పాట

ఢిల్లీ చలో….

పదరా..పదరా పదపదపదమని..కదం దొక్కరా " ఢిల్లీ కోటకు వొణుకు పుట్టగా ప్రపంచమంతా నివ్వెరపోగా " "పదరా" రైతుబిడ్డ లా నిలువరించెడూ బారికేడ్లనూ బద్దలు గొట్టగ " పొలాలల్లో శ్రమించే చేతులు నియంత మీదకు పిడికిలెత్తినవి " "పదరా" సంకెళ్ళేసిన రోడ్ల మీదకు సర్రున దూసుకు..పదండి,పదండి " మన కడుపులకూ సంకెళ్ళేసిన దోపిడి దొంగలు పని బట్టంగ " " పదరా " గర్జించరా..గర్జించరా. నియంత మీదకు నిప్పులు జెరగర " పొలాల నమ్మే బందిపోట్లకూ పొట్టలు గొట్టే విద్య దెలువదా" " పదరా" పరుగెత్తరా.. పరుగెత్తరా కోటల మీదా గురి వెట్టరా " మన బత్కుల చెరను బట్టినా
పాట

విప్లవ జోహార్లు కటకం సుదర్శన

దండాలు దండాలు మా కటకమ నీకెర్ర దండాలు సుదర్శన జోహార్లు జోహార్లు మా కటకమ విప్లవ జోహార్లు సుదర్శన విప్లవానికే అంకితమైన...... యాభైయేండ్ల అజ్ఞాత జీవితమ..."దండాలు" కన్నాల బస్తిలో పుట్టినవు కారడవికి నీవు చేరినవు కామ్రేడుగా నీవు మారినవు కేంధ్ర నేతగా ఎదిగినవు నమ్మిన దారిలో నడిచినవు.... కన్నుమూసేవరకు పోరినవు...."దండాలు" మావోయిస్టు సిద్దాంతమా ప్రజాయుద్ధా మార్గానివీ గెరిల్లా పోరు వ్యూహానివి మాటు దాడుల మర్మానివి దండకారణ్యం గుండె కాయవు...... ఎర్రజెండా అరుణతారవు....."దండాలు" ఎర్ర దండు నడకవు నీవు పోరుబాట జాడవు నీవు ఉధ్యమాల ఊటవు నీవు విప్లవాల తోటవు నీవు అమర వీరుల కలలవు నీవు.... ఆశయాల బాటవు