సంభాషణ

హస్‌దేవ్ అటవీ విధ్వంస ‘మూల్యాన్ని’ ఎప్పటికీ చెల్లించలేం

అడవిని కాపాడాలంటూ ఉద్యమిస్తున్న 'హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి' వ్యవస్థాపక సభ్యుడు, 'ఛత్తీస్‌గఢ్ బచావో ఆందోళన్' కన్వీనర్ అలోక్ శుక్లాకు ఈ ఏడాది 'గోల్డ్‌ మ్యాన్ అవార్డు' లభించింది. గోల్డెన్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేసే కార్యకర్తలకు ఈ అవార్డును అందజేస్తుంది. ఈ అవార్డును గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు. ఈ సంవత్సరం, గోల్డ్‌ మ్యాన్ ఎన్విరాన్‌మెంట్ అవార్డును భారతదేశానికి చెందిన అలోక్ శుక్లాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుగురు కార్యకర్తలు - దక్షిణాఫ్రికాకు చెందిన నాన్‌లే మబుతుమా, సినెగుగు జుకులు, స్పెయిన్‌కు చెందిన తెరెసా