కవిత్వం

 మౌమిత ఆలం కవిత్వం

1.స్నేహితుడా..నేను నీ శత్రువుని నేను నా హృదయాన్ని తెరిచిన ప్రతిసారీ సజీవంగా ఉండే నీ మాటలను స్పృశించడంలో విఫలమవుతున్నాను. మీ భూమి నుండి నేను సంవత్సరాలుగా పావుకున్న పేగుల,రక్త,ద్రోహం దుర్వాసనను ఈ మాటలు నాకు మిగిల్చాయి. నీ పదజాలంలో నే చొప్పించిన నల్లటి పదాలు పట్టపగలే నా సాంత్వనలో నన్ను వెంబడించాయి. నేను లైటు ఆపేస్తే అవి చీకటిలో మరింత ఉజ్వలంగా వెలుగుతాయి. సమాధానాల కోసం నిశ్శబ్దంగా నువ్వు వేసే ప్రశ్నలు నా జీవం లేని గుండెను వెంటాడుతున్నాయి. నేను నా నుండి కళ్ళు తిప్పుకుంటాను, ఒక హంతకుడు నేరం చేసిన నెపాన్ని ఇతరుల మీదకు తోస్తాడు. గొంతు