జగిత్యాల జంగల్ మహల్
ఈ సంచిక వసంతమేఘం పాఠకులకు *జగిత్యాల జంగల్ మహల్ * విప్లవోద్యమ చారిత్రక పత్రాల రెండు సంకలనాలు ఇస్తున్నాం. విప్లవాభిమానులకు ఇవి అపురూపమైన కానుకలు. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు దెబ్బతినిపోయాక తిరిగి ఉత్తర తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక సమరశీల రైతాంగ పోరాట ప్రజ్వలన ఉవ్వెత్తున సాగింది. అది తెలుగు నేల అంతా విస్తరించింది. దానికి అక్షర రూపం 1981లో వచ్చిన నాగేటి చాళ్లలో రగిలిన రైతాంగ పోరాటాల చరిత్ర అనే పత్రం. అది మొదలు 1984లో మహారాష్ట్ర కొండకోనల్లో ఊపిరి పోసుకుంటున్న ఆదివాసీ రైతాంగ పోరాటాల చరిత్ర అనే పత్రం దాకా ఈ రెండు సంకలనాల్లో ఉన్నాయి. ఇవి