బజరా ‘మనువాచకం-సమకాలీన అనుభవసారం
నేటి ఆధునిక యుగంలోనూ భారత సామాజిక జీవనం ఇంకా అనాధునికంగానే ఎందుకు ఉన్నది? ప్రగతి సూచికలో మన దేశం ఏ స్థానంలో ఉన్నది? ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడో ఒకప్పుడైనా మనకు ఎదురవుతాయి. నిజానికి ప్రగతి సూచికను బట్టి చూస్తే, మన సమాజం ఇంకా కింది స్థాయిలోనే ఉన్నది. ఎందుకంటే వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, ప్రశ్నించే హేతుబుద్ధి మన సమాజానికింకా అపరిచితాలుగానే ఉన్నాయి. మరి మన దేశంలో జరిగిన జాతీయోద్యమం, సంస్కరణోద్యమం, భక్తి ఉద్యమాలన్నీ సామాజిక మార్పుకు దోహదపడినవైనప్పటికీ, అవన్నీ మౌలిక సామాజిక మార్పును ఆశించి సాగినవి కావు. అలాగే ఏ కమ్యూనిస్టు ఉద్యమాలకైనా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ,