ఆర్ధికం

డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?

ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర
కరపత్రాలు

విప్లవం మన శ్వాస – విప్లవం మన ధ్యాసరండి.. కలబోసుకుందాంభారత ప్రజాయుద్ధం-సమకాలీన సందర్భం

సదస్సు7, డిసెంబర్ 2025 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5.30 దాకాసుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు నేల నెత్తుటి చిత్తడిగా మారుతున్నది. చరిత్ర విలపిస్తున్నది. తాను కన్న అత్యుత్తమ వీరుల మరణాలతో బెంగటిల్లుతున్న ది. విప్లవకారుల అమరత్వం మన కాలపు మహా విషాదంగా ఆవరించింది. దీన్ని తట్టుకొని నిలబడటం కష్టమే. కానీ తప్పదు. వందల వేల ఏళ్లుగా మానవాళి మోసుక తిరుగుతున్న స్వప్నం గాయపడిన వేళ చరిత్ర మీద తార్కిక విశ్వాసం నిల బెట్టుకోవాల్సిందే. దుఃఖంతో పూడుకపోతున్న మన కంఠస్వరాన్ని భవిష్యత్ నిర్మాణానికి తగినట్లు సవరించుకోవాల్సిందే. ఇంతటి ఆపద కాలంలో సాయుధ పోరాట
కథలు

దర్శనం!

మంచి సెల్ ఫోన్ కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే వెబ్‌కు వెళ్ళినా సెల్ ఫోన్ యాడ్సే వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక యెప్పుడు నెట్‌లోకి వెళ్ళినా సెల్లులే సెల్లులు. సెకండ్ హ్యాండ్ యిల్లు కొనాలని గూగుల్‌లో చెక్ చేసి వదిలేశాను. ఆ తరువాత యే సైట్‌కు వెళ్ళినా రకరకాల యిల్లులు పాతవీ కొత్తవీ వస్తున్నాయి. సజెషన్ వచ్చింది కదా అని యూట్యూబ్ వీడియో కూడా వోపెన్ చేసి చూసి నా పనుల్లో పడ్డాను. అంతే, యిక
వ్యాసాలు

అమ్మాయిలపై పబ్లిక్, డిజిటల్ వేధింపులు

ఈ ప్రపంచంలో అమ్మాయిగా జీవించడం అంటే భయంతో, జాగ్రత్తలతో, అనేక అడ్డంకులతో నడవడం అని చెప్పిన అతిశయోక్తి కాదు. అమ్మాయి ఎంత బలంగా ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా ఆమె బయటికి వెళ్లే ప్రతిసారి, ఫోన్ పట్టుకునే ప్రతిసారి, రోడ్డు మీద నడిచే ప్రతిసారి ఒక చిన్న భయం ఆమె మనసులో ఉండక తప్పదు. ఎందుకంటే పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న వేధింపులు ఏళ్ళుగా ఉన్న, ఇప్పుడు అది కాదు  ఫోన్లలో, సోషల్ మీడియాలో కూడా వేధింపుల రూపం పెరిగిపోయింది. అమ్మాయిలకు రెండు వైపులా ప్రమాదాలు పెరుగుతున్నాయి పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిలపై వేధింపులు చాలా కాలంగా ఉన్నాయి.
సంపాదకీయం

అల్లూరి నుంచి హిడ్మా దాకా అదే రక్తసిక్త చరిత్ర

అమరులు మడావి హిడ్మా, రాజే, సహయోధుల ఎన్‌కౌంటర్‌ హత్యలు ఏ దుర్మార్గమైన సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ స్వభావానికి దాఖలా! రాజ్య వైఖరి ప్రభుత్వాలతో మారుతుందా, మారిన పరిస్థితులతో మారుతుందా? మారిన పరిస్థితులు అంటే ఏమిటి! బిహార్‌ ఎన్నికల తర్వాత, టు లవ్‌ విత్‌ సర్‌ కాదు, సర్‌తో కళ్ళు తెరుచుకున్న ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించమని చెప్తున్నారు. ఎన్నడో చెప్పాడు చారుమజుందార్‌ ఈ మాట. ఎప్పుడో చేసి చూపింది నక్సల్బరీ పంథా. హిడ్మా ఆయన సహాయోధుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు చూడండి. శత్రువు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు. 2024 ఎన్నికల ముందు నుంచే
వ్యాసాలు

విద్రోహాలు, అబద్ధాలు, వక్రీకరణలు చెలరేగిన యుద్ధ కాలంలో చారిత్రక సత్య ప్రకటన

*భార‌త విప్ల‌వ పంథా - స‌మ‌కాలీన సందర్బం* పుస్త‌కం ముందుమాట.  డిసెంబ‌ర్ 7న హైద‌రాబాదులో జ‌రిగే స‌ద‌స్సులో ఆవిష్క‌ర‌ణ... వ‌సంత‌మేఘం టీం ఈ పుస్తకంలో ఏముందో చెప్పబోవడం లేదు. లోపలికి వెళ్లితే మీకే తెలుస్తుంది. సందర్భం గురించే నాలుగు మాటలు.  మన చుట్టూ అంతులేని శబ్ద కాలుష్యం. రణగొణ ధ్వని. యుద్ధారావం. మన పక్కన ఉన్నారనుకున్న మనుషులే శతృవు పక్కకు వెళ్లిపోతున్నారు. మనతో గొంతు కలుపుతారనుకున్న వాళ్లే ఇతరుల భాషతో మాట్లాడుతున్నారు. నిజానికి ఏ ఒక్కరి కోసమో, ఏ మార్గం కోసమో చర్చించనవసరం లేదు. దేనినైనా చరిత్రలో భాగంగా చూస్తే చాలు. అందరమూ చరిత్ర ముందు విద్యార్థులమే. కాలగతిని తెలుసుకోగల
కవిత్వం

విప్లవానికి మరణం లేదు

విప్లవం చనిపోదు రక్తం ఎండిపోతే రగిలే మంట అది!నిజం నలిగితే నినదించే గళం అది!గుండెలో దాచిన ఆవేశం కాదు గోళాల కంటే గట్టిగా పేలే శబ్దం అది!జనాల ఊపిరిలో పుడే తుపాన్ అది!అణగారిన ప్రతి కన్నీటిలోనూవిప్లవం మళ్లీ మళ్లీ పుడుతుంది!దాన్ని చంపలేరు, దాన్ని ముంచలేరు దాన్ని నెమ్మదించించలేరు!విప్లవం అంటేన్యాయం కోసం లేచిన గుండె ధైర్యం!మౌనాన్ని విరిచే కేక!అది మన రక్తంలో ముద్రైపోయిన నినాదం!“విప్లవం చనిపోదు — విప్లవం మళ్లీ పుడుతుంది!”
పరిచయం

ప్ర‌జాస్వామ్యం కోసం అన్వేష‌ణ‌

కాలికి బలపం కట్టుకొని అన్నట్టుగా ఈ మధ్య కాలమంతా తెలుగు నేలంతా తెలంగాణ అడుగడుగునా దేశం నాలుగు చెరగులా శాంతి కపోతమై తిరుగాడుతూ, తన ఉపన్యాసాలతో మధ్య తరగతిని, యువతను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూన్న, శాంతి చర్చల మేధావి మనందరికీ సుపరిచితులైన ప్రొఫెసర్ జి. హరగోపాల్ గారి ఇంటర్వ్యూలు, ఉపన్యాసాల వ్యాసాల పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని  రచయిత శాంతి చర్చల సాధనలో నిత్య కృషీవలుడైన ఎస్ ఆర్. శంకరన్ గారికి అత్యంత గౌరవంతో అంకితం చేశారు. ఇది రచన ఆచరణ రెండు చేతులా  చేస్తున్న పాలమూరు అధ్యయన వేదిక ప్రచురణ.  నేటి వ్యవస్థీకృత హింసకు శాంతి చర్చలే
కవిత్వం

వాళ్ళు ఎందుకు వెళ్ళారు?

వాళ్ళు పేరుకోసమే వెళితేవాళ్లకి మారుపేరేందుకు? వాళ్ళు భూమికోసమే వెళితేవాళ్ళ అమ్మ గుడిసెలోనే ఎందుకుంది?వాళ్ళు నిధుల కోసమే వెళితే వాళ్ళ ఒంటికి ఒక్క వెండి ఉంగరమైన ఎందుకు లేదు ? వాళ్ళు వాళ్ళకోసమే వెళితేఈరోజు నిర్జీవంగా ఎందుకు పడున్నారు ? ఆకలి మంటల ఆర్తనాదాన్ని అనుభవించి వెళ్ళారు బాంచెన్ బతుకు ఇక నడవదని నినందించి వెళ్ళారుమానవత్వాన్ని మరిచిన మనకి మనిషితనాన్ని నేర్పించడానికి వెళ్ళారుదోపిడి, దౌర్జ్యాన్ని ఎదిరించి శ్రామిక రాజ్యాన్ని నిర్మించటానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారుమన బతుకుల్లో వెలుగు కోసం వెళ్ళారునీకు నాకు మనందరికీ హక్కులని పంచడానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారు మన కోసమే అమరులయ్యారు.
వ్యాసాలు

దిగజారుతున్న ఎన్నికల వ్యవస్థ

ఈమధ్య రెండు సందర్భాలలో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల నిర్వహణ పైన  సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.  అందులో ఒకటి బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా, భారత ఎన్నికల సంఘం తీరుతెన్నులు,  ఎన్డీఏ కూటమి ప్రభుత్వ  "ఓటు చోరీ"   పైన. రెండవది ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ పైన జరుగుతున్న సైనిక,  భావజాల పరమైన దాడుల నేపథ్యంలో.  వారు సాయిధ పోరాట విరమణ చేసి ఎన్నికలలో పాల్గొనాలని. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు  ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం రూపొందించి, ప్రకటించిన తీరు ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలకు గురికాబడింది. చివరకు ఈ వివాదం