పత్రికా ప్రకటనలు

తొలి తరం విప్లవ రచయితశ్రీపతికి నివాళి

ప్రముఖ కథా రచయిత శ్రీపతి(పుల్లట చలపతి) ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాదులో మరణించారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరిపురం. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఢల్లీిలో ఆలిండియా రేడియో న్యూస్‌ రీడర్‌గా పని చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన కథా రచనలోకి ప్రవేశించాక కొద్ది కాలానికి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. ఆ పోరాటానికి ప్రతిస్పందించిన తొలి తరం విప్లవ రచయితల్లో, బుద్ధిజీవుల్లో శ్రీపతి ఒకరు. శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంతో, సుబ్బారావు పాణిగ్రాహితో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉండేది. అందువల్ల కూడా ఆ పోరాట
పత్రికా ప్రకటనలు

కేంద్రంలోని బిజెపి కార్పొరేట్‌ విధానాలను ప్రశ్నిస్తున్న రైతాంగ ఉద్యమానికి జేజేలు, ఢల్లీ రైతాంగ ఉద్యమంపై ఫాసిస్టు నిర్బంధాన్ని ఖండిద్దాం

భారతదేశ చరిత్రలో ఎన్నదగిన ఢిల్లీ రైతాంగ పోరాటం మరోసారి ప్రజ్వరిల్లింది. రెండేళ్ల కింద ప్రధానంగా పంజాబ్‌, హర్యాణా ప్రాంతాల నుంచి ఢిల్లీని చుట్టుముట్టి ఏడాది పాటు  పోరాడినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్‌ అనుకూల, రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ  చట్టాలను రద్దు చేయాలని ఆ రోజు ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ ఒత్తిడికి నరేంద్రమోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆ ఉద్యమంలో వచ్చిన ఇతర ప్రధాన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇంత వరకు వాటి ఊసే లేకుండా సాధారణ ఎన్నికలకు ప్రభుత్వం
సంపాదకీయం

ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం

విప్లవ రచయితల సంఘం 29వ మహా సభలు27 , 28 జనవరి 2024 , సిద్ధార్థ అకాడమీ , విజయవాడ విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహా సభల ఇతివృత్తం ‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’. విప్లవోద్యమ మేధో, సాంస్కృతిక కంఠస్వరమైన విరసం ఆశయం ప్రజా జీవితంలోని సంక్షోభాలను విశ్లేషించడం. వాటికి ఉండగల పరిష్కారాలను ఎత్తి చూపడం. ఈ పని ఫాసిజం చెలరేగిపోతున్న సమయంలో మరింత సునిశితంగా చేయవలసి ఉన్నది. దేనికంటే మన సామాజిక సాంస్కృతిక జీవితం  చాలా జటిలంగా మారిపోతున్నది. వ్యక్తిగత, బహిరంగ జీవితాలు కల్లోలభరితంగా తయారయ్యాయి. ఆధునిక ప్రజాస్వామిక విలువలు సంక్షోభంలో పడిపోయాయి. మానవ సంబంధాల్లో
పత్రికా ప్రకటనలు

మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి

(మావోయిస్టు పార్టీ మీద, విప్లవ ప్రజా సంఘాల మీద నిషేధాన్ని ఎత్తివేయాలి, తెలంగాణ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌-1992ను రద్దు చేయాలి అనే డిమాండ్ల మీద డిసెంబర్‌ 30 శనివారం హైదరాబాదులో ఉదయం 10.30 నుంచి సాయంకాలం 5 గంటల దాకా విరసం నిర్వహించిన   రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌ నోట్‌) ప్రజాస్వామ్యం అంటేనే వేర్వేరు రాజకీయాల మధ్య సంభాషణ. ప్రజలు తమకు ఇష్టమైన రాజకీయాలను ఎంచుకోవడం.  వ్యక్తిగతంగా తమ అభివృద్ధికి, ప్రగతికి ఏ రాజకీయాలు కావాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛ ఉండటం. పార్టీలుగా, సంస్థలుగా సంఘటితమై వాటిని ఆచరించడం. మొత్తంగానే సమాజ వికాసానికి ఏ రాజకీయాలు దోహదం చేస్తాయో  నిరంతర చర్చ కొనసాగడం.