సాహిత్యం కవిత్వం

యుద్ధమాగదు

ఆ ఒక్క క్షణం కోసంయుగాలుగ ఎదురుజూసిందిఆ ఒక్క ఊహఆమెను పసిదాన్ని జేసింది అల్మయిరాలోపుస్తకాలు సర్దింది" మరణాన్ని తిరస్కరిస్తున్నా "వాక్యాన్నిపక్షిని జేసిభుజంమీద మోసుకుతిరిగింది.. గుండెనిండావసంతాలపొదుముకొనిగిన్నెనిండాబువ్వవొండుకొనివొణికే చేతుల్తో ప్రియమార తిన్పించాలనిమొగులుకోసం రైతుజూసినట్టుబిడ్డడి కోసం తల్లి జూసనట్టుగేటుకు కళ్ళ నతికించిఎంత ఎదురుచూసిందో అతడురాలేదుభయపడ్డట్టే జరిగిందిఊపిరి బిగబట్టే లోపుఊపిరాగినంత పనయ్యింది. ఆమెకూ అతడికీ మధ్యరాజ్యం..పూలరెక్కలమీదబుల్ డోజర్ నడిచింది మధ్య యుగాలకేసిముఖంతిప్పిన కోర్టుప్రజలకోసం కొట్టుకునే గుండెప్రమాదమన్నది****" అమ్మా..ఇక నాయినరాడా? "మెలిపెట్టే బిడ్డప్రశ్నల్నీఅంతరంగ సముద్రాల్నీ అదిమిపట్టితెగుతున్నఆశల దారాల్ని పేనుతూమళ్ళీచౌరస్తాలో నిలబడ్దదామె.. యుద్ధ మాగదు..
వ్యాసాలు సంభాషణ

పాలకవర్గాలలో మరో కలకలం

సెప్టెంబర్‌ మూడవ వారంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్‌) లో సౌమిత్రాబోస్‌ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్‌ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్‌ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను
సాహిత్యం కవిత్వం

ఈ పూలేమి నేరం చేసాయో చెప్పు ?

ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే చాలు..దేహామంతా పరిమళాల చెట్టు అయిపోక మరింకేమి అవుతుంది?ఈ పూల కెన్ని పేర్లూ -ఊర్లూఅందాలూ – బంధాలూరంగులూ – పరిమళాలు.ఈ పూలకెన్ని షాయారీలూ - గజళ్ళు.కథలూ -కవితలు .ముచ్చట్లు – మౌనాలూఈ పూలకెన్ని ఊర్లూ – దేశాలు- భూములుఇళ్ళూ – ఖబరిస్తాన్లు .ఈ పూలకెన్ని తోటలూ - ఎన్ని ఎడారులు అవన్నీ సరే .. ఇది చూడండిఈ పూలకెంత సమానత్వం., ఎంత లౌకికత్వం !కులమూ లేదు.. మతమూ లేదుకదిలే మనుషుల దేహాల మీద.. కదలని శవాల మీదఅందరి శ్మశానాల్లో సమాధుల మీదమందిరాల్లో .. మసీదుల్లో.. చర్చీల్లోఐక్యంగా ఒక్క మాలై ఊగుతాయి కదా !ఒక్కలాగే
కవిత్వం సాహిత్యం

వాళ్లిద్దరు

ప్రజల ప్రయోజనాలే ప్రాణంగాబతికిన వాళ్లు, వాళ్లిద్దరుఒకరు హిమాలయాలంత ఎత్తుకెదిగినల్లమల కాఠిన్యాన్ని పుణికి పుచ్చుకొనిశత్రువుకు నిద్ర పట్టనీయనివిప్లవ శ్రేణులకు సేనానిమరొకరు ప్రేమ మాత్రమేచైతన్యాన్ని ఉద్దీపింప చేస్తుందనిబలంగా నమ్మి ఆచరించినవాడువిప్లవ శ్రేణుల గుండెల్లో నెలవైశత్రు సేనలపైకి ఉరికించినవాడుఈ యిద్దరు వ్యూహకర్తలను, ప్రజల ప్రేమికులనుకోల్పోవడం నా, మీ వ్యక్తిగత బాధే కాదునూతన సమాజాన్ని ప్రసవించేపుడమి తల్లి పురిటి నెప్పుల బాధ కూడాఇప్పుడు గుండెల నిండా కర్తవ్యంజయించాలనే తపన, జ్ఞానం కోసం మధనంచలన నియమాలను ఒడిసి పట్టుకోవాలనే ఆరాటంఅమరుల శక్తిని నిబిడీకృతం చేసుకున్న ప్రతి అడుగూమరింత దృఢంగా ప్రజల పక్షంఅందుకేఓటమి తాత్కాలికంగెలుపు ఖాయం! (కామ్రేడ్స్‌ సూర్యం, రవిల అమరత్వం నేపథ్యంలో దుఃఖమే అనంతమై ఆలోచనలు
సాహిత్యం కథలు హస్బెండ్ స్టిచ్ - 3

అనగనగనగా… ఒక మంచం!

‘నానమ్మా ఇప్పుడే చెప్తున్నాను ఈసారి వచ్చినప్పుడు పందిరి మంచం తీస్కెళ్ళిపోతాను నువ్విక ఆపలేవు నన్ను. పెళ్ళై మూడు సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడిస్తావు నానమ్మా... నువ్వూ పడుకోవు, అమ్మనీ పడుకోనీవు. నాకూ ఇవ్వవు. స్టోర్‌ రూమ్‌లో ఆ నల్ల దుప్పటితో కప్పెట్టేస్తావు అదేదో పురావస్తు గ్నాపకంలా... షాజహాన్‌ ముంతాజ్‌ కోసం కట్టిన తాజ్‌మహల్లా... ఏంటది నానమ్మా అర్థం ఉండాలి. వస్తువులు, మనుషులు అందరికీ ఉపయోగపడాలి అంటావుగా నువ్వు. అంత పెద్ద అందమైన పందిరి మంచం, చూస్తేనే నిద్రొచ్చేలా ఉండే పందిరి మంచం, జోలపాడుతూ అమ్మ ఒడిలా కమ్మగా జోల పాడుతూ నిద్రపుచ్చే పందిరి మంచం... కమ్మటి కలల్నిచ్చే పందిరి మంచం
సంభాషణ

ఈ మట్టిని తొలుచుకొని లేచిన ఆదివాసీ రైతు వీరుడు

(అమరుడు కామ్రేడ్‌ కేండ్రుక సింగన్న స్మృతిలో...) అది సెప్టెంబర్‌ మాసం మధ్య రోజులు. మేము నారాయణ పట్నా గుండా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నాం. నారాయణ పట్నా బ్లాక్‌ వచ్చేసరికి అంతా హడావిడిగా కనిపిస్తున్నది. దారి పొడుగునా ప్రజల నుండి అమితమైన ఆదరణ వ్యక్తమవుతున్నది. మేము బహిర్గతం కాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, మా అలికిడి ఏ మాత్రం అర్థమైనా, జనం నిద్ర మంచాలపై నుండి లేచి బారులు తీరి చేతులు కలుపుతున్నారు. ఈ ఆప్యాయత మా అలసటను మాయం చేస్తున్నది. ఎక్కడకు వెళ్లినా  మా సంఖ్యకు మించి ‘డొప్ప’ల్లో ఆహారం వస్తున్నది. మా ప్రయాణం కొంచెం ముందుకు
సాహిత్యం కవిత్వం

విప్లవ కార్యదీక్ష

ప్రజాయుద్ధమై ప్రజ్వరిల్లిన శాంతి స్వప్నంచీకటి క్షణాలను తాకే సూర్యకిరణంమేధా జగత్తును అల్లుకున్న ఒక స్పర్శప్రజా ప్రత్యామ్నాయ రూపశిల్పివిశాఖ ఉక్కుకు మలిబాటైన చుక్కానిపేగు బంధానికి వర్గయుద్ధ చిత్రాన్ని అద్దిన ఆదర్శంప్రజా పంథాకి ప్రాణవాయువుమహిళా-మానవత్వ విలువలకు ఆచరణరూపంఎన్నికల కుల రాజకీయాలను ఎదిరించి కుల నిర్మూలనా మార్గాన్ని మలచిన సాహసి 'జంపిస్టుల' మర్మభేధిఒక ఆత్మీయతా అనురాగంఒక విప్లవ ప్రజాస్వామిక చైతన్యంఒక విప్లవ కార్యదీక్ష! (కామ్రేడ్‌ సాకేత్‌ అమర్‌ రహే!)
సాహిత్యం కవిత్వం

నిండు పున్నమి వెన్నెల వెలుగువై…

నిత్యం జ్వలిస్తూ, సృజిస్తూగుంటూరు నుండి ప్రారంభమైననీ విప్లవ ప్రస్తానం! కృష్టమ్మ అలల హోరులోశతృ కిరాయి బలగాల పహారాలలోనల్లమల్ల చెంచు ప్రజల జీవితాలలోనిండు పున్నమి వెన్నెల వెలుగువైపీడిత ప్రజలకు ఆత్మీయ కర స్పర్శవైఆంధ్ర-తెలంగాణా మైదానాల్లోవర్గ పోరాటాల జ్వాలలనునిత్యం జ్వలింపజేసినవీర యోధుడా! నిరంకుశ దళారీ పాలకవర్గాలఫాసిస్టు అణచివేతకుఅలిపిరి లాంటి విస్ఫోటనంలోపాలకవర్గాల గుండెల్లో గుబులు పుట్టించినబుద్ది చెప్పిన సాహసానికి సంకేతమా! శాంతి చర్చలంటూప్రజలను మోసం చేసేదోపిడీ వర్గాల ఎత్తుల జిత్తులనుపార్టీ ప్రతినిధిగా చర్చలకు వెళ్ళిరాజ్యం వర్గ స్వభావాన్నిచర్చలంటూ మోసగించేవిప్లవోద్యమం అణిచివేతకుదుష్ట కుట్రలను చీల్చి చెండాడిప్రజల ముందు ప్రతిభావంతంగావిప్లవ స్వరాన్ని దృఢంగాప్రజాయుద్ధపు పంథాను ఎత్తిపట్టిదళారీ పాలకవర్గాల ఎత్తుల జిత్తులనుచిత్తు జేసిన పార్టీ నాయకుడిగాచారిత్రక ఘటనకు
ఆర్ధికం

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న మాంద్యం

కొవిడ్‌ తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో  పులి మీద పుట్రలా యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుంగిపోతుందన్న భయాలు పెరుగుతున్నాయి.  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ) మాంద్యం తప్పదని హెచ్చరిస్తోంది. డాలర్‌ దెబ్బకు  ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. డాలర్‌ డామినేషన్‌ దినదినం పెరుగుతోంది. ప్రపంచం మరో ఉత్పాతానికి దగ్గరగా చేరుకుంటోంది. ద్రవ్యోల్బణం, రుణభారం,  మాంద్యం ఒకపక్క,  ఇంధన కొరతలు,  ఆకలికేకలు,  ఎంతకీ వీడని కొవిడ్‌ వైరస్‌,  యుద్ధ ప్రభావం మరోవైపు కలిసి ఏకకాలంలో మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది 2008 ఆర్థిక సంక్షోభమే.