ్యగారిగా ఆయన అనేక మంది ప్రజాసంఘాల కార్యకర్తలకు, మేధావులకు, రచయితలకు చిరపరిచితుడు. కోవిడ్‌కు ముందు మూడు నాలుగేళ్ల  వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎక్కడ ప్రజాసంఘాల కార్యక్రమాలు జరిగినా తప్పక హాజరయ్యేవారు. ఏ ప్రగతిశీల సంస్థ కార్యక్రమం జరిగినా, ఉద్యమం నడిచినా వాటికి సంబంధించిన కరపత్రాలను  ప్రజల్లోకి తీసికెళ్లడం ఆయనకు
నివాళి

అనిశెట్టి ర‌జిత‌కు జోహార్లు..

ప్ర‌జాప‌క్ష ర‌చ‌యిత్రి, ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక జాతీయ అధ్య‌క్షురాలు అనిశెట్టి ర‌జిత‌కు జోహార్లు.వ‌రంగ‌ల్‌లో ఈ నెల 11 తేదీన గుండెపోటుతో ఆమె మ‌ర‌ణించారు. సామాజిక ఉద్యమ సందర్భాలకు స్పందిస్తూ, ఊరేగింపుల ముందు క‌విత్వాన్ని క‌వాతులా న‌డిపించిన సాహిత్య‌, సామాజిక ఆచ‌ర‌ణ‌జీవిగా ర‌జిత గుర్తుండిపోతారు.ఉద్యమాలతో మమేకమై జీవిస్తూ క‌ళా, సాహిత్య రంగాల్లో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం గ‌తం కంటే ఇప్పుడు మ‌రింత పెరిగింది. భిన్నాభిప్రాయాల‌ను స‌హించ‌ని వాతావ‌ర‌ణంలో ప్ర‌జాప‌క్షం వ‌హిస్తూ చిన్న కామెంట్‌, ప‌దునైన ఒక వాక్యం సోష‌ల్ మీడియాలో పెట్టీపెట్ట‌గానే ట్రోలింగ్ వేట‌ మొద‌ల‌యిపోతోంది. సొంత లాభం కొంత మానుకు.. పొరుగువానికి తోడుప‌డ‌వోయ్‌.. అన్న గుర‌జాడ అప్పారావు జీవించి ఉంటే
నివాళి

ప్రముఖ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావుకు విరసం నివాళి

సీనియర్‌ కథా రచయిత భమిడిపాటి జగన్నాథరావు ఫిబ్రవరి 6న చనిపోయారు. ఆయన తెలుగు కథా చరిత్రలో గుర్తు పెట్టుకోదగిన రచయిత. మూడు తరాల కథా వికాసం ఆయనలో కనిపిస్తుంది. 1950లలో ఆయన కథా రచన ఆరంభించారు. ఆ రోజుల్లో ని చాలా మంది కథకుల్లాగే ఆయనా మధ్య తరగతి జీవిత ఇతివృత్తం ప్రధానంగా రాశారు. సహజంగానే కోస్తా ప్రాంత సాంస్కృతిక ముద్ర ఆయన కథల్లో కనిపిస్తుంది. మానవ జీవిత సంఘర్షణను, వైచిత్రిని నిశితంగా చూసి రాశారు. చాలా మామూలు కథన శైలితో సాగే ఆయన కథల్లో ఇప్పటికీ మిగిలి ఉండేది ఆయన పరిశీలనాశక్తి, అందులోని విమర్శనాత్మకత.             కొన్ని
నివాళి

ప్రొ. కందాళ శోభారాణికి విరసం నివాళి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి,  తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా  చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.  మానవ
నివాళి

ప్రపంచ పీడిత ప్రజల ప్రియ మిత్రుడు,విప్లవ రచయిత గూగీకి జోహార్లు

గూగీ వా థియాంగో తన 87 ఏళ్ల ధిక్కార జీవితాన్ని ప్రపంచ పీడిత ప్రజల బలమైన సాంస్కృతిక ప్రతిఘటనగా నిలిపి మే 28, 2025 న భౌతికంగా నిష్క్రమించాడు. తూర్పు ఆఫ్రికా కెన్యా దేశంలోని ఒక చిన్న తెగలో జన్మించిన గూగీ తన ప్రజల గురించి, వారి బాధల గురించి, అణచివేతల గురించి రాస్తే అది తమ గురించే రాసినట్లు తెలుగు పాఠకులు భావించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా కెన్యా ప్రజల ‘మౌ మౌ’ గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ పోరాటాన్ని తలపింపజేస్తుంది. అందులో పాల్గొన్న విప్లవ వీరుడి కుటుంబం గూగీ ది. ఆ కారణంగా ఆయన