సంపాదకీయం

కవిత్వంలో మాదిగత్వం

ప్రతి కవీ తనదైన సొంత వాక్యాం ఒకటి ఇచ్చిపోతారు. సొంత వ్యక్తీకరణ అప్పగించి పోతారు. ఆ కవి చాలానే రాసి ఉండవచ్చు. చాలానే అచ్చేసి ఉండవచ్చు. కానీ కోర్‌ ఉంటుంది.  దాన్నే పాఠకులు తలచుకుంటారు. విమర్శకులు అంచనా వేస్తారు. మిగతావన్నీ వివరాలే. అవన్నీ చెప్పుకొనేది కోర్‌ను చేరుకోడానికే. అట్లా చూస్తే  కవిగా ఎండ్లూరి సుధాకర్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దళిత కవుల్లో కూడా ఆయనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.  సుధాకర్‌ తొలి సంపుటం ‘వర్తమానం’ 1992లో వచ్చింది. సరిగ్గా 30 ఏళ్ల కింద. ఒకసారి ఆ సంపుటాన్ని పరిశీలిస్తే కవిగా ఎండ్లూరి సుధాకర్‌ రూపొందిన తీరు కనిపిస్తుంది. ఆయనలోని
సంపాదకీయం

గద్దర్‌ మరణానంతరం

పది రోజులుగా అంతటా గద్దరే. అందరి నోటా గద్దరే. ఆయన పాటను తాము ఎట్లా విన్నామో చెప్పుకుంటున్నారు. ఆ పాట తమనెలా కుదిపి నిలబెట్టిందో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కవిత్వాన్ని, గొంతును, హావభావాలను, ఆహార్యాన్ని, ఆడుగుల సవ్వడిని తలపోసుకుంటున్నారు.  వ్యక్తిగా ఆయన గురించి తమకెట్లా ఎరుకైందో దగ్గరిగా చూసిన వారు తలచుకుంటున్నారు. ఈ మొత్తంలో దేనికదే చూస్తున్నవారున్నారు. అన్నీ కలిపి ఎట్లా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నవారు ఉన్నారు. ఆయన పాటను అనుభవించాల్సిందేగాని కొలతలు వేయవద్దంటున్నవారు ఉన్నారు. తామూ అంచనా వేస్తున్నామనే సంగతి మర్చిపోయి కొంచెపు అంచనాలు వేయవద్దనే వాళ్లూ ఉన్నారు. అసలు ఏ అంచనాలకు గద్దర్‌  మూర్తిమత్వం లొంగదనే
సంపాదకీయం

విభజన చట్టం చంద్రబాబుకు గుర్తుందా?

ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. ఇద్దరూ చాలా సౌకర్యంగా ఒకటి మర్చిపోయారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం. దానికి పదేళ్ల వయసు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ‘నవ్యాంధ్ర’ను నిర్మిస్తానన్నాడు. కానీ విభజన చట్టం గురించి ఊసెత్తలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు. విభజన చట్టం నోరెత్తలేదు.  చెరి ఐదేళ్లు వంతులవారి రాష్ట్రాన్ని పాలించారు. ఈ పదేళ్లలో తాయిలాలకు లోటు లేదు. ఉచితాలకు అంతులేదు. పోటీపడి సామాజిక పింఛన్లు వాగ్దానాలు చేశారు. తోచిన వరకు ఇచ్చారు. కానీ
సంపాదకీయం

మణిపూర్ మారణకాండ మాటున

‘జబ్బు పడిన కాదు జబ్బ చరిచిన ఏడుగురు అక్క చెల్లెళ్ళను చూడడానికి వెళ్లి వచ్చాను’ అని రాసాడు శివసాగర్ విరసం ఏర్పడిన పదేళ్ల సందర్భంగా వేసిన కవితా సంకలనానికి ‘పది వసంతాలు’ పేరుతో 1980 అక్టోబర్‌లో. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎవరో కాదు ఈశాన్య రాష్ట్రాలు. సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) ఏర్పడినాక తన ప్రజా యుద్ధ వ్యూహంలో దండకారణ్య పర్‌స్పెక్టివ్‌తో నక్సల్బరీ నాటి నుంచే తనకున్న ఈశాన్య రాష్ట్రాల, కశ్మీరు స్వయం నిర్ణయ హక్కును విడిపోయే హక్కుగా కూడా గుర్తిస్తున్న పార్టీగా ఏం చేయవలసి ఉంటుందో, ఏం చేయగలదో మళ్లీ తాజాగా ఒక అవగాహనకు వచ్చి