సంభాషణ

సాహ‌సిక మేధావి, ప‌త్రికా ర‌చ‌యిత న‌ర్మ‌ద‌

రాలిపడుతున్న ప్రతి పువ్వు తన అమరత్వపు గుబాళింపులతో ప్రజల మనసులను ఆవహిస్తుంది ఎగిసిపడుతున్న ప్రతి కన్నీటి చుక్క అమరుల ఆశయాల సాధనకై ఆదేశిస్తున్నది, శాసిస్తున్నది           2022 ఏప్రిల్‌ 9, మహారాష్టలోని గడ్‌ చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో మరో విషాదకర దినంగా మిగిలిపోతుంది. ఆ ఉద్యమానికి దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం అలుపెరుగని విప్లవ సేవలు అందించి దండకారణ్య విప్లవ ప్రజలు అపార ప్రేమాభిమానాలను చూరగొన్న  కామ్రేడ్‌ నర్మదక్క తుదిశ్వాస విడిచింది.  గత మూడు సంవత్సరాలు గా అనేక తప్పుడు కేసులలో ఇరికించబడి విచారాధీనంలో వున్న 61 సంవత్సరాల  న‌ర్మ‌ద కేన్సర్‌ వ్యాధికి సరైన చికిత్స దొరుకకుండా పోయి,
కథలు

రాంకో

ఉదయం ఏడుగంటలు కావస్తున్నది. తనతో ఉన్న వారిలో నుండి ఇద్దరిని తీసుకుని ఊళ్లోకి బయలుదేరింది. అది నాలుగు గడపలున్న కుగ్రామం. పేరు మాకడిచూవ్వ.  గడ్చిరోలీ జిల్లా చాముర్షి తాలూకాలో ఉన్నది. రాయగఢ్‌ నుండి వలసవచ్చిన ఉరావ్‌ ఆదివాసులవి రెండు ఇళ్లు.  స్టానికులవి రెండు గడపలు. వర్షాలు జోరుగా కురుస్తూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలం. ఎడ్ల భుజాల మీదికి కాడిని ఎక్కించిన రైతులు పొలానికి పోవటానికి తయారవుతున్నారు. ఆడ‌వాళ్లు  వంటపని ముగించుకుని అన్నం డొప్పల్లోకి సర్దేశారు.  దానికి విడిగా ఆకు మూత వేసి గంపలో అన్ని డొప్పలనూ పెట్టుకున్నారు. పొలానికి పోవటానికి సిద్ధమవుతున్నారు.  రణితను దూరం నుండే
సాహిత్యం వ్యాసాలు

ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు -ఒక సమీక్ష  

                                           రచయిత్రి నిత్య రాసిన "ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు "పుస్తకం పై ఒక సమీక్ష  . ఈ పుస్తకాన్ని "మహిళా మార్గం "పత్రిక వాళ్ళు 2002 జనవరి లో ప్రచురించారు . కృష్ణాబాయి గారు "ప్రజా రచయిత ప్రేమ్ చంద్ "అన్న పేరుతో ముందు మాట రాస్తూ "భారతీయ సాహిత్యంలో వాస్తవికతని బలంగా ప్రతిపాదించిన తొలిరచయితలలో ప్రముఖుడు ప్రేమ్ చంద్ "అని చెప్తూ  సమకాలీన సాహిత్యంలో మధ్య
సాహిత్యం వ్యాసాలు

*చాయ్ గ్లాస్‌* విశ్లేష‌ణ 

సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు. భారత విప్లవోద్యమంలో   ఆమె
సంపాదకీయం

నిత్య నిర్మల నర్మదా ప్రవాహం

ఆమెను ఎప్పుడో ఒకసారి చూశాను. వ్యక్తిగత పరిచయాలు అక్కరలేని సామాజిక వ్యక్తిత్వాన్ని కొంతమంది సంతరించుకుంటారు. అప్పుడు మనం ఎక్కడ చెయి పెట్టినా వాళ్ల అద్భుత స్పర్శ మనల్ని పులకింపజేస్తుంది. మనం ఏది ఆలోచిస్తున్నా వాళ్లు ఒక వెలుగు రేఖ మనపై ప్రసరిస్తారు. మనం ఏ పని చేస్తున్నా వాళ్లు ఆసరాగా వచ్చి నిలబడతారు.  మనం ఏదో  వెతుకుతోంటే మన ముందు దారి పరిచిపోతారు.  సామాజికులుగా, సామూహిక చైతన్య ప్రతినిధులుగా మారినవాళ్లకే ఇది సాధ్యమవుతుంది. నర్మద అలాంటి జీవితం గడిపింది. అలాంటి వారితో కలిసి జీవించింది. దశాబ్దాల కఠోర జీవితాన్ని చైతన్యవంతంగా, ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా గడిపింది. వేలాది మందిని ప్రభావితం
సాహిత్యం కాలమ్స్ నా క‌థ‌తో నేను

కథతో నేను

పార్టీ, మంజీర, మాస్టారు లేకపోయి వుంటే నేను కథలు రాసి వుండేదాన్ని కాదేమో. రచయితను మించి కథ వుండదు అని భావిస్తాను. కథలు ఎట్లా రాసానో చెప్పే ముందు నా బాల్యం, అప్పటి నా ప్రపంచం గురించి కొంత చెప్తాను. అందునా గ్రామీణ ఆడపిల్లలకు ఇంటిపని, వాటికి తోడు నిబంధనలు దాటుకుని రావాల్సి వుంటుంది. సమయమూ తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ అధిగమించి చదవాలి. ఆడపిల్లగా నిర్బంధాల మధ్య పెరిగాను. పల్లెటూరు, చిన్న ప్రపంచం నాది. మా నాయిన మమ్మల్ని ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. మా నాయిన తోబుట్టువుల ఇళ్లకి తప్పితే ఎక్కడికీ పంపేవాడు కాదు. మా అమ్మ వడ్ల మిల్లు పట్టేది కాబట్టి
సాహిత్యం కథలు “మెట్రో జైలు” కథలు

డిటెన్యూ

 సాయంత్రం లాకప్ అయ్యే ముందు గిన్తీ కోసం అందరినీ వరుసలుగా కూర్చోబెట్టారు. సాయంత్రం డ్యూటీలో ఉన్న ఒక వార్డర్ వచ్చింది.  “డిటెన్యూ లు పక్కకు నిలబడండి” అన్నది. ఇద్దరు పక్కకు నిలబడ్డారు. ఆమె ఒకసారి తాను తెచ్చుకున్న కాగితాలు చూసుకొని “ఇంకొకరు ఉండాలే” అని తలెత్తి కమల వైపు చూసింది. “నువ్వు కూడా!” నేను కూడా అప్పుడే ఆమెను చూశాను. అందరినీ లెక్కబెట్టుకొని వార్డర్ బయటికి నడిచింది. ఆమెతో పాటుగా వచ్చిన ఖైదీల ఇంచార్జ్ (శిక్షపడిన వాళ్ళని నియమిస్తారు) తాళాలు వేసి వార్డరు వెనకనే వెళ్ళిపోయింది. నేను చేతిలోకి వార్తా పత్రిక తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కమల నా
కవి నడిచిన దారి

నా దారి పూల బాట కాదు

అసలు ఈ నడక ఎక్కడ మొదలైంది.? ఎప్పుడు మొదలైంది..? దారి ఎక్కడ మారింది...? పల్లెటూరులో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను పదోతరగతి వరకు అక్కడే పెరిగాను. స్నేహితులు, బంధువులు అంతా ఆధిపత్య కులాల వాళ్ళే, నా చుట్టూ ఉన్న ప్రపంచం నన్ను అదే వాతావరణంలో ఉంచింది. ఆ వయసులో ఆ ఆధిపత్య ప్రవర్తన తప్పుగా కానీ లేదా అన్యాయంగా ఎప్పుడూ అనిపించలేదు. పదోతరగతి తరవాత మొదటిసారి డిప్లొమా చదవడానికి ఊరు నుండి బయటకు వచ్చాను, అక్కడ కూడా కులం నన్ను కలుపుకుని పోయింది. అక్కడ కూడా నా చుట్టూ అదే మనుషులు చేరారు. నాలో ఉన్న
సంభాషణ

జైలు జీవితపు భయంకర వాస్తవాలు

నిరాకర్ నాయక్ — వాస్తవిక కథనం నేను -2011 నుండి 2015 వరకు, సుమారుగా మూడున్నరేళ్లు, 'దేశద్రోహ' తప్పుడు ఆరోపణల కింద వేర్వేరు జైళ్లలో మొదట సోర్డా సబ్-జైలులో, తర్వాత బ్రహ్మపూర్ సర్కిల్ జైలులో, ఆ తరువాత ఒడిశాలోని భంజానగర్ స్పెషల్ సబ్-జైలులో ఉన్నాను. ఎనిమిదేళ్ల నాటి పూర్తిగా తప్పుడు, కల్పిత కేసుకు సంబంధించి నన్ను రెండవసారి 2019లో మళ్లీ అరెస్టు చేసి మరో ఏడాదిన్నర పాటు సొరాడ, భంజానగర్ జైళ్లలో ఉంచారు. నేను ఇప్పుడు బెయిల్‌పై ఉన్నాను. నాపై దాఖలైన మొత్తం పది కేసుల్లో మూడింటిలో నేను నిర్దోషిగా విడుదలయ్యాను, మిగిలిన ఏడు కేసులు విచారణలో ఉన్నాయి.
పత్రికా ప్రకటనలు

వీవీని తిరిగి జైలుకు పంపేందుకు ఏన్ఐఏ కుట్ర‌

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావు భీమాకోరేగావ్ కేసులో దాఖ‌లుచేసిన అన్ని పిటిష‌న్ల‌ను బాంబే హైకోర్టు బుధ‌వారం కొట్టివేసింది. కంటి శ‌స్ర్త‌చికిత్స పూర్తిచేసుకుని మూడు నెల‌ల్లో తిరిగి జైలుకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో అరెస్టు చేసి దాదాపు నాలుగేళ్లు అయిన ద‌ర‌మిలా శాశ్వ‌త బెయిలు కోసం పెట్టిన ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. కండీష‌న్ తొల‌గించి ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే వీలు క‌ల్పించేందుకూ నిరాక‌రించింది. ఇక మిగిలింది తాత్కాలిక  మెడిక‌ల్ బెయిల్‌. ఈ బెయిల్‌ను కూడా తీసివేసిన‌ట్టే! మూడునెల‌ల కాలానికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్‌ను గ‌డువు తీర‌గానే స‌మీక్షిస్తామ‌ని త‌న తీర్పులో కోర్టు చెప్ప‌కపోవ‌డ‌మే దీనికి కార‌ణం. కాట‌రాక్ట్ చికిత్స చేయించుకుని