వ్యాసాలు కొత్త పుస్తకం

కులం – విప్లవోద్యమం

(త్వరలో విడుదల కానున్న *కులం - విప్లవోద్యమం* పుస్తకానికి రచయిత  రవి నర్ల రాసిన  ముందుమాట ) కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్‌ రావు కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం.  అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో
వ్యాసాలు

విమర్శనాత్మక దృక్పథం లేకపోతే విప్లవమే లేదు

రచయితలారా మీరెటు వైపు అని శ్రీ శ్రీతో సహా రచయితలను ప్రశ్నించకపోతే విప్లవ రచయితల సంఘమే లేదు. ఆ శ్రీ శ్రీ అయినా ఇరవై సూత్రాల పథకాన్ని పొగుడుతూ కవిత్వం రాసినప్పుడు విరసం ఆయనను సస్పెండ్ చేసింది. అంతెందుకు విప్లవోద్యమంలో ప్రజాపంథాకు, దండకారణ్య ఉద్యమానికి సైద్ధాంతిక బీజాలు నాటి సెట్ బ్యాక్ కు గురైన విప్లవోద్యమాన్ని పునాదుల నుండి నిర్మించిన కొండపల్లి సీతారామయ్యపై కూడా విమర్శనాత్మక దృక్పథం లేకపోతే ఈనాటి విప్లవోద్యమం 1990 ల తరువాత ఏ దిశలో వెళ్ళేదో ఊహకు కూడా అందని విషయం. భారత విప్లవోద్యమానికి ‘లెజెండరీ’గా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ను ఎవరు కాదనగలరు?
వ్యాసాలు

కార్మిక వర్గ మేధావి,  మేటి విప్లవ నాయకుడు ఆనంద్

భారతదేశంలో విప్లవోద్యమం పీడిత తాడిత కులాలకు, వర్గాలకు చెందిన ఎందరినో ప్రజానాయకులుగా, విప్లవ నాయకులుగా తీర్చి దిద్దింది. తరతరాల కుల, వర్గ పీడనలను తుదముట్టించాలని, భారతదేశాన్ని ఒక సుందర సామ్యవాద దేశంగా మార్చాలనే స్వప్నాలను లక్షలాది యువకులు, విద్యార్థులు కనేలా చేసింది నక్సల్బరీ తిరుగుబాటు. ఆ స్వప్నాన్ని కంటూ దాన్ని సాకారం చేసేటందుకు విప్లవ బాట పట్టిన అసంఖ్యాక యువకుల్లో కా. కటకం సుదర్శన్‌ ఒకరు. అలాంటి వారిలోని అగ్రగణ్యుల్లో ఆయన ఒకరు. నక్సలైట్‌ ఉద్యమ మలి దశలోని తొలి రోజులలోనే 19 ఏళ్ల ప్రాయంలో విప్లవోద్యమంలోకి వచ్చిన కా. సుదర్శన్‌ యాభై ఏళ్ల పాటు విప్లవోద్యమానికే తన
వ్యాసాలు

కుల నిర్మూలన – నూతన ప్రజాస్వామిక విప్లవం

(కా. డప్పు రమేశ్ మొదటి సంస్మరణ సభ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం) 1967 లో నక్సల్బరీ తిరుగుబాటుతో నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా మనదేశంలో స్థిరంగా వేళ్లూనుకుంది. ఇది ‘నూతన మానవుల’ నిర్మాణం అనే భావనను దేశంలో బలంగా ప్రవేశ పెట్టింది. రాజకీయంలో విప్లవ పథాన్ని ఆవిష్కరించడంతో పాటు సాహిత్యం, కళలు, సినిమా వంటి అన్ని రంగాలలో వినూతన కోణంతో ఆలోచించడం నేర్పింది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అంటూ చరిత్ర రచనలో పీడిత వర్గాల కోణం నుండి చరిత్రను చూడటం నేర్పించింది. ఆ నూతన దృక్కోణం స్పృశించని రంగమంటూ లేదు.