వర్తమానం

యుద్ధం – గతితర్కం

ప్రపంచ చరిత్ర అంతా వర్గ పోరాటాలు వాటి ఉన్నత రూపమైన యుద్ధాలు లేదా సాయుధ పోరాటాలు,తిరుగుబాట్ల చరిత్రే. నేడు అనేక దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని సామ్రాజ్యవాదులే ప్రత్యక్షంగా చేస్తున్న యుద్ధాలు కాగా మరికొన్ని వీరి ప్రోత్సాహంతో జరుగుతున్నవి. సామ్రాజ్యవాదమంటేనే యుద్ధమన్న సూత్రీకరణ నిరంతరం రుజువవుతునే ఉంది. సర్వ వ్యాప్తమైన ఈ యుద్ధం మునుపెన్నడూ కంటే నేడు మన సమాజాన్ని పీడిస్తుండడం వల్ల ఈ యుద్ధం అంటే ఏమిటి? ఇది ఎందుకు? ఎప్పటి నుండి ఉనికిలో ఉంది? ఇది ఎవరి ప్రయోజనాల కోసం ఉనికిలోకొచ్చింది? దీన్ని ప్రజలకు ఉపయోగపడేలా మార్చుకోవచ్చా? యుద్ధాలకు ముగింపు పలకడానికి మార్గం మేమిటి?
వర్తమానం

వెనుజులాపై దాడి – సామ్రాజ్యవాద సాధారణ ఆర్ధిక సంక్షోభానికి పరాకాష్ట

జనవరి 3 వ తేదీ అర్ధరాత్రి వెనుజులా రాజధాని కారకాస్ లోని అధ్యక్ష భవనంపై 200 మంది అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రత్యేక బలగాలు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన జీవిత సహాచరిని ఎత్తుకెళ్లి అక్రమంగా అమెరికాలో నిర్భంధించారు.ఈ కిడ్నాప్ కు ముందు ఏ అంతర్జాతీయ సంస్థలలో ఏలాంటి చర్చా లేదు.అమెరికా చట్ట సభ కాంగ్రెస్ అనుమతి కూడా లేకుండా అధ్యక్షుడు ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.1989 లో పనామా దురాక్రమణ తరువాత లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికా మిలటరీ చేసిన ఈ దురాక్రమణ పూరిత సామ్రాజ్యవాద దాడిని ఇతర ఖండాల,భూభాగాలలోని జాతుల రాజ్యాలైన