సంభాషణ

పూచిన చెట్టుకిందనే రాలిన పువ్వు

చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి. నాలుగు సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి పీడితురాలైన నిర్మల, ఆ చికిత్స కోసం హైదరాబాదు వచ్చి ఉన్న సందర్భంలో 2019 లో అరెస్టయింది. బొంబాయిలోని బైకుల్లా జైలులో కరోనా రెండు సంవత్సరాలూ సరైన చికిత్స కూడా అందక కాన్సర్ వ్యాధి ముదిరిపోయి, అనేక అవయవాలకు వ్యాపించింది. ఇక కొద్ది నెలల కన్న ఎక్కువ బతకదని వైద్యులు చెప్పిన తర్వాత, బొంబాయి హైకోర్టు ఆదేశం మేరకు ఆమెను జైలు నుంచి, హాస్పైస్ (చికిత్స కూడా అవసరం లేని స్థితికి చేరినవారిని
సాహిత్యం కవిత్వం

తునకలు మా ప్రాణం

మా పోలేరమ్మ కాడనరికిన దున్నపోలేరమ్మ తినదని ఎరుకేపోగులు వేసిదండేలపై వేలాడే ఎర్ర గులాబీలువాటికి ముల్లుండవ్ముక్కల పులుసు కుతకుత వుడుకుతా వుంటేవాడంతా ఘుమఘుమమీకేం నొప్పిదున్న మీది కాదునరికింది మీరు కాదుసాకింది సవర తీసింది మీరు కాదు కట్ట మైసమ్మ కాడఒక్క వేటుకి యాటనేసినంయాతలన్నీ బోవాలనిమా మైసమ్మ ని మా యాసలో నే మొక్కుతాంబాగా అర్థమైతది ఆమెకీ మాకూవూర్లన్నీ జన సందోహం తోచెర్లన్నీ అలుగులు దుంకుతాయనితెగిన యాటల కుప్పలుమా పొట్టలు నింపు అదేందోమా గంగమ్మ తల్లి కీమా మల్లన్న కీమా కాటమయ్యకిమా ఎల్లమ్మ ఉప్పలమ్మ ముత్యాలమ్మ మారెమ్మలకి సైతంజంతు మాంసమే ఇష్టంమాకూ అదే ఇష్టంసిన్నప్పట్నుంచి మా అయ్య గదే పెట్టిండుమా అయ్య
కాలమ్స్ ఆర్ధికం

శ్రమజీవుల రణన్నినాదం

                                                                                          'ప్రజలను కాపాడండి- దేశాన్ని రక్షించండి' అన్న ప్రధాన నినాదంతో కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల సార్వత్రిక సమ్మెతో దేశ కార్మికవర్గం సమర శంఖం పూరించింది. బిజెపికి అనుబంధంగా ఉన్న బి.ఎం.ఎస్‌ తప్ప మిగిలిన పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు, సంఘాల సంయుక్త వేదికలు పిలుపునిచ్చిన రెండురోజుల సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం 'ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనీయం... దేశాన్ని కాపాడుకుంటాం.. ప్రజల్ని రక్షించుకుంటాం... కార్మిక కోడ్‌లను తిప్పికొడతాం... కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయాలి, ఏ రూపంలో
సంభాషణ

ప్రభాతభేరి

మమతలు కరిగి మానవత్వం మసకబారుతున్నప్పుడు మనుసును ఏదో చీకటి పురుగు కొరికిన బాధ.కనుల ముందటి మనుషులు ఉన్మాద ప్రతీకలుగా  మారుతున్నప్పుడు గుండె పుండవుతోంది.ఉక్కిరిబిక్కిరై ఊపిరి సలపదు.ఏటి ఊట చెలిమెలా గొంతుతడిపిన మనుషులూ బీటలువారిన ర్యాగడిలా బిర్రబిగిసి పోతున్న కాలం.భయం పురుగు కరిసి మాటలురాక మ్రన్పడినట్లనిపిస్తోంది.హరితవనం మధ్యనున్నా ఆకులురాలిన మోడులమధ్యున్నట్లనిపిస్తోంది.మనుషులు మాట్లాడుకుంటున్న మార్కెట్ సక్సెస్ మంత్రాలు కనపడని రేసులు తోడేళ్లు కొండ్రగాళ్ల ఊళ్లాలనిస్తున్నయ్. ఆకురాలిన కాలంలో మండుటెండలను ధిక్కరిస్తూ చిగురించే పూసుగుమానుల ఊసులినాలన్పిస్తోంది.వడగాడ్పులను వెక్కిస్తూ ఎదిగే ఇప్పవనాల లేతాకుల ఎరుపు చూడాలనిపిస్తోంది. పట్టపగలు మిట్టమధ్యాహ్నం నీరవ కమ్మిన నిషిని తలపిస్తున్నప్పుడూ జలపాతహోరునలుముకున్న  వెలుగువెన్నెల ఎంత అద్భుతం. భయం కమురువాసన మధ్య
కవిత్వం సాహిత్యం

చిత్రవధ

చిత్రవధ చేస్తావనుకోలేదుకన్నీళ్లు నడిచి వస్తున్న చరితను కొన్ని రంగు పూసిన పాత్రలుఇంకొంచెం సరిగమలుకొన్ని భౌగోళిక దృశ్యాలుకథే కదా!కాకుంటేకళ్ళు మూసుకొని కళ కన్నావు విషాదం మంచు కురవడం ఎలా తెలుస్తుంది ఒక దేవాలయం ఒక మసీదు ఒక గురుద్వారా ఒక ఆరామం బతుకు వెతుక్కుంటూ భయం రహదారి నడపడం దాల్ సరస్సు దుఃఖమే !ఈ దేహావయవం అన్నందుకే కదా !ఇక్కడ పారిన నెత్తుటికి మతం లేదువయసు లేదు కాశ్మీరీయత తప్ప !నీ తెర అస్పృశ్య౼రెక్కాడితే డొక్కాడని నెత్తుటి వాసనమన ముక్కుపుటాల్లోకి చొరబడుతుంది ఈనేల ఇష్టపడిన పేర్లన్నీ ఈ మట్టిలోనే దాక్కున్నాయి మానభంగాలు మౌనభంగాలు ఎన్ని అర్ధరాత్రులు మౌనం మోశాయి రాలిన కలలన్నీ హిందువులు ముస్లిములు బౌద్ధులు సిక్కులు మరణానికి మతం లేదు కాశ్మీరీయత తప్ప !కళ్ళల్ల చెవులల్లసృజనాత్మక విషం పోసినీ మతం కోరిక తీర్చావుకన్నీళ్ళకు
సాహిత్యం కవిత్వం

మనుగడ కోసం – జీవిక కోసం

వారాంతపు సంతలలో మండుతున్న ధరలు అడవులలో, వూళ్లల్లో పెరుగుతున్న ఖాకీల దాడులు. బతుకు గ్యారంటీ లేని జీవితాలలో బతుకు పోరులో ముందున్నది మా తరతరాల ఆత్మరక్షణాయుధం. ఇక వెనుకున్నది జీవిక కోసం పెనుగులాటలో సగటు ఆదివాసీ సంఘర్శన ఫలం. సమాధాన్, ప్రహార్ లు రాజ్య బీభత్సానికి పేర్లేవైతేనేం! మనుగడ కోసం మా పోరాటం. జీలుగు వద్ద తేఢాలేదు. మండుతున్న ఎండల్లో రాలిపడే  పూవుల కోసం పిల్లా-జెల్లా; ఆడ-మగా అడవంతా మా గాలింపే ఆకలి తీర్చుకోవడానికి అంబలి, సేద తీర్చుకోవడానికి నీరుతో పాటు ఉత్సాహాన్ని, శక్తినిచ్చే సంప్రదాయ సేవనం – జీలుగు కల్లు జెండర్ తేడాలేమీ లేకుండా సమష్టిగా డొప్పల్లో
సాహిత్యం కథలు “మెట్రో జైలు” కథలు

మర్యాదస్తులు

“మెట్రో జైలు” కథలు: 1 “హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”,  విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్
ఇంటర్వ్యూ నా క‌థ‌తో నేను

నిల‌దీసే క‌థ‌లు అవ‌స‌రం

1. కథలోకి ఎలా వచ్చారు? జ. మాది ఏ నీటి అదరుపూ లేని మారుమూలన ఉండే మెట్ట ప్రాంతం. నిత్యం కరువుతో పోరాడుతూనే. కథలతో కాలక్షేపం చేస్తూ ఎప్పటికప్పుడు జీవితేచ్ఛను రగిలించుకోవడం మా ప్రాంత లక్షణం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం, మా అమ్మ ఈశ్వరమ్మ అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న రెడ్డెప్పాచారి కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి మంచి కథకులు. మా ఊళ్లో కాదరిల్లి తాత, బడేసాబ్ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి
వ్యాసాలు

రష్యా , అమెరికా సామ్రాజ్యవాద వివాదమే ఉక్రెయిన్‌ యుద్ధం

చాలా సన్నద్ధత తర్వాత పుతిన్ సైన్యం ఉక్రెయిన్‌పై దాడి చేసింది.అమెరికా, దాని మిత్రదేశాలు దీనిని పుతిన్ సామ్రాజ్యవాద అత్యాశ పరిణామంగానూ, పూర్వ సోవియట్ యూనియన్‌ను పునరుద్ధరించే చర్యగానూ ప్రకటించాయి. ఉక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని, ఈ ʹసైనిక ఆపరేషన్ʹ లుహాన్స్క్, డొనెట్స్క్ రిపబ్లిక్‌ల పైన ఉక్రెయిన్ దాడులను అంతం చేయడానికి ఉద్దేశించబడిందని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దానితో పాటు ఇప్పుడు ఉక్రెయిన్‌లో రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్న నాజీ శక్తులను నాశనం చేయాలనుకుంటున్నానని రష్యా అంటోంది. వీటికి మించి తమకు వేరే ఏ లక్ష్యాలు లేవని రష్యా పాలకులు పేర్కొంటున్నారు. చెప్తున్నది యిదే  కానీ ఈ శక్తుల చర్యలు