కగార్ కొనసాగింపే ‘జీరం ఘాటి’ మరణశిక్ష
‘జీరం ఘాటి’ ఘటనలో స్థానిక కోర్టు పది మంది ఆదివాసిలకు మరణ శిక్ష విధించింది. సాధారణంగా అయితే పది మందికి ఒకే కేసులో మరణశిక్ష విధించినప్పుడు ఒక రకమైన హడావిడి, ప్రచారం మీడియాలో జరిగేది. కానీ ఈ కేసులో అలాంటివి తక్కువగా కనిపించాయి. మావోయిస్టు ఉద్యమం బలంగా ఉండి ఉంటే దీనికి స్పందన మరోలా ఉండేదమో! 2013 లో ఎలక్షన్ ప్రచారం ముగించుకుని వస్తున్న కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ పై పెద్ద ఎత్తున సాయుధ మావోయిస్టులు దాడి చేయడం వల్ల 29 మంది వరకు మరణించారు. ఇందులో సుమారు 300 మంది సాయుధ మావోయిస్టులు, వందలాది మంది










