పాలస్తీనా సత్యం : జెనిన్ జెనిన్
పాలస్తీనా భూభాగం లోని ‘జెనిన్’ అనే శరణార్థి శిబిరం మీద ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దారుణమైన దాడి గురించి, దాని పరిణామాల గురించి అరబిక్ భాషలో దృశ్యీకరించిన డాక్యుమెంటరీ చిత్రం “జెనిన్ జెనిన్”. దీని స్క్రిప్ట్ రచన, దర్శకత్వం మొహమ్మద్ బక్రీ నిర్వహించారు. ఈ చిత్ర నిడివి 54 నిమిషాలు. “జెనిన్, జెనిన్” అనే డాక్యుమెంటరీ చాలా విషాదకరమైన వినాశనకరమైన ‘జెనిన్ యుద్ధం’ గురించి దృశ్య మాధ్యమంలో హృదయ విదారకంగా చిత్రీకరించబడింది. ఇది పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ శిబిరం ప్రజలతో పూర్తిగా దర్శకుడు జరిపిన ఇంటర్వ్యూల ద్వారా కథకుడు లేకుండా చెప్పడం చూస్తారు ప్రేక్షకులు. వివిధ



