తులసి చందు భావ ప్రకటనా స్వేచ్ఛను ఫాసిస్టులు అడ్డుకోలేరు
జర్నలిస్టు తులసి చందును బెదిరిస్తూ, అసభ్యకర మాటలతో నిందిస్తూ సంఫ్‌ుపరివార్ మూక దాడి చేయడాన్ని విరసం ఖండిస్తోంది. ఆమె గత కొద్దికాలంగా ప్రజా సమస్యల మీద వీడియోలు రూపొందిస్తోంది. అందులో ఆమె చెప్పే వాస్తవాలకు, విశ్లేషణలకు విశేష ఆదరణ దొరుకుతోంది. ఆమె తీసుకొనే ప్రజాస్వామిక వైఖరిని వీక్షకులు అభినందిస్తున్నారు. కల్లోలభరిత ప్రజా జీవితాన్ని అర్థం చేసుకోడానికి ఆమె మాటలు దోహదం చేస్తున్నాయి. జర్నలిస్టులైనా, రచయితలైనా ఫాసిస్టు వాతావరణాన్ని వివరిస్తూ వాస్తవాలు చెప్పడం తమ బాధ్యత అనుకుంటారు. సత్యాన్ని ప్రకటించని రచన, జర్నలిజం వ్యర్థం. కానీ సత్యమంటే ఫాసిస్టులకు భయం. సత్యం చెప్పేవాళ్లంటే కంటగింపు. దేశవ్యాప్తంగా పాత్రికేయుల మీద, రచయితల