చరిత్రహీనుల జీవితాలకు రంగులద్ధి , మేలిముసుగులేసి , అందమైన అలంకరణాలు చేస్తున్న పాలన ఇది. దేశద్రోహుల, లొంగుబాటుదారుల వికృత , ప్రజావ్యతిరేక జీవితాలను గొప్ప చేసి వాళ్లు మహనీయులని, త్యాగమూర్తులని, ఆదర్శనీయులని బహుళ ప్రచారం చేస్తున్న రోజులివి. “జననీజన్మభూమి ” అంటూ నాటకీయ విన్యాసాలతో, తమ అంగ ,అర్థ బలాలతో, ప్రభుత్వ విధేయతలే “దేశభక్తి”గా ప్రజలను ఒప్పిస్తున్నపాలన ఇది. ప్రభుభక్తిని మించిన దేశభక్తి లేని కాలం ఇది. ఈ వాతావరణంలో, ప్రజల కోసం, దేశ విముక్తి కోసం సర్వస్వం త్యాగం జేసిన మేధావులను, విప్లవకారులను, వారిని కన్న తల్లులను, వారికుటుంబాలను పదే పదే గుర్తు చేయాల్సిన అవసరం