కవిత్వం

ఉంటాం, అంతే

బతికున్న చావులు లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు మానసిక మరణాలకు ప్రభుత్వం ఎన్నటికీ దోషి కాదు రాజ్యం తన పని తాను చేసుకపోతోంది అడ్డుతగలకండి దరాఘాతానికి వంటిల్లు మూర్చిల్లింది సర్కారును ఎవరూ నిందిచకండి వారు భక్తిరసంలో మునిగి ఉన్నారు పూజా ద్రవ్యాల రేట్లు తగ్గించండి పస్తులుండైనా భజనలు చేస్తాం రెండు పూట్ల భోజనాలను రద్దు చేసుకుంటాం ఒకపూట తిని ఓటు కోసం బతికుంటాం మీరు శూలాలు విల్లంబులు గదలు మేము ఆయుధాలను మోసే బంటులం ఏ అబద్దాలనైనా దృశ్యకావ్యాలుగా మలిస్తే మేము శవాలుగా చప్పట్లు కొడతాం మా పిల్లలకు ప్రేమ స్నేహం దయ పదాలను పలకపై దిద్దించడం
ఆర్ధికం

అసమానతలు చంపేస్తున్నాయి… ఆక్స్ ఫామ్

 ఆక్స్ ఫామ్ ఇంటర్నేషనల్‌ తాజా నివేదిక ‘ఇన్‌ ఇక్వాలిటి కిల్స్‌’ను ఏప్రిల్‌ 17న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం రోజుకు వేలమంది మరణాలకు కారణమైన హింసాత్మక ఆర్థిక విధాన ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. అత్యంత సంపన్నులు-పేదల మధ్య అంతరం బాగా పెరిగింది. పెరుగుతున్న అసమానత వల్ల మహిళలు, మైనారిటీలు, బడుగు, బలహీన వర్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, కొవిడ్‌ విపత్తుకు ప్రతిస్పందనగా అసమానతలు పెరగడానికి దారితీసిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంక్‌, సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ అంచనాలపై, పరిశోధనలపై ఆధారపడి ఆక్స్‌ఫామ్‌ తన నివేదికను రూపొందించింది.  నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలు దేశాన్ని
సాహిత్యం

అలిశెట్టి  జీవన దృశ్యం

ఏయే విలువల ఆధారంగా ఒక కవిని అంచనా వేయాలన్న ప్రశ్నలు విమర్శకులకు ఎదురవుతాయి. మానవ విలువలకు ప్రతినిధిగా చూడాలా? సమకాలీన ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తిగా చూడాలా? వంటి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ‘‘మానవ  విలువలు’’, ‘‘ఉద్యమం’’ వేర్వేరే కావు. అంతర్జాతీయ ఉద్యమాల నేపథ్యంలో గొప్ప కవితలెన్ని రాసి ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘‘ఏకైక మహాకవి’’గా  శ్రీశ్రీ గారు గుర్తింపు పొందారు. వివాద రహితమైన అరుదైన కవుల్లో ‘‘అలిశెట్టి ప్రభాకర్‌’’ స్థానం సమున్నతమైంది. అందుకే ఆయన రాసిన ప్రతి అక్షరంలో నిష్కలమైన నిజాయితీ కనిపిస్తుంది. ‘‘బీదరికం  అనారోగ్యం ఒక గొప్ప కవిని మనకు కాకుండా చేశాయి’’. ‘‘ఓడ్‌  టు పోయెట్స్‌’’
కథలు

లోప‌లి ప్ర‌పంచం

          "ఏంబా ఇంకా క్యారేజ్ రెడీ చేయలేదా. కాని టైం అవుతోంది" ఆంజనేయులు అది మూడో సారి అరవడం మూడు రోజులకు సరిపడా చపాతీలు రెడీ చేయడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. అయినా ఆకలికి కడుపు మాడ్చు కుంటాడేమోనని పద్మ తయారు చేస్తోంది. "ఇంకెప్పుడు  నువ్వు మాములు డ్యూటీకి వచ్చేది. ఆ బేస్ క్యాంపు డ్యూటీ వేసుకోవద్దు అని చెప్పినా వినవా. ఆ కొండల్లోకి వెళితే సెల్లు పనిచేయదు. నీకు ఏమైందో తెలీక టెన్షన్ పడలేక చస్తున్నా " పద్మ కోపంగా అంది. "ఈ తిట్లకేం గాని  నువ్వు క్యారేజ్ ఇస్తే ఇయ్యి, లేపోతే పో"