ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జాతీయ స్థాయిలో ప్రచారం దేశవ్యాప్త ప్రగతిశీల సంస్థలు, రచయితలు, మేధావులు (దండకారణ్యంలో బాంబు దాడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వివిధ ప్రజాతంత్ర సంస్థలు కదిలాయి. అనేక మంది రచయితలు, మేధావులు ముందుకు వచ్చారు. దేశంలోని ఒక భూభాగం మీద ప్రభుత్వం వైమానిక దాడులు చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. - వసంతమేఘం టీం) సుక్మా, బీజాపూర్ అడవులలో గుంతలు, బాంబు అవశేషాల కనిపిస్తున్నాయి. వాటికి కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు వివరణనిస్తాయా? 2022 ఏప్రిల్ 14-15 మధ్య రాత్రి బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బొట్టం, మెట్టగూడెం (ఉసూర్ బ్లాక్), మడ్ప