పొద్దు తిరుగుడు పువ్వు
పొద్దు తిరుగుడు పువ్వు ప్రేమగా ఎర్రని సూర్యున్ని ముద్దాడుతూ అడవులను చెట్లను మొక్కలను అన్నిటినీ మనసారా హత్తుకుంటుంది రైతులను ఆదివాసులను ప్రేమగా దగ్గరకు తీసుకొని వారి నవ్వులకు వెలుగులను పంచుతుంది పువ్వులకు పేద ధనిక కులము మతము ఏమీ ఉండవు కదా అందరికీ సమానంగా పరిమళాలను వెదజల్లుతుంది రాజ్యం కుట్ర చేసి పువ్వులను నరుకుతున్నప్పుడు ఆ రాజ్యానికి తెలియదుపువ్వులకు కూడా బలమైన మెదడు ఉంటుందని భూమి మీద విత్తనాలు వెదజల్లుతూపువ్వులు నేలకొరిగిపోతాయి. ఒకనాటికి సూర్యున్ని ముద్దాడడానికి పొద్దు తిరుగుడు పువ్వులు మళ్లీ మొలకెత్తుతాయి.