సంపాదకీయం

జీవనది మాట్లాడితే…

కుంభమేళా ముగిసింది. గంగానది ప్రవాహం కొనసాగుతోంది. కోట్ల మంది మనుషుల శరీర వాసనను నది తన నీటితో శుద్ధి చేసింది. నది రాత్రివేళ తనతో తను సంభాషించుకుంటుంది. ఇన్ని కోట్ల మంది మనుషులు.. సగ భారతదేశం నాలో మునక వేసిందా ఆని. నిరంతర ప్రవాహగతిలో నది నిశ్చల  జలధి  తరంగం. సముద్రతీరం లేని ప్రాంతంలో జీవించలేను అన్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు. అతని జీవన మజిలీలు విశాఖపట్నం, చెన్నపట్నం. సముద్రంతో మనుషులకు ఉన్న భావోద్వేగ స్థితిని శ్రీశ్రీ పలవరించారు. నదులు మానవ నాగరికతా వికాసానికి జీవనోత్సవాన్ని ఇచ్చాయి. నది నుండి మానవులు  ఎంత స్వీకరించాలో అంతకు  మించి  వశం చేసుకున్నారు
సంపాదకీయం

మ‌న జీవితాల్లోకి చొర‌బాటు

అత్యంత శక్తివంతుడ‌ని చెప్పుకోబడుతున్న నాయకుడు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆవును అనో,  కాదు అనో చెప్పలేకపోతున్నాడు. ఈ ఒక్క ప్రశ్నకే కాదు ఇప్పటిదాకా అయన దేనికీ జవాబు ఇవ్వలేదు.  కానీ ఆయన భక్తుల దృష్టిలో ఆయ‌న అత్యంత శక్తివంతుడు. ప్రపంచ అధినేతలను సైతం భ‌యపెట్టగలిగిన వాడు. అయన ఏమి చేసిన దేశం కోసం చేస్తాడని ప్రచారం చేసుకోగ‌ల‌వాడు. కానీ ఇప్పటిదాకా ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఎదుర్కోలేదు. అయితే  కంట కన్నీరు కారుస్తూ దేశభక్తి రాగాలాపన చేస్తుంటాడు. ఇప్పుడు పార్లమెంటులో దేనికీ జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. అంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న భారత
సంపాదకీయం

2024 ఎన్నికలు – హిందూ రాష్ట్ర స్థాపన

ఇప్పుడు దేశంలో ఎన్నికల కాలం నడుస్తున్నది. గత కొంత కాలంగా సాగుతున్న ఓట్ల యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. 2024 ఎన్నికలు ఈ దేశ  గమనాన్ని  నిర్ణయిస్తాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంటే, మరోసారి ఆ పార్టీ వస్తే దేశం ఏమైపోతుందని ఆందోళనపడేవాళ్లు ఎక్కువ అవుతున్నారు.  దీనికి కారణం లేకపోలేదు.  మూడోసారి  బిజెపీ అధికారంలోకి రావడం అంటే ‘హిందూ రాష్ట్ర’ స్థాపన అధికారికంగా ప్రారంభం కావడమే. ఇప్పటికే దానికి అవసరమైన సన్నాహాలను బీజేపీ పూర్తి చేసుకున్నది. సకల సాధనాలను ఉపయోగిస్తున్నది.  మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ ఉనికిని నిర్ణయించే ఎన్నికలు కూడా
సంపాదకీయం

శ్రీ‌శ్రీ‌కి ప‌ల్ల‌కి మోత‌

ప్ర‌భువెక్కిన ప‌ల్ల‌కి కాదోయ్‌ అది మోసిన బోయీలెవ్వ‌ర‌ని ప్ర‌శ్నించి,  ‘మాన‌వ చ‌రిత్ర వికాసాన్ని’ తిప్పి చూపిన శ్రీ‌శ్రీ‌ని, ఆయ‌న మ‌హాప్ర‌స్థానాన్ని ఈ రోజు (న‌వంబ‌ర్ 30న‌) తిరుప‌తిలో కొంద‌రు ప‌ల్ల‌కిలో ఊరేగించారు. ఈ కాల‌పు వికృత‌, జుగుప్సాక‌ర స‌న్నివేశ‌మిది. ఆద‌ర్శాలు, విలువ‌లు, విశ్వాసాలు త‌ల‌కిందులుగా ఊరేగిన దృశ్య‌మిది.  మారుమూల బొరియ‌ల్లో వినిపిస్తుండిన మూలుగులు న‌డిరోడ్డు మీద విక‌టాట్ట‌హాసమైన తీరు ఇది. శ్రీ‌శ్రీ‌ని నిలువునా పాతేసి ఆయ‌న శ‌వానికి చేసిన‌  స‌ర్వాలంకృత వేడుక ఇది.  మ‌హాప్ర‌స్థానం భారీ సైజ్‌లో అచ్చు వేయ‌డ‌మే విడ్డూరం. అది చ‌దువుకోడానికి ప‌నికి వ‌చ్చేది కాదు. ఏ లాభాపేక్ష లేకుంటే దాన్ని సాహిత్య‌లోకంలోని, ప్ర‌చుర‌ణ రంగంలోకి ‘ముచ్చ‌ట‌’
సంపాదకీయం

ఈ యుద్ధంతో చరిత్ర సమాధానపడుతుందా ?

ఇది చివరి అంకమని, అంతులేని నష్టమని అనేక వ్యాఖ్యానాలు ఒక పరంపరగా వస్తున్నాయి.    ఈ విషయాన్ని హృదయగతం చేసుకున్నవారు  బహువిధాలుగా స్పందించవచ్చు. ఈ దుఃఖ తీవ్రతకు కాస్త విరామం దొరికాక    మనుషులు తమదైన సమయాలలోకి వెళ్ళిపోతారు.  అమరత్వం చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయి నిరంతరం ప్రజ్వరిల్లుతూ ఉంటుంది . మానవ పోరాటమంతా ఇలానే నడిచింది .   మనుషులు ఎండిన ఆకులలా రాలిపోతారు . నాలుగు దశాబ్దాలుగా విప్లంలో భాగమైనవారు , అడవితో  స్నేహం చేసినవారు, అరణ్యం తమదే అనుకున్నవారు, ఒక నిర్మాణంలో ఉన్నవారు హఠాత్తుగా కాలంలో కలిసిపోతారు .  ఇవాళ చాలా అభిప్రాయాలు వస్తున్నాయి. కాలం చెల్లిన పోరాటం
సంపాదకీయం

వాళ్లది విధ్వంస సంస్కృతి

కొందరు నిర్మిస్తుంటారు. మరి కొందరు కూలదోస్తుంటారు. ఇళ్లు, వీధులు, ఊళ్లు మాత్రమే కాదు. జీవితాన్ని కూడా కూలదోస్తారు. తరతరాలుగా మానవులు నిర్మించుకున్న సంస్కృతిని నేల మట్టం చేస్తారు. మానవాళి నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేస్తారు. పాలకులు కూలదోస్తుంటారు. ప్రజలు లేవదీస్తుంటారు. ఢల్లీిలో సంఘ్‌ ప్రభుత్వం ముస్లిం జనావాసాలను బుల్డోజ్‌ చేయడం కేవలం ఒక తాజా విధ్వంస ఉదాహరణ మాత్రమే. మైనారిటీల ఇండ్ల మీదికి బుల్డోజర్లను తోలడం, పేదల తల మీది నీడను తొలగించడం, బ‌తుకు తెరువును నేల‌మ‌ట్టం చేయ‌డం ఒక ప్రతీకాత్మక విధ్వంసం. అందువల్ల కూడా దేశమంతా ఈ విధ్వంస చిత్రాన్ని నేరుగా పోల్చుకోగలిగింది. అంతక ముందే సకల
సంపాదకీయం

జూలై 4: చీకటి రోజుల వెలుగు గానం

తెలంగాణలో నిషేధాన్ని మోస్తూ ఈ జులై 4లోకి విరసం ప్రయాణిస్తోంది.   గత కొన్నేళ్లుగా తీవ్రమవుతున్న నిర్బంధం గత ఏడాది జులై నాటికే పూర్తి స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం మార్చి 30 నుంచి ఇప్పుడది మరోసారి నిషేధంగా మారింది. ఇదేమీ కొత్త కాదు. కానీ ప్రతిసారీ అనుభవం కొత్త‌దే.  కొత్త ధిక్కారమే.ప్ర‌తి అణచివేతా కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది, సృజనాత్మక వెల్లువలకు దారి తీస్తుంది. ఈ విష‌యం చెప్ప‌డానికి సుదీర్ఘ గతంలోకి వెళ్లనవసరం లేదు. ఈ ఒక్క ఏడాది  ప్రజలు,  సృజనజీవులు గడించిన అనుభవాలే చాలు.  మహా మానవ విషాదంగా మారిన కొవిడ్‌  మధ్య ఈ ఏడాది గడిచిపోయింది. అది
సంపాదకీయం

ఏడాదిగా కగార్‌ విధ్వంసం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఏడాది డిసెంబర్‌ 13 నుంచి మూడు రోజులు చత్తీస్‌ఘడ్‌లో పర్యటించాడు. ఆ సందర్భంగా ఆయన ‘మావోయిస్టు రహిత భారత్‌ అనే స్వప్నం సాకారమవుతోంద’ని అన్నాడు. ‘మావోయిస్టులందరినీ చంపేయడానికి   భద్రతా బలగాలు సిద్ధంగా, ఉత్సాహంగా ఉన్నాయ’ని అన్నాడు. ఆ తర్వాతి రోజు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యాడు.  అక్కడ బాబాసాహెబ్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మొదటి మాట ఆదివాసీ హక్కుల గురించి, మావోయిస్టు ఉద్యమం గురించి పట్టించుకునేవారికే వినిపించింది. మిగతా వాళ్లకు కూడా వినిపించే ఉండొచ్చు. కానీ మౌనం పాటించారు. తెలుగు సమాజంలోని గౌరవనీయ పాత్రికేయులు, మేధావులు, రచయితలు ఇందులో మొదటి వరుసలో
సంపాదకీయం

రాముడ్ని కాదు, రైతును చూడండి

ప్రతి ఉద్యమం సమాజానికి ఒక మేల్కొలుపు వంటింది. అది వాస్తవ పరిస్థితి పట్ల కళ్లు తెరిపించి మార్పు కోసం దారి చూపిస్తుంది. అయోధ్య రామున్ని అడ్డం పెట్టి హిందూ మెజారిటీని భక్తితో, ముస్లింలు తదితర మైనారిటీలను భయంతో కళ్లు, నోరు మూసుకునేలా చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంది బిజెపి. పాత ఎత్తుగడే కానీ ఇప్పుడు ఇనుమడిరచిన ఉత్సాహంతో, మీడియాను తన వశం చేసుకున్నాక రెట్టించిన బలంతో పాచిక వేసింది. రాముడొచ్చాడు అని దిక్కులు మోగేలా అరిచింది మీడియా. రాముడొచ్చాడు కాచుకోండి అన్నారు ఫాసిస్టులు. ఆ భజన మోతలో, ఆ ఆర్భాటంలో మణిపూర్‌ల కేకలు వినపడలేదు, అదానీల దోపిడి కనపడలేదు. ఇంకా
సంపాదకీయం

నిత్య నిర్మల నర్మదా ప్రవాహం

ఆమెను ఎప్పుడో ఒకసారి చూశాను. వ్యక్తిగత పరిచయాలు అక్కరలేని సామాజిక వ్యక్తిత్వాన్ని కొంతమంది సంతరించుకుంటారు. అప్పుడు మనం ఎక్కడ చెయి పెట్టినా వాళ్ల అద్భుత స్పర్శ మనల్ని పులకింపజేస్తుంది. మనం ఏది ఆలోచిస్తున్నా వాళ్లు ఒక వెలుగు రేఖ మనపై ప్రసరిస్తారు. మనం ఏ పని చేస్తున్నా వాళ్లు ఆసరాగా వచ్చి నిలబడతారు.  మనం ఏదో  వెతుకుతోంటే మన ముందు దారి పరిచిపోతారు.  సామాజికులుగా, సామూహిక చైతన్య ప్రతినిధులుగా మారినవాళ్లకే ఇది సాధ్యమవుతుంది. నర్మద అలాంటి జీవితం గడిపింది. అలాంటి వారితో కలిసి జీవించింది. దశాబ్దాల కఠోర జీవితాన్ని చైతన్యవంతంగా, ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా గడిపింది. వేలాది మందిని ప్రభావితం