పోరాట ప్రజల గుండె డప్పులు
(1981లో వచ్చిన *గద్దర్ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట) ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా - మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి - గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి. ఒడ్డూ