సామ్రాజ్యవాద యుద్ధం మహిళల్ని విముక్తి చేస్తుందా?
ఇరాన్లో మత ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2022లో మహిళలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మహ్సా అమిని అనే కుర్దిష్ మహిళ మరణం ఈ ఉద్యమాన్ని రగిలించింది. హిజాబ్ సరిగా ధరించలేదనే నేరానికి ఆమెను మోరల్ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కస్టడీలో ఆమె మరణించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ఇరాన్ ఆమ్మాయిలు బహిరంగంగా హిజాబ్‌లను మంటల్లో కాల్చేయడం, పొడవాటి జుట్టును కత్తిరించి పడెయ్యడం ప్రపంచమంతా చూసింది. నిరసన ప్రదర్శనల్లో వందలాది యువతీ యువకులు పోలీసు హింసకు బలయ్యారు. వేలాది మంది జైళ్లపాలయ్యారు. ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతప్తితో










