ఎస్ ఐ ఆర్ — భారత ప్రజలపై సరికొత్త యుద్ధం
ప్రస్తుతం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్) భారతదేశ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద అంశాలలో ఒకటిగా ఉంది. ఎన్ ఆర్ సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) వ్యతిరేక ఉద్యమ సమయంలో అమిత్ షా చెప్పిన “ఆప్ క్రోనాలజీ కో సమఝియే” (మీరు కాలక్రమాన్ని అర్థం చేసుకోండి) అనే మాట ఒక మీమ్‌గా బాగా ప్రాచుర్యం పొందింది. గత సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే, ఎన్నికల సంఘం ఆదేశించిన ఎస్ ఐ ఆర్ అనేది, కాలక్రమానుసారంగా చూస్తే, ఎన్ ఆర్ సి ప్రాథమిక దశేనని స్పష్టమవుతోంది. దేశ జనాభా మొత్తానికి సంబంధించిన పౌరసత్వ

