వందేళ్ల ఆర్ ఎస్ ఎస్ కుట్ర- జైలుపాలయిన రాజకీయ ఖైదీలు
జులై 2 చెరబండరాజు అమరత్వం రోజు విరసం ఆవిర్భావసభ సంఘపరివార్ వందేళ్ల ఫాసిజం పై సాంస్కృతిక ప్రతిఘటనా వ్యూహం ప్రకటించే ప్రతిజ్ఞ తీసుకోవడం చాల అర్థవంతంగా ఉంది. ఆయన విరసంలో తన కవిత్వం ద్వారా రచనల ద్వారా ‘ఏ కులమబ్బీ మాది ఏ మతమబ్బీ’ , ‘జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త’ వంటి పాటలు, కవితల ద్వారా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో తలపడినాడు. జీవితాచరణలో ప్రతిఘటించాడు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన చెంచల్‌గూడ జైల్లో ఉన్నపుడు విరసం, మరికొందరు విప్లవ పార్టీల, ప్రజాసంఘాల కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి డిటెన్యూలు అందరినీ ఒకే ఆవరణలో ఉంచారు. అట్లా దేశభక్తులను, దేశద్రోహులతో కలిపి ఉంచడాన్ని టైగర్