కవిత్వం

ఆమె బతికుండాలి

నేను గౌరీలంకేశ్నని చందుతులసి ప్రకటించిందో లేదో నాకు తెలియదుకానీ చందుతులసి బతికుండాలి చెడ్డీస్ చీడపురుగులు పంట్లాములలోకి పాకి ట్రోల్ల పుళ్లుపడిన నోళ్లు కాషాయ విషాలు చిమ్ముతూ చేతులు కర్రలే కాదు కత్తులూ త్రిశూలాలైన వేళ గౌరీలంకేశ్ స్వప్నసాకారం కోసం చందుతులసి బతికుండాలి ఆయుబ్రాణా వలె శత్రువు బొడ్లో వేలుపెట్టి సత్యం పలికించే సాహసాలకు దుర్గం ఇపుడు దుర్భేద్యమైంది కావచ్చు పరివార్ భావజాల పునాదులను పెకిలించే పరిశోధన కోసం ఇపుడామె బతికుండాలి అమెరికా ఇండియా పాలకుల డిఎన్ఎలో ప్రజాస్వామ్యం కాదు ఫాసిజం ప్రవహిస్తుందని ఫోరెన్సిక్ రిపోర్టు ఇవ్వడానికామె బతికుండాలి ఆ ఆవేదన, ఆరాటం, ఆక్రోశంగా ప్రకటించే ఆ అమాయక రుజువర్తనం
కవిత్వం

కవితా ధిక్కారం (ఐదు కవితలు)

1 .అర్థ చంద్రాకారపు ఆయుధం నిండు పున్నమి లేనేలేదు దుఃఖ సమయాన ఉత్సవముంటుంది పట్టడానికి ఆయుధముంటుంది కార్మికులు చూపిన కాంతి రైతులు పట్టిన చంద్రుడు తెలంగాణ స్తనానికి పాలు తాగిన పసిబిడ్డ సాయుధ పోరాటంలో రాటుదేలిన ఆడబిడ్డ మనముందే వున్నది, మనమధ్యే వున్నది ఏ కాలానికైనా కొడవలి మాత్రమే చంద్రుడు చంద్రుడంటే అర్థ చంద్రాకారపు ఆయుధం! * ప్రజాపోరాటంలో అమావాస్యలుండవు కొడవలి పట్టిన అమ్మలుంటారు మోదుగుపూల పాటలుంటాయి విముక్తిని అందించే అందమైన చందమామలుంటాయి * నిరాశలూ నిశబ్ధాలూ లేనేలేవు చందమామను పట్టడమే ఉత్సవం! * 2. కాంతి పిట్ట ~ గొంతులపై ఇనుప బూట్లకు నేను సాక్షిని అక్షరాలపై
కవిత్వం

అరణ్యమూ – నేను

నాకు దగ్గరగా అరణ్యము అరణ్యానికి దగ్గరగా నేనూ ఎల్లప్పుడూ తను చిగురిస్తూనే వుంటుంది నెత్తుటి పువ్వులను రాలుస్తూ విత్తనాలను భద్రపరుస్తూ ఒక్కొక్కరూ ఒరిగిపోతూనే ఓ గొప్ప‌ హామీని హృదయం నిండుగా నాటిపోతారు అమరులెప్పుడూ వేళ్ళలోకి చొరబడి నేలకూ ఆకాశానికి వంతెన నిర్మిస్తారు అందుకే అరణ్యమెప్పుడూ ఓ కొత్త పాటలా నన్ను హత్తుకుంటుంది…
కవిత్వం

జాతి విముక్తి

మనం ఎప్పుడు అతనికి శత్రువులమే .. ఎందుకంటే మన "జాతి" అస్తిత్వం కోసం పోరాడుతున్నాం.. సంవత్సరాలుగా సమూహంపై అమలవుతున్న ఆధిపత్యాన్ని ఎదురిస్తున్నాం.. "జాతీయత" పేరు మీద "ప్రాంతీయతను" అణిచివేస్తే తిరుగుబాటు దారిని ఎంచుకున్నాం రాజ్యం రక్తపు రుచి మరిగిన హింసోన్మాది స్వేచ్ఛ , స్వయంప్రతిపత్తి మన నినాదం.. మనిషి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవాలనేది మనందరి ఆశ.. మనల్ని తెలంగాణ లో నక్సలైట్ అన్నా ఈశాన్యంలో వేర్పాటు వాదీ అన్నా కాశ్మీర్ లో ఉగ్రవాది అన్నా ... హింసను ప్రతిఘటించడం జాతిని విముక్తి చేయడమే అంతిమ లక్ష్యం.. (జాతి విముక్తి పోరాటాలకు మద్దతుగా... హక్కులను అనచడం లో రాజ్యం ఏ
కవిత్వం

భయం

ప్రశ్నంటే ఎందుకంత భయం ప్రశ్నలచుట్టూ ఇనుప కంచె ఎందుకు ప్రశ్న వైపు నిలుచుని చూడ్డం నీకు రాదు గర్జించే ప్రశ్నకు తుపాకీ కాపలా పెట్టిన్నాడే నీ భీతి తెలిసింది ప్రశ్నను గాయపరచటం రక్తాన్ని కళ్ళచూడ్డం జైల్లో ప్రశ్నను బాధించటం ఉరికొయ్యకు ప్రశ్నను వేలాడదీయాలనుకోవడం నీ తాత్కాలిక ఊరట మాత్రమే ప్రశ్న ప్రజా సమూహం ప్రశ్న అలుపెరుగని పరంపర జవాబు చెప్పడం రాని నీకు ప్రశ్న మీద Fir అసహనాన్ని వ్యక్తం చేస్తావు రహస్యంగా రెక్కి చేసి మేధకు నాన్ బెయిలబుల్ తాళం వేస్తావు ప్రజలనుంచి దూరం చేసి ఏకాకితనంలోకి విసిరేస్తావు ఒక్కటి గుర్తుంచుకో సముద్రం లోని చేపల్ని వేటాడగలవు
ఖండన

బెల్లాల పద్మ, దేవేందర్‌ అరెస్టులను ఖండించండి

జూన్‌ 18 సాయంకాలం గుంటూరు దగ్గర ఓ గ్రామంలో బెల్లాల పద్మను, అదే రోజు హైదరాబాదులో దుబాసి దేవేందర్‌ను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేశారు. పద్మ అనేక అక్రమ కేసుల్లో సుదీర్ఘకాలంపాటు జైలులో ఉండి విడుదలై వచ్చింది. పద్మ అనే పేరు మీద నమోదై ఉన్న అక్రమ కేసులన్నిటినీ అమె మీద మోపి జైలు నుంచి బైటికి రాకుండా చేశారు. ఆ నిర్బంధాన్ని దాటి బైటికి వచ్చే సరికి ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. తిరిగి మామూలు పరిస్థితికి రాలేదనంతగా శరీరం శిథిలమైపోయింది. అయినా ఓపికగా న్యాయశాస్త్రం చదివింది. ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూనే ఓపిక ఉన్నప్పుడు సభలకు హాజయ్యేది.
వ్యాసాలు

ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన – కొన్ని ఆలోచనలు

(ఇది దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పేట్రియాటిక్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ – పిడి ఎం) మార్చ్ 26న గుంటూరులో జరిపిన సదస్సులో ‘ఫాసిజం – ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన’ అనే అంశం మీద చేసిన ఉపన్యాస పాఠం. సమయం లేకపోవడం వల్ల ఆ విశాలమైన అంశాన్ని మాట్లాడలేనని, ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన ఆవశ్యకత అనే అంశంలో కొన్ని కోణాలను, చరిత్ర అనుభవాలను మాత్రమే వివరిస్తానని ఉపన్యాసకుడు ముందే సూచించాడు) ఫాసిజం అంటే ఏమిటి? ఇవాళ దేశంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మించవలసిన అవసరమేమిటి? ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనను ఎట్లా నిర్మించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
వ్యాసాలు

ఎవరిదీ  తెలంగాణ ? ఎవని పాలైంది ?

డెబ్బై ఏళ్ళ తెలుగు రాష్ట్రం రెండు బలమైన ఉద్యమాలను చూసింది.ఒకటి నక్సల్బరీ రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.  సిద్దాంత రిత్యా రెండూ వైరుధ్యమైన ఉద్యమాలు అయినప్పటికీ  రెండు ఉద్యమాలూ సుధీర్గ కాలం నడిచాయి. ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నాయి అవి ఒక దానికి మరొకటి సంబంధ భాంధవ్యాలను కలిగి ఉంది. తొలివిడత తెలంగాణ మిగిల్చిన అసంతృప్తుల దావాలనమే  నక్సల్బరీ ఉద్యమాన్ని కొనసాగించాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకున్న ప్రతి గొంతూ ఈ రెండు ఉద్యమాలను గుండెలకు హత్తుకున్నాయి. ఇది పోరు భూమి, ఆట పాట సైదోడై కదన రంగాన్ని కవాతు తొక్కేలా చేసాయి.  సీమాంధ్ర దోపిడీ సాంస్కృతిక అభిజాత్యం పాలకుల నిర్లక్ష్యం
వ్యాసాలు

వాకపల్లి మహిళలపై అత్యాచారం – కోర్టు తీర్పు

పర్వత శ్రేణిలో,  మేఘాలతో దోబూచులాడే సుదూర కుగ్రామం వాకపల్లి. లోతట్టు అడవిలో ఎత్తైన కొండల దరి; గుంటలు, వాగులు, వంకలు కలయికతో; పాడేరుకు పోయే రోడ్డుకు సుమారు రెండు కిలో మీటర్ల దూరాన గల వాకపల్లి వాసుల రాకపోకలకు ఉన్న ఒకే ఒక దారి; ఆదిమ ఆదివాసీ తెగకు చెందిన కోందుల ఆవాసాలలో ఒకటి. వాళ్ళకు తెలుగు రాదు; వాళ్ళది కోండు భాష; అనాది కాలం నాటిది. నాగరిక జీవనానికి దూరంగా; దారీ, తెన్నూ తెలియని ఆదిమ ఆదివాసీ గిరిజన గూడెం వాసులపై నాగరికులు, అధునాతన సాయుధులు, ముష్కరులైన ప్రభుత్వ రక్షక దళాలు దాడి చేయడమేమిటి; వాళ్లపై అత్యాచారాలకు
ఖండన

చంద్రశేఖర్‌ అజాద్‌పై ఫాసిస్టుల హత్యాయత్నం

ఫాసిస్టు బుల్డోజర్‌ బాహాటంగానే రాజకీయ హత్యాయత్నాలకు పాల్పడుతుంది. తన ఆధిపత్యానికి, రాజకీయ సమీకరణాలకు అడ్డంగా ఉన్న ఏ శక్తినీ అది భరించలేదు. దీనికి ఉత్తరప్రదేశ్‌లో భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ రావణ్‌పై కాల్పులు ఉదాహరణ. జూన్‌ 28 బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు వెళుతుండగా ఆయన వాహనానంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.  ఈ ఘటనలో ఆయన శరీరంలోకి రెండు తూటాలు దూసుకెళ్లాయని వైద్యులు తెలిపారు.  సహరాన్‌పూర్‌ ఆసుపత్రిలో  డాక్టర్లు ఆయనకు వైద్యం చేస్తున్నారు.             ఈ ఘటనకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులను దేశ ప్రజలందరూ గుర్తుపట్టగలరు. ఉత్తరప్రదేశ్‌లోని  ఫాసిస్టు రాజ్యం తీవ్రరూపాలు దేశమంతా తెలుసు.