వ్యాసాలు

ప్రొ. సాయిబాబ కేసులో ఎల్గార్ పరిషత్ కేసు మూలాలు

ఎల్గార్ పరిషత్  కేసులో అరెస్టు అయిన వారిలో కొందరికి  సాయిబాబాతో 'ప్రత్యక్ష సంబంధం'లో ఉన్నాయని చార్జిషీట్‌లో   పూణే పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 2018 చివర్లో   మొదటిసారిగా పూణే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వున్న కేసు దర్యాఫ్తు పైన “భారీగా ఆధారపడుతున్నాం” అని చెప్పారు.. అప్పటికే సాయిబాబాను, మరో ఐదుగురిని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన మానవ హక్కుల కార్యకర్తలపై తమ కేసును తయారుచేసుకోవడానికి సాయిబాబాకు గడ్‌చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించడంపై వారు దృష్టి సారించారు. 2020
వ్యాసాలు

3,588 రోజుల నిర్బంధం

ప్రొఫెసర్ సాయిబాబాను తొలిసారి 2014 మే 9నాడు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. 2017లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఉపా కింద అక్రమ నిర్బంధాన్ని పరిగణనలోకి తీసుకుని బాంబే హైకోర్టు 2022లో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2023లో సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను మళ్లీ విచారించాలని నిర్ణయం ఇస్తూ  కేసును మెరిట్‌పై (తప్పు ఒప్పులపై ఆధారపడి) పరిగణించాలని ఆదేశించింది. మార్చి 5న, బాంబే హైకోర్టు మరోసారి నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఈసారి ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్ష్యాల్లోని బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకొన్నది.
వ్యాసాలు

“నేను జైలు నుండి బయటపడటం యాదృచ్ఛికమే”

'నేను టాయిలెట్ కు వెళ్ళలేను, సహాయం లేకుండా స్నానం చేయలేను, జైలులో ఎలాంటి ఉపశమనం లేకుండా చాలా కాలం జీవించాను. నేను జైలు నుంచి సజీవంగా బయటపడడం కేవలం యాదృచ్ఛికం ' ' అని 56 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ ప్రొఫెసర్ నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత గురువారం (మార్చి 7)న తన మొదటి పత్రికా సమావేశంలో చెప్పారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మార్చి 5న ఆయనతో పాటు మరో ఐదుగురిని ఉగ్రవాద కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. చక్రాల కుర్చీలో కూర్చొని 90 శాతానికి పైగా వికలాంగుడు అయిన సాయిబాబా, ఇతరుల సహాయం
పాట

ఢిల్లీ చలో….

పదరా..పదరా పదపదపదమని..కదం దొక్కరా " ఢిల్లీ కోటకు వొణుకు పుట్టగా ప్రపంచమంతా నివ్వెరపోగా " "పదరా" రైతుబిడ్డ లా నిలువరించెడూ బారికేడ్లనూ బద్దలు గొట్టగ " పొలాలల్లో శ్రమించే చేతులు నియంత మీదకు పిడికిలెత్తినవి " "పదరా" సంకెళ్ళేసిన రోడ్ల మీదకు సర్రున దూసుకు..పదండి,పదండి " మన కడుపులకూ సంకెళ్ళేసిన దోపిడి దొంగలు పని బట్టంగ " " పదరా " గర్జించరా..గర్జించరా. నియంత మీదకు నిప్పులు జెరగర " పొలాల నమ్మే బందిపోట్లకూ పొట్టలు గొట్టే విద్య దెలువదా" " పదరా" పరుగెత్తరా.. పరుగెత్తరా కోటల మీదా గురి వెట్టరా " మన బత్కుల చెరను బట్టినా
వ్యాసాలు

హక్కుల చైతన్యాన్ని కార్మికవర్గ దృక్పథాన్ని పెంచే వ్యాసాలు

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వంలో ఇది మూడో సంపుటం. మొదటిది ‘రాజ్యాంగం-పౌరహక్కులు, విమర్శనాత్మక దృక్పథం(2021)’. రెండో సంపుటి ‘కాలంతో కరచాలనం, స్వేచ్ఛ సంపాదకీయాలు(2023)’. ఇప్పుడు ‘నూతన ఆర్థిక విధానాలు-కార్మికోద్యమం’. శేషయ్యగారి అమరత్వం తర్వాత ఆయన రచనలన్నీ ప్రచురించాలని పౌరహక్కుల సంఘం అనుకుంది. సంస్థ నాయకుడిగా, హక్కుల ఉద్యమ వ్యాఖ్యాతగా ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలని ఈ పని ఆరంభించాం.  ఇందులోకి దిగాక ఈ వ్యాసాల విస్తృతి, లోతు మరింతగా అర్థమవుతున్నది. తెలుగు సమాజాలు,
సంభాషణ

సమ్మక్క జాతర – తమ్ముని యాది

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ...  మా వూరికి దక్షిణ శివారులో పాలాగు ఒడ్డున  సమ్మక్క సారక్క జాతర జరుగుతున్నది. నేను నా భార్య, ఇద్దరు పిల్లలు, అవ్వ-నాన్న కలిసి జాతరకు  ఎల్లినం .  వన దేవతలకు మొక్కులు చెల్లించి ఒక కోన్ని కోసి అక్కన్నే చెట్లల్ల వండుకున్నం. రాత్రి 8 గంటలు అయితంది.. పల్లెం లో అన్నం కూర పెట్టుకుని తింటున్న.  పిండారపోసినట్టు తెల్లని వెన్నెల  కురుస్తంది. స్టీల్ పల్లెం పై ఆ వెన్నెల  పడి మెరుస్తంది. ఈ టైంలో తమ్ముడు  ఏమి చేస్తున్నట్లు? ఎక్కడ వున్నట్లు? ఒక్క సారిగా మనసు తమ్ముని మీదికి పోయింది. కోర
Stories

Gift

My darling boy!! How are you? I am conversing with you in this fashion after a long time …… Unfortunately, we cannot meet. So, you must be thinking that you are entitled to at least a letter from me. But, what can I do? There is too much of work pressure! I decided to write a letter to you today as it is your birthday. You must have celebrated your
కవిత్వం

 మౌమిత ఆలం కవిత్వం

1.స్నేహితుడా..నేను నీ శత్రువుని నేను నా హృదయాన్ని తెరిచిన ప్రతిసారీ సజీవంగా ఉండే నీ మాటలను స్పృశించడంలో విఫలమవుతున్నాను. మీ భూమి నుండి నేను సంవత్సరాలుగా పావుకున్న పేగుల,రక్త,ద్రోహం దుర్వాసనను ఈ మాటలు నాకు మిగిల్చాయి. నీ పదజాలంలో నే చొప్పించిన నల్లటి పదాలు పట్టపగలే నా సాంత్వనలో నన్ను వెంబడించాయి. నేను లైటు ఆపేస్తే అవి చీకటిలో మరింత ఉజ్వలంగా వెలుగుతాయి. సమాధానాల కోసం నిశ్శబ్దంగా నువ్వు వేసే ప్రశ్నలు నా జీవం లేని గుండెను వెంటాడుతున్నాయి. నేను నా నుండి కళ్ళు తిప్పుకుంటాను, ఒక హంతకుడు నేరం చేసిన నెపాన్ని ఇతరుల మీదకు తోస్తాడు. గొంతు
కవిత్వం

పదేళ్ల పచ్చి గాయం

ఎలాగైతేనేం ఉబికి వచ్చే కన్నీటికి ఇసుక గూడంత విరామం దొరికింది ఆ మధ్యానం అన్నం కుండ దించుతుండగా చెవులకు లీలగా తాకిన వార్త పళ్ళెంలో మొదటి ముద్ద అతని కోసమే కలుపుతున్నట్టు స్కూలు నుంచి వచ్చిన పిల్లాడి లంచ్ బాక్స్ అంట్ల గిన్నెలో గబగబా సర్దుతున్నట్టు అంతా తత్తరపాటు అప్పటికి విన్న ఆమెకది పగటి కలే కావచ్చు ముఖ పరిచయమే లేని నాకు మాత్రం ఎండిన నాలుకపై తెప్పరిల్లే చిన్న వాన చినుకు అతగాడికి కాగితాలకందని శిక్ష వెయ్యాలని తీర్పరి చెరకుగడ పిప్పిగా పాఠాన్ని నములుతూ పోతుంటాడు శూన్యం కుమ్మరించిన నేలపై ఒకరి కళ్లను మరొకరు ఫొటోగ్రాఫ్ చేస్తూ
కరపత్రాలు

అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో..

మార్చి 8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా అజ్ఞాత మహిళా అమరుల స్మృతిలో.. విప్లవోద్యమంపై నిషేధానికి, యుఎపిఎ కేసులకు, ఎన్‌ఐఎ దాడులకు వ్యతిరేకంగా సదస్సు మార్చి 2, 2024 శనివారం ఉదయం 10.30 నుంచి సాయంకాలం 6 గంటల దాకా అంబేద్కర్‌ భవన్‌, వరంగల్‌ మిత్రులారా! మార్చి8 అంతర్జాతీయ శ్రామిక మహిళల విముక్తి పోరాట దినం. చరిత్రలో శ్రామిక మహిళలు శ్రమ దోపిడీకి, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా మార్చి 8 స్త్రీలందరి విముక్తి ఉద్యమాల దినంగా నమోదైంది. పాలకులు మార్చి8ని వేడుకల దినంగా మార్చేసినా ఈ దేశంలోని కార్మిక, ఆదివాసీ, దళిత బహుజన మహిళలు