ఎన్నో ఆశలు పెట్టుకున్నా...
ఉన్నవి అమ్మి సదివించిన...
ఆకలి బాధలు డొక్కల్లో దా..చి
పెంచిన బిడ్డలారో...
లేరో..ఓ...బిడ్డ..లేరో...
లేచి రారో... బిడ్డ రారో..
అడిగినవన్నీ తెచ్చి ఇచ్చి...
అమ్మ నాన్నలు ముద్దులు పెట్టి..
కొడుకులు బిడ్డలు డాక్టరు లా..నీ
మురిసి పోయినమో.....
లేరో..ఓ...బిడ్డ..లేరో...
లేచి రారో... బిడ్డ రారో..
కడుపులో నివు కదులుతువుంటే.
చల్లని నీ స్పర్శ తాకుతువుంటే..
గతమంతా గాయాల ఎతలన్నీ తీ..రేటి ...
రోజొచ్చే ననుకుంటిరా...
లేరో..ఓ...బిడ్డ..లేరో...
లేచి రారో... బిడ్డ రారో..
తొలుసురు బిడ్డని తెలిపిన నాడు
పోత్తిల్లో నిను చూసి కార్చిన కన్నీరు..
హృదయాంతర శబ్దం
ఆ నాదమే నీ...వని
తనువంతా పులకించెరా...
లేరో..ఓ...బిడ్డ..లేరో...
లేచి రారో... బిడ్డ రారో..
(నీట్ విద్యార్థుల ఆత్మహత్యల తో తల్లితండ్రుల ఆవేదన)




