జహీర్ అలీఖాన్‌కు విరసం నివాళి
ఈ ఖాళీ ఇప్పట్లో భర్తీ అయ్యేదేనా? ఒక మత సమూహం మీద ఉగ్రవాదులని ముద్రవేసి, హీనపరిచి అభద్రతకు గురి చేస్తున్న రోజుల్లో అక్కడి నుంచే వచ్చిన లౌకిక ప్రజాస్వామికవాది జహీర్ అలీఖాన్ అకాల మరణం తీరని లోటు. కాలం అన్ని ఖాళీలను భర్తీ చేస్తుందనే భరోసా పెట్టుకోగలం కాని, జహీర్ అలీఖాన్‌లాంటి పాత్రికేయుడు, బుద్ధిజీవి, లౌకికవాది ఇప్పుడప్పుడే వస్తారని అనుకోగలమా? గతం కంటే ఎక్కువ వత్తిడితో జీవిస్తున్న ముస్లింలకు అండగా నిలవగలవాళ్లు రాగలరా? హిందూ ముస్లిం భాయీ భాయీ అనే జీవన సందేశాన్ని ఆచరణలో బతికించగల జహీర్ అలీఖాన్ వంటి వ్యక్తులు అన్ని వైపుల నుంచి అత్యవసరమైన కాలం