వరి
నా నేల రకం నాకెరుక పదును చూసి విత్తడం నా జ్ఞానం చిన్న మళ్ళుగా చేసుకోవటం నా అనుభవం నా నేల నా ఇష్టం నా విత్తనం నా నేలలో నిరుడు పండిందే మోట కొట్టిన నాటి నుండే వరి నా నేలన సుఖం మేమెరుగం నా ఎడ్లూ ఎరుగవు నా తిండికి నేను వాటి మేతకు అవి కష్ట పడటం అలవాటు నీళ్ళు పట్టి తొక్కి తొక్కి దున్ని దున్ని మట్టంతా మెత్తగా బురదగా చేయటమంటే ప్రతిభ కాదా! మడంతా చదును పెద్ద చెక్కను గుంజే నాఎడ్ల సత్తువ గట్ల మీది చెట్ల ఆకులు బురదలో తొక్కే