కవిత్వం

అరుణ్ కాలా కవితలు రెండు

ఆయుధం అనివార్యం….చట్టం ఒకరికి చుట్టం అయినప్పుడుఉన్మాదం నడి వీధిలో కవాతు చేస్తుందిబతుకే భారంగా సాగుతున్న అమాయకపు జనాల మీదఉక్రోశాన్ని చూపిస్తూ శివతాండవం చేస్తుందిఇది తప్పు అని ప్రశ్నిస్తే శూలం గుండెలను చీల్చుకుంటూ నెత్తుటి మరకలను సృష్టిస్తుందిరామ బాణం అంత వేగంగా బుల్లెట్ వర్షం ఇంటి గుమ్మం ముందు కురుస్తుందిపొత్తి కడుపులో పిండాన్ని తీసి మతం రంగు పులిమి దేశభక్తి గా మన మెదళ్లను చెదలు పట్టిస్తుంది….చట్టం చుట్టం అయితే నీవు నేను కాశయపు కత్తులకు ,ఖాకీ కర్రలకు బలికాక తప్పదుఅంతమంగా ఆయుధాన్ని పట్టక తప్పదు……. ఈ వెన్నెల రాత్రి కన్నీటిని మిగిల్చింది…..పచ్చని ఆకులతో అడవి చిగురిస్తున్న రోజుచీకటిని చీల్చుకుంటూ
పరిచయం

వొఖ్క భారతి.. అనేక ప్రశ్నలకు సమాధానం

‘ఎంతమంది ఆడోల్లు ఆ రుతువు ఎరక్కుండా వుండారో’  ఆడవాళ్ళో నోట్లో నువ్వుగింజ నానదు అని సామెత తయారుచేసి దానికి వుపపత్తిగా యెన్నో  పౌరాణిక గాథల్ని కల్పించుకున్నాం. ఆడవాళ్ళ మాటలకు  అర్థాలు వేరులే అని  పాటలు రాసుకున్నాం. మహిళల ముచ్చట్ల గురించి మగవాళ్ళు కట్టుకునే ట్యూన్లూ  కార్టూన్లు అనేకం. కానీ  ఏకాంత సమయాల్లో స్త్రీలు తోటి స్త్రీలతో చెప్పుకునే దేవ రహస్యాలు బయటి ప్రపంచానికి తెలీవు. ఇంటా బయటా వాళ్ళ ఆలోచనలపైన  వాటి వ్యక్తీకరణలపైన ప్రకటిత అప్రకటిత ఆంక్షలమధ్య నిషేధాల మధ్య అణచిపెట్టుకున్న మాటలు లోలోపల  వుగ్గబట్టుకున్న భావనలు చెప్పుకోడానికి అవకాశం వస్తే రాయడానికి ఇతిహాసాలు పురాణాలు చాలవు. యుగాలుగా
ఆర్థికం

పోషకాహార లోపం… పాలకుల వైఫల్యం!

నేటి బాలలే రేపటి పౌరులు. బాలల ఆహారం, ఆరోగ్యం, విద్య, మానసిక వికాసానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఆ దేశం అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. ప్రస్తుతం మన దేశంలోని బాలలు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. దేశం 2021లో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న 7 లక్షల మంది బాలలు చనిపోయారు. వీరిలో 5 లక్షల మంది (70 శాతంకు పైగా) పోషకాహార లోపంతో చనిపోయారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. తల్లి ఎదుర్కొంటున్న పోషకాహార లోపం పిల్లల మరణాలకు కూడా కారణమౌతున్నది. ఇదేకాలంలో ప్రపంచ వ్యాపితంగా 47 లక్షల మంది పిల్లలు మరణించారు. వీరిలో 24 లక్షల
స్పందన

1844 ఆర్ధిక, తాత్విక రాతప్రతుల గురించి

   కారల్ మార్క్స్  రచన ఇటీవల తెలుగు అనువాదమైంది. 1844 ఆర్థిక, తాత్విక రాత ప్రతులు. 1932లో జర్మనీలో వెలువడిన ఈ పుస్తకం తెలుగులో సమగ్రంగా రావడం ఇదే మొదటిసారి. పీకాక్ ప్రచురించిన రాత ప్రతులు సమగ్రం కాదు. మార్క్స్ తన ఇరవై నాల్గవ ఏట యవ్వనకాలంలో తన ముందు తరపు తాత్విక రచయితల నుండి అనుభవ సారం నుండి తనని తాను రూపొందించుకున్నాడు. కారల్  తర్వాత రచనలకు ఆర్థిక, తాత్విక రాత పతులు బీజం వేశాయి.దాదాపు నూరేళ్ల తర్వాత తెలుగులో వచ్చిన రచనకు ప్రాసంగిత ఏమిటి?  యువ మార్క్స్ గా ఉన్నప్పుడు  అధ్యయనం చేసిన అంశాలు తన
కవిత్వం

ఆదిమ పూల వాసన

నేల ఒరిగిన ఓ శిరస్సు దాని పెదవులపై కత్తిరించబడ్డ చిరునవ్వు కనులలో ఒలికి గడ్డకట్టిన రక్త చారిక గాయపడ్డ గొంతులోంచి ఓ పాట ఈ నదీ పాయ గుండా ప్రవహిస్తూ నీలోంచి ఉబికి వస్తూంది నువ్విదిల్చినా వదలని ఆ చిరునవ్వు నీలోకి ఇంకుతూ ఇగురుతూ నిన్ను అనామధేయుణ్ణి చేస్తూంది తొలి దారుల ఆదిమ పూల బాలింతరపు వాసనతో చుట్టూ పరివ్యాప్తమవుతూ మరల కార్యోన్ముఖుణ్ణి చేస్తూంది!!
Stories

Not Guilty

“BheemjiHajir ho... (Mr.Bheem present yourself) SuniljiHajir ho... (Mr.Sunil present yourself) JuliejiHajir ho...” (Ms.Julie present yourself) The court attender shouted loudly, so his voice echoed from the court entrance to the far end of the veranda. The entire veranda was bustling with activity. Above the entrance, there was a board written in Hindi indicating that it is the honorable judge K.N. Srivatsava's court, Court No. 4. There were many such courts
వ్యాసాలు

బాబ్రీ వివాదంలోన్యాయం చేయని సుప్రీం కోర్టు

(ప్రసిద్ధ న్యాయవాది, రచయిత, పాత్రికేయుడు, కాలమిస్ట్, ప్రత్యేక/పత్రికా శీర్షికా రచయిత ఎ. జి. నూరానీ 2024 ఆగస్టు 29 నాడు (93 సంవత్సరాలు) మరణించారు. ఆయన మరణంతో మన దేశంలో చట్టాన్ని మాత్రమే కాకుండా, సమాజాన్ని కూడా పర్యవేక్షించే ఒక బలమైన ఆధార స్తంభం కూలిపోయింది. తన జీవితంలో ఎప్పుడూ రాజీపడని స్తంభం. జీవితాంతం తాను సృష్టించిన ప్రజాస్వామిక, లౌకికవాద విలువలకు కట్టుబడి జీవించాడు. ఎమర్జెన్సీకి, బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగానూ, కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలన్నింటిపైనా నిర్భయంగా రచనలు చేసాడు. బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా తన న్యాయవాద వృత్తి కాలంలో ఎప్పుడూ అన్యాయం చేయలేదు.
సమకాలీనం

పర్యావరణం కోసం ప్రాణాలు కోల్పోయిన  కార్యకర్తలు 

‘గ్లోబల్ విట్‌నెస్’ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2012 నుండి పర్యావరణ పరిరక్షణా కర్తవ్యంలో  మొత్తం 2,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లోనే, కనీసం 196 మంది పర్యావరణ రక్షణ కార్యకర్తలు తమ ఇళ్లను లేదా సముదాయాలను రక్షించుకోవడానికి పోరాడుతూ మరణించారు. వీటిలో భారత్ పదో స్థానంలో ఉంది. పర్యావరణం, భూమి హక్కుల కోసం మాట్లాడే వారిపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఈ ఆందోళనకరమైన సంఖ్య ప్రపంచ సంక్షోభాన్ని నొక్కి చెబుతుంది. కొలంబియా వరుసగా రెండో ఏడాది కార్యకర్తలకు అత్యంత ఘోరమైన దేశంగా వుంది. 2023లో, గ్లోబల్ విట్‌నెస్ రికార్డ్ చేసిన ఒక్క సంవత్సరంలో మరే ఇతర దేశం కంటే
సంభాషణ

సంభల్: కల్పించిన నిశ్శబ్దం

మరోసారి 'మందిర్-మస్జిద్' వివాదంపైన పోలీసులతో జరిగిన ఘర్షణలో స్థానిక ముస్లిం పురుషులు మరణించిన, శతాబ్దాల నాటి ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో నిర్జన వీధుల నిశ్చలత భారంగా వుంది. మసీదు వెలుపల జరుగుతున్న పథ్‌రావ్ (రాళ్లు విసరడం) మధ్య హసన్ తన తమ్ముడిని వెతకడానికి వెళ్లినప్పుడు ఒక బుల్లెట్ లేదా ఒక పదునైన ముక్క తగిలి  అతని కుడి చేతిని గాయపరిచింది. అది ఎటు వైపు నుంచి వచ్చిందో -స్థానిక ప్రజలా లేదా పోలీసుల వైపు నుంచా అనేది - చూడలేకపోయాడు. ఎవరు కాల్చుతున్నారో కూడా గమనించలేదు. పోలీసులు మొదట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ తర్వాత చేర్చిన సంభల్
కవిత్వం

విగ్రహం

నేలన మనుషులున్నంత కాలం విగ్రహాలెందుకు మనిషి మనిషి తో మాట్లాడనప్పుడే శిల్పాల సృష్ఠి మొదలు మట్టితో మమేకమైన జనంకు బొమ్మల లొల్లి పట్టదు రుధిరం చెమట చుక్కై నుదుటి నుండి రాలుతుంటే చెక్కబడిన రాయి ధ్యాస వుండదు నాలుగు వేళ్ళు లోనికి వెళ్లటమే గగనమై పోతున్న చేతులకు శిల్పానికి దండం పెట్టే తీరిక ఉండదు వంగి వంగి నాట్లు వేస్తుంటే వంగిపోతున్న నడుములు నిటారుగా ఉన్న విగ్రహం చేతిలోని వరి వెన్ను ను కాంచ లేవవు ఎవరు వచ్చి పొడిసేదేమీ లేదనే ఇంగిత జ్ఞానం సాయం కోసం కళ్ళలో వత్తులు వేసుకుని చూడదు తన చుట్టూ ప్రకృతి ని