వ్యాసాలు

మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ లబ్ధి కొరకు వాడుకుంటున్న బీజేపీ ప్రభుత్వం..

మహిళలకు చట్టసభ ల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును డి లిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ)బిల్లుతో ముడి వేసి 131 వ రాజ్యాంగ సవరణ బిల్లును బిజెపి ప్రభుత్వం ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశపెట్టగా, అది వీగిపోయింది.. మరు సటి రోజు ప్రధానమంత్రి మోడీ, "మహిళా బిల్లుపై మేము నిజాయితీగా చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు బ్రూణ హత్య చేశాయి మహిళలారా క్షమించండి" అని సుదీర్ఘంగా మాట్లాడాడు. ఇది కోట్లాది మహిళలకు జరిగిన ద్రోహం గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్ణించాడు.. శాసనసభ హాజరుకాని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు ఏం
కవిత్వం

వలసవాదులు

అన్వేషకుడుదాన్ని "పరిశోధన "అన్నాడుఓజెండా, ఓ శిలువ, ఓ కిరీటంఅకస్మాత్తుగ బందిపోటుపవిత్రుడైపోతాడుప్రజలను తరిమేశాకఅదంతా "ఖాళీ నేల" అవుతుందిమూలవాసులుచరిత్రను పూడ్చిపెట్టిందెవరోచూపెడతారుమీ మ్యాపులకన్న ముందుఇక్కడొక భాష ఉండేదిమీ సరిహద్దులకు ముందుఇక్కడ జ్నాపకాలుండేవిమీ లెక్కల పుస్తకాలముందుఇక్కడ జీవిత ముండేదివలసవాదులుఅడవిని కనుగొనలేదుదాన్ని "సృష్టించారు"పేర్లను, మనుషుల్ని, భవిష్యత్తును తుడిచేసిదాని పేరు నిశ్శబ్ద నాగరికతగా నామకరణం చేశారువాళ్లుతెచ్చింది నాగరికత గాదురోగాలు, సంకెళ్లు, కట్టు కథలుమేధావులకో "ప్రశ్న "పరిశోధన అంటే నిజాయితేనాలేక తన అధికారంసుస్థిరం చేసుకోవడానికిచెప్పే మొదటి అబద్ధమా**థింక్ అండ్ ఎగ్జిస్ట్...నుండిస్వేచ్ఛానువాదం.. ఉదయమిత్ర
వ్యాసాలు

వర్తమానంలో కె. వి. ఆర్.

“మినహాయింపులెప్పుడూ ... మౌలిక వాస్తవాన్నే రుజువు చేస్తాయి” చాలా ఆసక్తికరమైన ఈ వాక్యం కె.వి.ఆర్. ఆంధ్ర సాహిత్యంలో క్షీణయుగం గురించి రాస్తూ ప్రతిపాదించారు. ఈ వర్తమానం మీద నిలబడినప్పుడు కూడా మనకు ఈ మాట ఎంతో ఆశావహంగానే కాదు చరిత్ర సరికొత్తగా పునరావృత మవుతుందన్న ఆశయాన్ని ధ్రువీకరిస్తుంది. ఈ వెలుగుల్లో ఆయన రచన 'నిశీథిని' ని పర్యాలోకిద్దాం...        1565 తల్లికోట యుద్ధం, విజయనగర సామ్రాజ్య పతనం దీనికి"ఇరుగుపొరుగు సుల్తానులే కాదు రాజ్య శరీరంలో బలిసిన విష క్రిముల వంటి అమర నాయకులు కూడా కాదనలేము". కె వి ఆర్ చెప్పిన ఈ విషయం చరిత్ర పరిణామాల్ని గుర్తించడంలో
సంపాదకీయం

మేనియా కాదు..మ్యాజిక్ లేదు.. ఓటర్లపై యుద్ధమిది!

యుద్ధాలు జ‌రుగుతున్న‌ప్పుడు ఎన్నిక‌లొస్తే సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు కుదేల‌వుతాయి. అధికార ప‌క్షం ప‌ద‌విని పోగొట్టుకోవ‌డ‌మో, ఓట్ల శాతాన్ని ఎంతోకొంతో కోల్పోవ‌డ‌మో జ‌రుగుతుంటుంది. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో పార్ల‌మెంటు లోప‌ల‌, బ‌య‌ట ధాటిగా ప్ర‌సంగాలు చేసిన విన్‌స్ట‌న్ చ‌ర్చిల్ ఆ యుద్ధం త‌ర్వాత బ్రిట‌న్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో విజేత‌లు, ప‌రాజితులు అంతా న‌ష్ట‌పోయారు. చ‌ర్చిల్ ఓట‌మికి ఇది ఒక కార‌ణం. ఇక‌.. యుద్ధంలో చొర‌వ‌ను బ్రిట‌న్ జాడ విడుచుకుని సోవియ‌ట్ యూనియ‌న్ హీరోగా నిల‌వ‌డానికి కార‌ణ‌మ‌య్యాడంటూ లార్డ్స్ సైతం చ‌ర్చిల్‌ను క‌సిగా ఓడించ‌డం ప్ర‌ధాన కార‌ణం. యుద్ధాల స‌మ‌యంలో పాల‌క పార్టీలతోపాటు వ్యాపార సంస్థ‌లు
వ్యాసాలు

ప్రైవేటీకరణ విద్య కార్పొరేట్ల లీకేజ్

2026 మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో NTA నీట్ పరీక్షను రద్దు చేశారు. గత సంవత్సరం కూడా ఇదే పద్ధతిలో నీట్ పరీక్ష రద్దు కాబడి మరలా నిర్వహించడం జరిగింది. విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టి జరుపుతున్న ఈ వికృత క్రీడలో కేంద్ర,  రాష్ట్ర పాలకులు విద్యార్థులను పావులుగా మార్చుతున్నారు. 1980 తర్వాత విద్య క్రమక్రమంగా ప్రైవేటీకరణ జరిగి ప్రవేశ పరీక్షలు పేరుతోను, పోటీ పరీక్షల పేరుతోను విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. ఎంతోమంది విద్యార్థులు నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థుల
వ్యాసాలు

నీట్ పేపర్ లికేజి లేవనెత్తుతున్న ప్రశ్నలు

నీట్-యూజీ 2026 పరీక్షలో అక్రమాలు,పేపర్ లీకేజీ జరిగిన నేపథ్యంలో  పరీక్షను రద్దు చేసి, సమగ్ర దర్యాప్తు జరిపాలని సీబీఐ ని కేంద్ర  ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి కేంద్రంలోని భాజపా సర్కారు వైఫల్యంతోనే వరుసగా పేపర్ లికేలీలు జరుగుతున్నాయి‌. ఈ అంశాన్ని చర్చకు లేకుండా భాజపా అనుకూల విద్యార్థి సంఘం ఎబివిపి,గోది మీడియా, వ్యక్తులు కేవలం పరీక్ష నిర్వాహణ సంస్థ ఎన్టీఏ తప్పిదంగా పరిమితం చేస్తూ విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారు.మే 3, 2026న జరిగిన నీట్ ,యూజి 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు, రాజస్థాన్‌లోని సీకర్ కోచింగ్ సెంటర్ లో గెస్ పేపర్ పేరుతో లీక్ పేపర్లు వాట్సాప్/టెలిగ్రామ్
వ్యాసాలు

కార్మిక హక్కులను రద్దు చేసిన లేబర్ కోడ్స్

మోదీ ప్రభుత్వం నవంబర్ 21,2025 నుండి అమల్లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల పై  నిబంధనలను మే 8,9 తేదీలలో గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లు భారత కార్మికవర్గాన్ని దళారీ బడా పెట్టుబడిదార్లకు, బహుళజాతి సంస్థలకు అత్యంత మోసపూరితంగా అమ్మివేశాయి. ఆ విధంగా భారత కార్మికవర్గం వందల సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టబద్ధ కార్మిక హక్కులను రద్దు చేసింది.2019 నుండి కార్మిక చట్టాల ఎత్తివేతకు జరుగుతున్న ప్రయత్నాలను కార్మికవర్గం వ్యతిరేకిస్తున్నా,నవంబర్ 26,2026 న (బిజెపి అనుబంధం కార్మిక యూనియన్ భారతీయ మజ్దూర్ సంఘ్ తప్ప)
వ్యాసాలు

నోయిడా కార్మికుల సమర శీల సమ్మె

ఉదయం ఎనిమిది గంటలు. నోయిడాలోని ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతం.  బస్ స్టాప్ వద్ద మైనాదేవి నిలబడి ఉంది. ఆమె ఎడమ చేతి బొటనవేలుకు కట్టు ఉంది. అంతకు ముందు రోజే  గురుదాస్ అమర్‌దాస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్నప్పుడు, ఒక వైర్ టెర్మినల్ ఆమె చర్మాన్ని చీల్చి౦ది. ఆ కంపెనీ వాహనాల కోసం వైర్ హార్నెస్‌లను, డేటా సిస్టమ్స్ కోసం షీల్డెడ్ కేబుల్స్‌ను తయారు చేస్తుంది. చేతి నొప్పి తీవ్రంగా ఉ౦ది. అయినా డ్యూటీ కి వెళ్ళటానికి ఆమె కంపెనీ బస్సు కోసం ఎదురు చూస్తోంది. సెలవు పెట్టక పోయారా?  ఒక విలేఖరి అడిగాడు. ‘ఒక్క
వ్యాసాలు

నోయిడా కార్మిక సమ్మెలు; ‘బిగుల్’కు ఉన్న సమరశీల పరిమితులు

ఈ సంవత్సరం ఏప్రిల్ మధ్య నుండి, నోయిడా, గ్రేటర్ నోయిడా అంతటా పారిశ్రామిక, గృహ కార్మికులు పదివేల సంఖ్యలో స్వచ్ఛందంగా సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాన్ని కనీసం ₹20,000 కు పెంచి సమయానికి చెల్లించడం, వారాంతపు సెలవులతో కూడిన 8 గంటల పని దినం, అదనపు పని గంటలకు (ఓవర్‌టైమ్) రెట్టింపు వేతనం, భద్రత, ఉద్యోగ భద్రత వంటి ప్రాథమిక సౌకర్యాలతో పాటు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయడం మొదలైనవి వారి ప్రధాన డిమాండ్లు. సమ్మె చేసినందుకు వెయ్యి మందికి పైగా కార్మికులను రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు; వందలాది మందిపైన ఎఫ్.ఐ.ఆర్‌.లు నమోదు చేసి అరెస్టు