కవిత్వం

ఇదేనా స్త్రీల ఉన్నతి?

బుక్కెడు బువ్వ కోసం కార్డు కోసం క్యూ కట్టాలి మోదీ గ్యారంటీ అన్న యోజన అంటూ చప్పట్లు కొట్టాలి ‘ఉజ్వల’తో నిప్పు రాజేస్తే పళ్లెంలోకి బువ్వ చేరుతోంది మోదీ స్మరణతో పొట్ట నింపాలి చీకట్లో, ముఖం చాటేసుకొని సిగ్గుతో బజార్లో దొడ్డికెళ్లక తప్పని దిక్కుమాలిన జీవితాల్లో శాచాలయం మోదీ గ్యారంటీ తల దాచుకోవడానికి నీడ కరువైన జీవితాల్లో ప్రధాన మంత్రి అవాస్‌ యోజనతో సంసారం చేయాలి సమాన హొదా అంటూ సర్పంచు పదవులతో నారీ శక్తికి వందనం అంటూ చట్ట సభలలో రిజర్వేషన్‌లతో అందలం ఎక్కిస్తున్నారు నిర్భయను మరిచిపొమ్మంటున్నారు హథారాస్‌ మనది కాదంటున్నారు కశ్మీర్‌కు అలా జరుగాల్సిందే అంటారు
కవిత్వం

పదేళ్ల అక్రమ నిర్భంధం

చేయని తప్పు చేసాడని కటకటాల వెనక్కి పంపిన రాజ్యం అక్షరం హేతువు ను బోధిస్తుందని హేతువు మార్క్సిజానికి మూలమని అక్షరానికి సంకెళ్ళు వేసింది వందశాతం ఫాసిజం కోరలు పీకి తొంభై శాతం వైకల్యం సాధించిన గెలుపు ఇంకా తరాజులో న్యాయం వుందని తేల్చింది ఎన్ని ఉదయాలు ఎన్ని అస్తమయాలు ఈ పదేళ్లలో తూర్పు పడమర ల మధ్య ఊగాయో ఓ కొత్త పొడుపు కోసం నిరీక్షించిన కళ్ళు నిజాన్ని బంధిస్తే అబద్దాల రాజ్యం కి వెసులుబాటు మసి పూసి మారేడు కాయ చేయజూస్తే మసి పూసుకోక తప్పదు ఎన్నాళ్ళైనా!! కోల్పోయిన సామాజిక జీవనం చీకటి రాత్రుల్లో కోల్పోయిన వెలుగు
వ్యాసాలు

Let us strive hard to bury the Patriarchy for women emancipation.

We are going to celebrate 114th International Working Women's Day at a time when on one hand Brahmanical Hindutva Fascism has spread its tentacles in every sphere of life, and on the other hand, Imperialism has intensified its exploitative measures on oppressed people and nations. Now we are under the yoke of two monstrous terrors.  Brahmanical patriarchy is an Indian peculiar chamber of horrors. In a semi-colonial and semi-feudal society,
ఆర్ధికం

పొంతన లేని జిడిపి వృద్ధి అంకెలు

దేశ జిడిపికి సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయం ఫిబ్రవరి 29న విడుదల చేసిన గణాంకాలు ఆశ్చర్యపరిచాయి. నిపుణులను కలవరపరిచాయి. ప్రభుత్వ అంచనాలను, స్వంత డేటాను తారుమారు చేసింది. కారణం ఏమి కావచ్చు? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన ముడో త్రైమాసికం (క్యూ3)లో జిడిపి 8.4 శాతం పెరిగిందని ఎన్‌ఎస్‌ఓ గణాంకాలు చూపుతున్నాయి. క్యూ1, క్యూ2 వృద్ధి రేటును కూడా సవరించింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధిరేటు విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. ఇంతకుముందు త్రైమాసికంలో నమోదైన 8.1 శాతంతో పోల్చితే ఇది అధికం. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 4.5 శాతం వృద్ధి
కథలు

ఆమె నవ్వింది…

ఆమె నవ్విందట... ‘భలే నవ్వారే’ ఆంకర్‌ చిన్నగా నవ్వుతూ అంటోంది. ఆమె నిజంగా నవ్వితే ఇలాగే ఉంటుందా? బిల్కిస్‌ నిజమైన నవ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వితే ఆమె నవ్వెలా ఉంటుంది ఏమో ఊహించలేం... ఇరవై రెండేళ్ల నుంచే ఎన్ని ఊర్లు... ఎన్ని ఇళ్లు... ఎన్ని బళ్లు... ఎన్ని దేశాలు.... ఎన్నెన్ని కన్నీటి సముద్రాలు ఇంకెన్ని ఎడారులు మార్చి మార్చి పరిగెడ్తూ పారిపోతూ... పరిగెత్తి పరిగెత్తి గసబోస్తూ ఆయాస పడ్తూ... చమటలు కన్నీళ్లు... రక్తం కక్కుతూ కక్కుతూ... ఊపిరాడక ఎగబోస్తూ ఆగి... ఆగి కూలబడ్తూ... విరిగిపోతూ కరిగిపోతూ శ్వాస ఆడట్లేదు... ఓప్హ్‌ా ఊపిరాడట్లేదు... కాస్త గాలివ్వండి... ఏంటి... ఏంటి ఈ
వ్యాసాలు

మోదీ గ్యారంటీలతో మహిళా సాధికారత సాధ్యమా!

8 మార్చ్‌, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం. 114 ఏళ్ల క్రితం ప్రపంచ కమ్యూనిస్టు నాయకుల చొరవ, కృషితో ప్రారంభమైన ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా పీడిత వర్గాల మహిళలందరూ జరుపుకుంటున్నారు. వారందరికి అభినందనలు. వాస్తవంగా శ్రామిక మహిళలను మించి సంపన్న కుటుంబాల మహిళలు, కమ్యూనిస్టులను మించి బూర్జువా పార్టీలు ఈ దినాన్ని మరీ అట్టహసంగా జరుపుకోవడం యేటేటా పెరుగుతోంది. ఇందులో గత కొద్ది సంవత్సరాలుగా హిందుత్వ శక్తులు ముందు పీఠిన నిలుస్తున్నాయనడం అతిశయోక్తి కాదేమో! అధికారం రుచి మరిగిన హిందుత్వ శక్తులు, వారి తిరుగులేని నాయకుడు మోదీ తన అధికారాన్ని నిలుపుకోవడానికి దేనికైనా సిద్ధపడుతాడని, ఎంతకైనా తలపడుతాడని
వ్యాసాలు

సంక్షేమ హస్టల్ విద్యార్థులు భవ్య, వైష్ణవీలకు న్యాయం దక్కేనా ?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగామొత్తం 3,214 యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు,సంక్షేమ హాస్టళ్లలో 8,59,959 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ఇటీవల కాలంలో సంక్షేమ వసతి గృహాలు,గురుకులాలలో బాలికల వరస మరణాలు కొనసాగుతున్నాయి.హౕస్టళ్ళలో పర్యవేక్షణ లోపం,సౌకర్యాల కొరత, పౌష్టికాహారం అందకపోవడం వంటి కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ    “కుల వివక్షత” అసలు కారణం. ఈ ఏడాది పిబ్రవరీ మూడవతేది రాత్రి భువనగిరి పట్టణంలోని యస్సీ బాలికల వసతిగృహంలో పదవతరగతి చదివే విద్యార్థులు కోడి భవ్య (15), గాదే వైష్ణవి(15) ఆత్మహత్యలు చేసుకున్నారు. బాలికల హాస్టల్ వద్ద హాస్టల్ వార్డెన్ ,వాచ్ వుమెన్ ఉండకపోవడం హాస్టల్లో ఉన్న వంట మనిషి ఆమెతో పాటు హౕస్టల్
ఇంటర్వ్యూ

యూఏపీఏను రద్దు చేయాలి  – ఇందిరా జైసింగ్

( ప్రొ.జి.ఎన్.సాయిబాబా, అతని తోటి నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడంపై ట్వీట్ చేసిన వారిలో మొదటివారు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల నుండి, విప్లవ కవి వరవరరావు (భీమా కోరేగావ్ కేసులో నిందితులు, 2021లో బెయిల్ వచ్చింది) మొదటి మహిళా అదనపు సొలిసిటర్ వరకు, ప్రాథమిక హక్కులను కోల్పోయిన వారి కోసం అనేక న్యాయ పోరాటాలు విజయవంతంగా చేయడంలో ఆమె గుర్తింపు పొందింది.   1986 మేరీ రాయ్ కేసు, 1999 గీతా హరిహరన్ కేసు వంటి మహిళల వివక్షకు వ్యతిరేకంగానూ, జనరల్ కేసులను కూడా చేసారు. ఆనంద్ గ్రోవర్‌తో పాటు, ఆమె ఆన్‌లైన్
వ్యాసాలు

ప్రొ. సాయిబాబా కేసులో లాయర్ల  అవిశ్రాంత కృషి

మా అప్పీలు  విజయవంతం అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం వుంది. సాక్ష్యాలను బూటకమని నిరూపించగలమని మాకు తెలుసు.' ఇందుకోసం ఒక న్యాయవాదుల సేన పని చేయాల్సి వచ్చింది. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా,  అతని సహ నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి విజయవంతమైన పోరాటం వెనుక సంవత్సరాల తరబడి జరిగిన సన్నాహాలు వున్నాయి. న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు జూనియర్‌లుగా ఉన్న న్యాయవాదుల బృందం చేసిన కృషి ఆ తయారీకి వెన్నెముక. కోర్టులో వాదించిన సీనియర్‌ అడ్వకేట్లు.. త్రిదీప్ పైస్, ప్రదీప్ మంధ్యాన్, ఎస్పీ ధర్మాధికారిలు అయితే వారికి వివరాలందించడానికి బృందంగా పనిచేసిన న్యాయవాదులు బరుణ్ కుమార్, నిహాల్ సింగ్ రాథోడ్, హర్షల్
పరిచయం

కొత్త తరానికి లెనిన్ పరిచయం

 “ఈనాటి జీవితాన్ని సామ్రాజ్యవాద సంస్కృతి స్పృశించని పార్శ్వము, కోణామూ లేదు. అది మన అలవాట్లనూ, ఆచారాలనూ, ప్రవర్తననూ, సంస్కారాలనూ, కుటుంబాలను, సామాజిక సంబంధాలనూ, మన కోర్కెలను, ఆశలను, రాజ్యాన్ని, రాజకీయాలను వ్యక్తులనూ, సంస్థలనూ, కలల్ని, కళల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూవుంది. క్షీణ విలువలకు ముఖ్య ఆధారంగా సాంస్కృతిక సామ్రాజ్యవాదం నిలిచివున్నది.”     - లెనిన్ Lenin for children పేరుతో సోవియట్ రష్యా బొమ్మల పుస్తకం ప్రచురించింది. దీన్ని అమెరికన్ పిల్లల కోసం రూత్ షా ఇంగ్లీషు లోకి అనువదించగా 1934 లో ఇంటర్నేషనల్ పబ్లిషర్స్, న్యూయార్క్ వాళ్ళు ‘our lenin. For boys and girls’ అంటే ‘మన