కులం భారతదేశంలో క్రీస్తు పూర్వం ఉంది క్రీస్తు తర్వాత కూడా ఉంది. అది ఇప్పటికీ సజీవంగానే ఉంది అయితే ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికనుగుణంగా రూపం మారుతూ ఉంది. ఒకప్పుడు బహిరంగంగానే చూపేవారు ఇప్పుడు చూపించకనే చూపిస్తున్నారు. వర్షం కురవని నేల ఉంది ఎండ పడని భూమి ఉంది కాకులు దూరని కారడవి ఉంది కానీ కులం లేని సమాజం లేదు. ప్రతి దగ్గర ఏదో విధంగా ఏదో రకంగా ఆధిపత్యం చూపిస్తూనే ఉంటారు. అగ్ర కులాలకు లోకులాలు, దళితులంటే గిట్టదు లోకులాలకు వారి కింద కులాలంటే పడదు. ఒకరి కింద ఒకరు అంటూ బాయిలో కప్పల్లా ఉంటున్నారు. కులాలు వర్ణాలు తెగలు మొదటినుంచి ఒక్కో దశలో ఒక్కోరకంగా మారుతూ వస్తుంది. వస్తూ వస్తూ మనుషుల మధ్య అడుగంతైనా దూరం తెస్తుంది. ఒక విషయాన్ని వివిధ దృక్కోణాలతో చూసినపుడు ఆ విషయం సారాంశం అర్దమవుతుంది. నిజానికి ఒక విషయాన్ని కానీ ఒక సంఘటనని గాని మనదైన దృక్పథంతో చూసినప్పుడు ఆ విషయంలో ఎంత రాజకీయం ఉందో తెలుస్తుంది.
ప్రాచీన భారతదేశంలో సాంఘిక వ్యవస్థను అధ్యయనం చేయడానికి తొలిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నం చేసింది. ప్రాచీన భారతదేశంలో సాంఘిక వ్యవస్థ మీద అధ్యయనంలో బాగంగా తొలి ఆంగ్ల గ్రంధాల్లో “ ఏకోడ్ ఆఫ్ జెంటూ లాస్” అనే పుస్తకం వచ్చింది.
“ తమ దేశం చట్టాలతో గాని, ప్రయోజనాలతో గాని ఎక్కువగా వ్యతిరేకంగా లేని సంస్థల్ని అర్దం చేసుకుని అనుసరించినప్పుడే భారత దేశంలో తమ వ్యాపార ప్రయోజనాల్ని బెంగాల్ లో చేజికించుకున్న రాజకీయ అధికారాన్ని రక్షించుకోవడానికి వీలు ఉంటుంది” అని ఆ పుస్తకంలోని పీఠిక లో రాసుంది. ఇది 1776 నాటి సంగతి. ఇదంతా శూద్ర వర్ణం ఎలా పుట్టింది అనే పుస్తకంలోని మొదటి వాక్యాలు.

అంటే శూద్రుల గురించి ఆనాటి బ్రిటిష్ వారు అధ్యయనం చేశారు వారు వారి  ప్రయోజనాల మేరకు చేసిందది అయితే ఆనాటి నుంచి వారిని అలాగే ఉంచడంలో అగ్రకులాల వారు గట్టి ప్రయత్నమే చేశారు. సమాజంలోని దళితులని ఎంతగా బయపెట్టారంటే వారి పుట్టుకే వ్యర్ధం వారు పుట్టిందే పెద్ద కులాలకు గులాంగిరి చేయడానికి అన్నంతగా.
అందుకే అంటరాని వసంతంలో మొదట ఒక కథ చెప్తారు రచయిత. మాల మాదిగలు ఎలా పుట్టాయి అని. మాంసం ముందుగా దేవతలె కదా తినాలనుకుంది!
కులాల మీద మతాల మీద ఎన్ని కథలు రాసిన ఎంత కవిత్వం, నవల, వ్యాసాలు, సినిమాలు తీసినా పేలుతుంటాయి ఎందుకంటే అది ఇప్పటికీ వీక్షించే, చదివే వారి భావాలు కనుక అవి ఇప్పటికీ మారని పరిస్థితులు గనుక. వారు ఎదురుకుంటున్నా సందర్భాలు గనుక.
ఎప్పుడో వచ్చినా మాలపల్లి నవల సినిమా, మా భూమి నవల సినిమా, అంటరాని వసంతం, అంటరాని ప్రేమ. మొన్న వచ్చిన దండోరా సినిమా వరకి ప్రతి సినిమాలో కనిపించేది కులమే అది ఆధిపత్య కులమే. అయితే అది ఇప్పుడున్నా సొ called సాఫ్ట్వేర్, జెన్ జి, యువతలకి అంతగా అర్దం కాకపోవచ్చు ఎందుకంటే అందులో ఆ సన్నివేశాన్ని వేరే ఆకర్షిత సన్నివేశానికి ముడిపెడతారు కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే యవ్వనం నుంచి వృద్దాప్యం వరకి రావచ్చు.
అంటరానితనం is not a thrown word is an attentional thing.


ఈ నేల మార్చి అరుణతార లో వచ్చిన కథ ఏ కేస్టడీ.

కథలోకి వెలితే జెన్నీ ప్రశ్న దగ్గర మొదలు పెట్టి అమ్మ జవాబు దగ్గర ముగుస్తుంది రెండు పేజీల కథ. కథ వస్తువు కులం. సాహిత్యం మనుషులని మనుషులకే కొత్తగా పరిచయం చేయిస్తుంది. కొన్నిసార్లు కథ వస్తువు అంతా బాగుండీనా చెప్పడంలో ఎక్కడో లోపం కనబడుతుంటుంది. నిజానికి ఒక పది నిమిషాల్లో యీ కథ చదవడం పూర్తవుతుంది కానీ కథని ఇంకో పది నిమిషాల్లో మర్చిపోతారేమో అని నా అభిప్రాయం.  ఎందుకంటే కథలో ఎక్కడ సామాజిక ఎదుగుదల కనిపించదు. అమ్మ పాత్ర అయినా కూడా ఆ క్షణం ఆ పరిస్థితి నుంచి ఆ సంఘటన స్థలం నుంచి ఎస్కేప్ అవుతుంది. కథలో సహాజత్వమే కనిపిస్తుంది నిజానికి కథకి కావాల్సిందే అదే కానీ ప్రేరేపించే విధంగా కదలాలి కథ. చివరికి జెన్నీని కూడా తన ఫ్రెండ్ నుంచి ఎస్కేప్ చేయిస్తుంది తప్ప, ఇది తప్పు ఇలా కాదు మనం ఆలోచించాల్సింది, మనం చదువుకున్నవాలమనో! మన ఆలోచన తీరు మారాలి అనో!  ఉద్రేకపరిచే విధంగా సమాజాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటే బాగుండేది. ఘర్షణ పడని సంఘటన బావోద్వేగానికి లోనవ్వని పాత్ర ఆ కథ, కథ కాదేమో! బావోద్వేగం కథలో కొంచం కనిపించిన పాఠకులు దానికి గురవ్వాలి అని నా అభిప్రాయం.

కథ ముఖ్యంగా చదివే పాఠకులని కథ లోకి లాకెళ్లాలి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా కథలో లీనమయ్యేలా ఆ పాత్రలు, పరిసరాలు ఆ వర్ణన ఉండాలి. చదివి ఊరుకునే వస్తువు కాదు ఏ కేస్టడీ. ఆలోచింపచేసేది. ముఖ్యంగా ఒక కథ రాశాక మళ్ళీ మళ్ళీ చదవకపోవడం వల్ల కలిగే నష్టాలు ఎలా ఉంటాయంటే, కథ మూడో పేర లో అమ్మ గతం చెప్తూ వాళ్ళ ఫ్రెండ్స్ తొమ్మిది మంది అని చెప్తుంది కానీ చదివితే పది పేర్లు ఉంటాయి. ఆ కింద లైన్లలోనే “ మా సైకిల్లన్నీ వంతెనపై ఆపి ప్రవహించే నీళ్లల్ల కదిలే చేపపిల్లల్ని చూసేటోళ్లం” అంటుంది విచిత్రంగా లేదూ! నీటిలో చేపలు కదలకపోతే శిలాలా వుండవు కదా.
నా వరకి కథలో ఎంతో కొంత వర్ణన అయినా ఉండాలి. అంటే పాఠకులని ఆ ఊహ ప్రపంచంలోకి తీసుకెళ్లకపోతే వారు ఇక్కడే ఉండి చదువుతారు అప్పుడు ఆ కథ చదవడమే చేస్తారు తప్పితే అనుభవించరు. లేకపోతే చెప్పే శైలి అయినా అందంగా ఉండాలి అని నా అభిప్రాయం. మరో కథతో మమ్మల్ని  మీ ప్రపంచంలోకి తీసుకెళతారాని ఆశిస్తూ..

  • నీలా 

Leave a Reply