కా. గొంజాలోకు జోహార్లు
పెరూ తొలితరం మావోయిస్టు, షైనింగ్ పాత్ నిర్మాత, ప్రజాయుద్ధ సంస్కృతిని లాటిన్ అమెరికా పోరాట ఆచరణలో ఎత్తిపట్టిన గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు కామ్రేడ్ గొంజాలోకు విప్లవ రచయితల సంఘం జోహార్లు! ప్రపంచ సోషలిస్టు విప్లవాన్ని వెలిగించిన 1980ల తరం మావోయిస్టు మేధావి చివరి ముప్ఫై ఏళ్ల జీవితం జైలులోనే గడిచిపోయింది. పెరూలోని నావికా స్థావరంలోని ఆస్పత్రిలో 2021 సెప్టెంబరు 11వ తేదీన గొంజాలో 86 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా పార్కిన్సన్, చర్మ కేన్సర్‌తో ఆయన బాధపడుతున్నారు. ఈ స్థితిలో కూడా ఆయనకు వైద్య సాయాన్ని ప్రభుత్వం నిరాకరించింది. చివరకు తన భార్యతో ఇంటర్వ్యూను సైతం రద్దుచేసింది.