వ్యాసాలు

మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర

ప్రొ. జిఎన్‌ సాయిబాబ కేసుగా ప్రపంచ గుర్తింపు పొందిన మహేష్‌ టిర్కి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు 2013లో ఆహిరి పోలీసు స్టేషన్‌లో నమోదైంది. ఇందులోని ఆరుగురిలో మహేష్‌ టిర్కితోపాటు పాండు నరోటే, విజయ్‌ టిర్కి ఆదివాసులు. మిగతా వాళ్లు ప్రొ. సాయిబాబ, ప్రశాంత్‌రాహి, హేమ్‌మిశ్రా. పదేళ్లకు పైగా నడిచిన ఈ జీవిత ఖైదు కేసు బహుశా దేశ చరిత్రలోనే అరుదైన, అతి దుర్మార్గమైన కేసుగా గుర్తింపు పొందింది. ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ ఆరుగురి మీద కేసు పెట్టిందనే సంగతి ప్రజల కామన్‌సెన్స్‌లో కూడా భాగమైంది. ఈ ఆరుగురిలో ఒకరి(పాండు నరోటే) జీవితాన్నే హరించిన, ఐదుగురి పదేళ్ల
సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా
వ్యాసాలు

Raise your voice against this war

Indian state has started aerial war against the people of the country. The government began drone attacks on the farmers peacefully demonstrating on the problems of agricultural sector near Delhi and Haryana. Police are cordoning them off and opening fire. With these actions, the fascist central government has announced that the farmers are not Indian citizens. Four years prior to this, the then Congress government, along with the Modi government
Uncategorized

చుక్ చుక్ బండి వస్తోంది !

చుక్ ..చుక్ బండి వస్తోంది... పక్కకి పక్కకి జరగండి.. ఆగినంకా ఎక్కండి... జో జో పాపా ఏడ్వాకు అయోధ్య లడ్డు తినిపిస్తా... కమ్మటి పానకం తాపిస్తా ! వెళదామా అయోధ్యకి? అక్కడినుంచక్కడికే కాశీకి ? రానుపోను రెండు వేలెనట చార్జీలు... తిండీ.. పిండీ అన్నీ రైలె పెట్టుకుంటుందిట. మీ జిల్లాకే వచ్చి మిమ్మల్ని తీసుకుపోతుందట అరె పదండి... చు క్ చు క్ రైలు వచ్చింది.. ఎక్కేయండి! ఎలెక్షన్ల లోపు రెండు వేలే.. తరువాత ఒక్కో మనిషి కి ఇరవై వేల ఛార్జీలు..ఎక్కడ పెట్టుకుంటారు అంత? ఇప్పుడైతే రాముడు ఇస్తాడు . పాలస్తీనా జాతి హననం చేసిన ఇజ్రాయిల్ని
వ్యాసాలు

అభివృద్ధి విధ్వంసాల రాజకీయార్థిక విశ్లేషణ

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వం-4లో అభివృద్ధి విధ్వంసాల మాయాజాలాన్ని వివరించే వ్యాసాలు ఉన్నాయి. బహుశా ఈ సంపుటిలోకి ఇంకొన్ని వ్యాసాలు కూడా తీసుకరావచ్చనిపించింది. వాటిలో అభివృద్ధి విధ్వంసాల గురించి ఉన్నప్పటికీ నిర్దిష్టంగా హక్కుల విశ్లేషణే ప్రధానంగా ఉన్నది. వాటిని హక్కుల ఉద్యమ వ్యాసాల్లో చేర్చితే బాగుంటుందనిపించి ఇక్కడికి తీసుకరాలేదు. ఈ వ్యాసాల్లో శేషయ్యగారు అభివృద్ధి విధ్వంసాలను మానవ జీవితంలోని అనేక కోణాల్లో వివరించారు. ఘటనలు, పరిణామాలు, వివరాలు, లెక్కలు, ముఖ్యంగా పాలకుల ఆర్భాట ప్రకటనలు, వాళ్ల ప్రకటిత
కవిత్వం

గుడిపల్లి నిరంజన్ రెండు కవితలు

1 .నలిపెడుతున్న భావమేదో..! ఏమీ తోచని స్థితి ఎప్పుడో ఒకసారి అందరికీ వస్తుంది. అమ్మ పోయినప్పుడో నాన్న ఊపిరి ఆగినప్పుడో మనసు వెన్ను విరిగినప్పుడో అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో అపార్థాలతో స్నేహాలు కూలినప్పుడో.. దారితప్పినప్పుడో... ఎప్పుడో ఒకప్పుడు ఊపిరాడని స్థితి అందరికీ వస్తుంది. పూర్వజ్ఞాపకాలు రోదించినప్పుడో.. కయ్యాలు కురిసినప్పుడో గింజలు మొలువనప్పుడో కోసిన పంట తుఫాన్ లో కొట్టుకపోయినప్పుడో ఆత్మకు నచ్చినవాళ్లు వెనక్కి గుంజి నప్పుడో.. అప్పుడే సోప్ప బెండులా అల్కగా బరువు తగ్గిపోతాం. ఈనెపుల్లలా సన్నగా మారుతాం. ఒక్కోసారి మనసు లోపల కసిబిసితో నలిపెడుతున్న భావమేదో బయటికి ఉసులుతుంది. అప్పుడే ఏమీతోచని స్థితి వేడి శ్వాసల రూపంతో బయటకు
కవిత్వం

ఇనుప మేకుల భూమి

భూతల్లి ఎదపై నాటిన ఇనుప మేకులు ఎవరి ఆకలిని తీర్చగలవు? ఎంత పచ్చదనాన్ని తుంచగలవు?? ఆ సిమెంట్ బ్యారి గేట్లు ఎవరి ఇంటికి గోడలుగా నిలబడగలవు? ఎంత ధైర్యాన్ని అణచగలవు?? గాలిలో ఎగిరే డ్రోన్లు ఎవరి పంట చేనులకు మందులు కొట్టగలవు? ఎంత ఆక్సిజన్ ను భర్తీ చేయగలదు?? వాడు చేస్తున్న దాడిలో కోల్పోయిన రైతుల ప్రాణాలను ఎవరు మొలకెత్తించగలరు? గడ్డిపోచల గుండె చప్పుడుతో ఊపిరి వీస్తున్న స్వదేశ రైతులను కట్టడి చేసే అట్టడుగుల్లో ఎంత కాలం కొట్టుమిట్టాడగలరు ?? రాజకీయం తెలిసిన ప్రభుత్వానికి రైతుల కన్నీటి బాధలను తీర్చడం తెలియనిదా? భారతరత్న అవార్డు ప్రకటనలో కూడా రాజకీయ
కవిత్వం

మరల మరల అదే వాక్యం

ఒకరి గురించి దుఃఖపడడం గుండె కవాటాలను మెలితిప్పుతుంది కదా .... పెంచిన చేతులలోనే చివరి శ్వాస వదిలే పసిపాపల కనులను చూస్తూ ఆ గుండెలు మూగబోవా! .... నీకేమి కాదు మెదడులోకి ఇంకినది హృదయంలోకి ఇగరని మనిషివి కదా .... నాకెందుకో నా చెవులలో ఆ పసిపాపల రోదనలు తప్ప ఏమీ వినిపించదు .... ఆ కూలిన ఆసుపత్రుల గోడలనంటిన నెత్తుటి చారికల మధ్య నా మొఖం అగుపిస్తోంది .... ఎన్నిసార్లు రాసినా నీ దుఃఖ వాక్యమే మరల మరల వెంటాడుతోంది పాలస్తీనా ..... అంతరించిపోతున్న నీ నేల పచ్చని గురుతులు దుఃఖాన్ని ఆలపిస్తూ .
ఎరుకల కథలు

“మా తప్పు ఏంది సామీ ?”

“ అశోకు వచ్చిoడాడా ? వాడి  గురించి ఏమైనా తెలిసిందా అబ్బోడా? “  యస్టీ కాలనీ లోకి అడుగుపెట్టి  దుర్గమ్మ   గుడిపక్కలోకి తిరిగి నిలబడితే చాలు, బోరింగు పక్కలోo చి ఎప్పుడూ ఒక పలకరింపు మీకు వినపడుతుంది. ఆ గొంతులో వణుకు, భయం, ఆదుర్దా ప్రేమ , ఆశ అన్నీ కలగలసిపోయి మీకు వినిపిస్తాయి.గుడిలోంచి వచ్చే పిలుపు కాదు అది. గుడి పక్కనే ఒక మొండిగోడల  సగం ఇల్లు మీకు కనపడుతుంది. పైన రేకులతో కప్పబడిన పాత ఇల్లు. తలుపు సగం ఊడిపోయి ఎప్పుడూ మూయాల్సిన అవసరం లేనట్లు వుంటుంది.బయటే నులకమంచం పైన ఒక సగంమనిషి  కూర్చునో ,