నాకు దగ్గరగా అరణ్యము
అరణ్యానికి దగ్గరగా నేనూ

ఎల్లప్పుడూ తను చిగురిస్తూనే వుంటుంది
నెత్తుటి పువ్వులను రాలుస్తూ
విత్తనాలను భద్రపరుస్తూ

ఒక్కొక్కరూ ఒరిగిపోతూనే
ఓ గొప్ప‌ హామీని హృదయం 
నిండుగా నాటిపోతారు

అమరులెప్పుడూ వేళ్ళలోకి చొరబడి నేలకూ ఆకాశానికి 
వంతెన నిర్మిస్తారు

అందుకే అరణ్యమెప్పుడూ
ఓ కొత్త పాటలా నన్ను హత్తుకుంటుంది…

One thought on “అరణ్యమూ – నేను

Leave a Reply