శ్రీనివాస మూర్తి ‘ఖబర్‌కె సాత్’ పదిహేను కథలు చదవడమంటే రాయలసీమ ముప్పై సంవత్సరాల రాజకీయార్థిక పోరాటాల భావోద్వేగాలతో మిళితం కావడమే. 1978 నుండి మా వూరంత ప్రేమగా ` రాయలసీమతో నాకు అనుబంధం ఉంది. మధురాంతకం రాజారాం, నరేంద్ర, మహేంద్ర, పిసి నర్సింహారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వడ్డెర చండీదాస్, సింగంనేని నారాయణ, శేషయ్య, శశికళ, బండి నారాయణస్వామి, నాగేశ్వరాచారి, శాంతినారాయణ, దేవపుత్ర, కేశవరెడ్డి, నామిని, రాసాని, సడ్లపల్లి చిదంబర రెడ్డి, పాణి, వరలక్ష్మి, వెంకటకృష్ణ, సుభాషిణి, రామకృష్ణ, రాప్తాడు గోపాలకృష్ణ, చక్రవేణు, సౌదా, త్రిపురనేని శ్రీనివాస్, విష్ణు వంటి ఆత్మీయులందరితో కలిసి తిరిగిన రోజులవి. విద్యార్థి ఉద్యమాలు,