రెడ్ జర్నలిస్ట్ కామ్రేడ్ రేణుక @బి.డి.దమయంతి
(ఐదు భాగాల మిడ్కో సమగ్ర సాహిత్యంలో *విముక్తి బాటలో ..* మూడో సంపుటానికి సంపాదకురాలు రాసిన ముందుమాట. జూలై 18 ,శుక్రవారం హైదరాబాదులో జరిగే అమరుల బంధు మిత్రుల సంఘం సభలో ఆవిష్కరణ ) విప్లవోద్యమంలో పాల్గొంటూ ఆ నడుస్తున్న చరిత్రని అనేక పద్ధతుల్లో నమోదు చేసిన ఒక రచయిత, ఒక విలేఖరి కా.గుముడవెల్లి రేణుక. భారత విప్లవోద్యమ చరిత్రలో ఆమె ఒక విశిష్టమైన స్థానాన్ని పదిలపరచుకుంది. తన 55వ యేట క్రూరమైన రాజ్యహింసకు గురై భౌతికంగా మన మధ్య నుండి నిష్క్రమించినా అదే (2025) మార్చి 31 వ తేదీన ఆమె మరణానంతర జీవితం కూడా మొదలయ్యింది.